రావణుడి వివాహం
-అక్కిరాజు రామాపతి రావు
లంకారాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత దశగ్రీవుడు తన చెల్లెలు శూర్పణఖను, కాలరాక్షసుడి కొడుకైన విద్యుజ్జిహ్వుడి కిచ్చి పెళ్ళి చేశాడు. ఒకనాడు లంకాధిపతి వేటకు వెళ్లి, అక్కడ - నవయౌవనవతి అయిన తన కూతురితో చెట్టుకింద నిరీక్షణ దృక్కులుతో ఉన్న ఒక దైతుణ్ణి చూశాడు. రావణుడు విస్మయం చెంది 'ఈ నిర్జన వనంలో మీరెందుకిక్కడ ఉన్నారని' ఆ దైతుణ్ణి అడిగాడు.
అప్పుడా పిల్ల తండ్రి 'నేను దితి పుత్రుణ్ణి. నన్ను మయు డంటారు. దేవతలూ, రాక్షసులూ కూడా నాకు దగ్గర వాళ్ళే. దేవతలు నా ప్రజ్ఞాశాలితను మెచ్చి హేమ అనే అప్సరసను నాకు భార్యగా ఇచ్చారు. ఆమెతో నేను సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఉండేవాణ్ణి. ఇంతలో హేమ దేవతల పనిమీద స్వర్గానికి వెళ్లి ఇప్పటికి పదమూడు సంవత్సరాలైనా ఇంకా తిరిగిరాలేదు. పద్నాలుగో సంవత్సరం నేను నా ప్రజ్ఞనంతా వినియోగించి స్వర్ణప్రభా విలసితమైన, వజ్రవైడూర్య శోభితమైన ఒక నగరాన్ని నా మాయాశక్తితో నిర్