అమెరికాలో యోగీశ్వరుడు-2
(రెండో భాగం)
-ఆర్. శర్మ దంతుర్తి
జరిగిన కధ – బతక నేర్చిన బడిపంతులు సుబ్బారావు గారు జాతక చక్రం వేయడం, పంచాంగం రాయడం నేర్చుకున్నాక, తననో పరమహంస గా భావించుకుంటూ, తన కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అమెరికాలో దిగేక తానూ అమెరికా వచ్చేడు విజిటర్ వీసా మీద. అక్కడ ఒక ఎన్నారై హిందూ గుడిలో ఏర్పాటు చేసిన ప్రసంగంలో పరమహంస గారు మాట్లాడ్డం అయ్యేసరికి సుబ్బారావు గురూజీకి కొంతమంది శిష్యుల్లా తయారయ్యేరు. మరోసారి అమెరికా వస్తాననీ, ఈ లోపున కొడుకు తనకి తయారు చేసిపెట్టిన వెబ్ సైటు ద్వారా దేశం నుంచే శిష్యులని ఉద్ధరిస్థాననీ ఆ వెబ్ సైటు రోజూ చూస్తూ ఉండమనీ చెప్పి తాను ఇండియా వెనక్కి వచ్చేసేడు. మరి కొంత కాలానికి రెండో సారి అమెరికా వచ్చేడు సుబ్బారావు. ఇంక చదవండి.)
రెండో అమెరికా ట్రిప్పులో రోజులు అద్భుతంగా గడిచిపోతుండగా కాస్త చలి రోజుల్లో ఓ వీకెండు డిన్నర్ పార్టీలో ఒక శిష్యుడు ప్లేటులో ఫుడ్ తెచ్చుకోవడానికి హాల్లో ఇటు