రామాయణ సంగ్రహం
శ్రీరామావతార సమాప్తి
శ్రీరాముడు తరువాత వానరప్రముఖులను, విభిషణుణ్జి తన దగ్గరకు రప్పించుకున్నాడు. వాళ్ళందరికి చెప్పవలసిన సంగతులు చెప్పాడు. ఆయనను సుగ్రీవాదులు అనుగమిస్తామన్నారు. శ్రీరాముడు విధివిధానంగా అయోధ్యా పౌరులు, వానర ప్రముఖులతో సరయూనది చేరి మహాప్రస్థానం పాటించాడు, వానర ప్రముఖులు శ్రీరాముడి యుద్దసహాయకులు అందరూ తమ తమ దేవతాలోకాలకు చేరుకున్నారు.
అయ్యోధ్య పౌరులందరికీ కూడా 'సంతానకాలు' అనే దివ్యలోకాలు లభించాయి.
ఫలశ్రుతి
శ్రీరామాయణం ఆదికావ్యం, సాటివేని మహాకావ్యం. దీని కథానాయకుడు శ్రీరామచంద్రుడు. ఉత్తమగుణాలన్నీ సమగ్రంగా కలిగినవాడు. ధర్నానికి ఆయన ప్రతిరూపం, రాజుగానే కాక, ఒక ఉత్తమ మానవుడుగా లోక క్షేమమే ధ్యేయంగా భావించినవాడు. సత్యమే ఉత్తమధర్మంగా స్వీకరించి, తన తండ్రిని సత్యసంధుడిని చేయటానికి రాజ్యం విడిచి అడవులకు పోయినవాడు. రక్షించమని కోరినవాడు శత్రువైనా సరే కాపాడటం వ్రతంగా పెట్టుకున్నవాడ