శ్రీరామాయణ సంగ్రహం
విభీషణ పట్టాభిషేకం
రావణుడి అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత లంకారాజ్యానికి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు శ్రీరాముడు. సుగ్రీవుణ్ణి సంతోషంతో కౌగిలించుకున్నాడు. తన పక్కనే వినీతుడై నిలిచి ఉన్న హనుమంతుణ్ణి చూసి శ్రీరాముడు 'నీవు ఇప్పుడు ఈ మహారాజు విభీషణుడి అనుజ్ఞ పొంది వైదేహిని చూసి నా విజయవార్త ఆమెకు తెలియచెప్పాలి' అని కోరాడు. అప్పుడు రాక్షసులు లంకాపట్టణంలో హనుమంతుడి పట్ల వినయవిధేయతలు చూపి గౌరవించారు. వెంటనే లంకాపట్టణానికి వెళ్ళాడు హనుమంతుడు. శ్రీరాముడు ఆమెకు చెప్పవలసిందని చెప్పిన వార్త వినిపించాడు. ‘నీవు చెప్పిన ఈ విజయవార్తకు నేనెట్లా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేడు. నీకెటువంటి బహుమానం ఇవ్వాలన్నా నేనిప్పుడు అశక్తురాలిని.’ అని సీతాదేవి మారుతిని శ్లాఘించింది.
సీతమ్మను పలువిధాల బాధలకు గురిచేసిన రాక్షసాంగనలను చంపివేస్తానని హనుమ చెప్పగా ఆమె అతణ్ణి వారించింది. “నా చుట్టూ ఉన్న ఈ స్త్రీలు నన్నెం