శ్రీ దేవులపల్లి క్రృష్ణశాస్త్రి!
- S. హరికృష్ణశాస్త్రి
శ్రీ దేవులపల్లి క్రృష్ణశాస్త్రి!
(వారి 125 వ జన్మదినం,నవంబర్ 1, సందర్భంగా)
ఆకులో ఆకునై కానలో ఆగిపోదునను
కవితా మౌని/
నాక వాహినీ శీకర సమ స్వాదు పద
సువిశేష ధని/
ఆక్రృతి లేని మొయిలునె దూతగ ఒప్పించిన
గేయ చణి/
సకల ప్రక్రృతి శోభతో మై మరచు భావాంబర ద్యుమణి!
*****
సుర నందన కుందము లందముగ మాల కట్టినట్లు
వర వీణా పాణి, వాణియె పలుకుల నందించినట్లు
పూర్ణిమా స్నపిత శబ్ద ద్యుతు లెదురుగ నిల్చినట్లు
విరియు నా గీతములు శబ్దార్ధ భావ సౌరభములై!!
*****
నవ్విన లోకమును జూసి తా నల్లన లోలోన నవ్వుకొనె
రివ్వుమని పై కెగయు గువ్వకు దిశల చెప్ప జాలుదురే
సవ్వడియె లేని హృదయ విపంచీ రాగముల నాపుదురే
పువ్వులై భావము ల్మది విరియ,తావి నొల్లరె యనుచున్!!
****
భరత మాతను సేవించె, గేయ సుందరోద్యానముల,
బాగ ననల పూయించి!
శ్రీ శైలేశ భ్రామరుల కొల్చె పద సురభు ల్సిరి గిరి
నల్