బ్రహ్మ పునః సృష్టి
- ఆర్ శర్మ దంతుర్తి
ఉమ్మడి ఆంధ్రదేశం విడిపోయాక ప్రథానమంత్రుల వారు గంగాజలం పట్టుకొచ్చి, ఆంధ్రదేశ శంఖుస్థాపన నాడు తనకూడా పట్టుకొచ్చిన మట్టితో సహా దాన్ని కాబోయే రాజథాని నోట్లో కొట్టాక నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళారు. ఆ నవ్వు చూసి డబ్బులు బాగా రాల్తాయనుకుని రాష్ట్ర అమాత్యులవారు రాజథాని నిర్మాణం అట్టహాసంగా మొదలుపెట్టారు. అందులో ఆయన చేసిన మొదటి పని భూసేకరణ కోసం రెండు చేతుల్తో ఓ ఖాళీ చిప్ప పట్టుకుని భిక్షకి బయల్దేరడం.
రెండేళ్ళు తిరిగేసరికి భూమి దొరికింది గానీ దానిమీద భవనాలకీ, రోడ్లు వేయడానికీ డబ్బులు లేకపోయాయి. భూదేవి అసలే ఎండలకి తట్టుకోలేక గిలగిల్లాడుతూంటే, మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టూ వర్షాభారం, నిథుల కొరతా మొదలయ్యేసరికి అమాత్యుల వారికేం తోచలేదు. ఈ లోపుల అరాచకం, రాజకీయాలతో రాజ్యం అస్తవ్యస్తం అవుతుంటే ప్రజలు విశృంఖలంగా దోచుకోబడుతున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది రాజకీయనాయకులవల్ల; ప్రజాధనం