అనర్ధాలకు మూలం! అసూయలే శాపం!
-అమరనాథ్ జగర్లపూడి
అసూయ (Jeously) ఇది మనం తరచుగా వినే పదమే తనకున్నదేదో పోతుందనో, తనకు రానిది ఇతరులకు దక్కుతుందనే, తానూ పొందలేంది ఇతరులు పొందుతారనో అని మనస్సు అనేకానేక భావోద్వేగాలకు గురౌతూ మనసును అనేక చికాకులకు గురిచేస్తుంటుంటుంది ఇదే అసూయ అనే మూలాలకు బీజాలు. ఇది బుద్ధిజీవి యైన మనిషి లో సర్వసాధారణమైన విషయం. ఈ సాధారణం అసాధారణమైతేనే అసలు సమస్యలు ప్రారంభమయి మనసు అల్లకల్లోలంలోకి ముంచి అభద్రతా భావాలకు గురి చేస్తుంది.
సహజంగా వ్యక్తి తన ఉనికికి భంగం కలుగుతుందను కునేటప్పుడు,దాని వలన సమాజంలో తన సంబంధాలలో పరువు, ప్రతిష్టల లలో సమతూల్యతలకు భంగం కలుగుతుందనుకొనేటప్పుడు ఈ'అసూయ అనేది పొడసూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే ఒక్కొక్కసారి ద్వేషం రూపంలో అనేక అఘాయిత్యాలకు కారణమయి జీవితాలను నాశనం చేస్తుంది కూడా ప్రేమలు, చదువులు, ఆర్ధిక కారణాలు ఆటలు, పాటలు, రాజకీయాలు, సామాజిక వివక్షతలు, ఉద్యోగాల్లో, పిల్లల పెంపకాల