అన్నమయ్య శృంగార నీరాజనం
“చాలు జాలు నీతోడి సరసాలు”
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
అన్నమయ్య తానే నాయిక పాత్ర ధరించి "చాలుఁ జాలు నీతోడి సరసాలు" అంటూ స్వామి వారి శృంగార చేష్టలకు కోపం ప్రదర్శిస్తున్నాడు ఈ కీర్తనలో.. ఆ ముచ్చట మనమూ చూద్దాం రండి.
కీర్తన:
పల్లవి: చాలు జాలు నీతోడి సరసాలు యిట్టె
పాలిండ్ల కొంగుజారి బయటఁ బడితిమి
చ.1. సిగ్గువడితిమిర నీ చేసిన చేతలకు
నగ్గమైతిమిర మరునమ్ములకును
దగ్గరి నీకాకల దగులఁబట్టి నేఁడు
బగ్గన నిందరిలోన బలచనైతిమి || చాలు జాలు ||
చ.2. నొగిలితిమిర నేము నోచిన నోములకు
పొగిలితిమిర నీ పొందులకును
తెగి నీవు నన్ను రతి దేలించి తేలించి నాకు
పగటు బిగువులెల్ల బచ్చిగా జేసితివి || చాలు జాలు ||
చ.3. దప్పి బడితిమిర నీతాలిములనే కడు
నొప్పి బడితిమీర నీ నొక్కు జేతల
ఇప్పుడిట్టె తిరువేంకటేశుడ నీవు నా
కొప్పు సవరము దీసి కొల్లగొంటి మానము || చాలు జాలు ||
(రాగం: రామక్రియ; రేకు సం: 92, కీర్తన; 5-364)
విశ