కవితా స్రవంతి

🌷నీ పరిచయం🌷

కవితా స్రవంతి
నీ పరిచయం రచన శాంతి కృష్ణ, హైదరాబాద్. 9502236670 వసంతపు పరిమళాలను అద్దిందేమో... చివురులు తొడిగాయి శిశిరపు గురుతులన్నీ...! ప్రతి వేకువ కొన్ని నవ్వుల పువ్వులతో ప్రతి రేయి తీయని ఊసులతో.... మన మాటలన్నీ కోయిల కూజితాలుగా మధుర ధ్వనులయ్యాయి... మన నవ్వులన్నీ విప్పారిన కుసుమాలుగా నందనవనమయ్యాయి... మన మనసులు మళ్ళీ పురి విప్పిన మయూరాలై నర్తించడం మొదలెట్టాయి... మనకే తెలియని సరికొత్త లోకాన్ని సృష్టించుకుంటూ... ఇప్పుడేమైందో తెలియదు ఆ మైత్రీవనం వాడిపోతోంది... వసంతపు పరిమళం జాడలేక... ఇప్పుడు.... రాత్రంతా నడచిన జాబిలి అడుగులు వేకువ కళ్ళకు నిట్టూర్పులుగా మిగిలాయి.... కొన్ని గురుతులంతే కాలాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి.... కరిగి పోయిన క్షణాలను లెక్కించుకుంటూ...!!  

కొత్త సూర్యుళ్ళు మొలిచితీరాలి

కవితా స్రవంతి
- డా. రావి రంగారావు అప్పుడే నాకు మీసాలు మొలుస్తున్నాయి, మిర్చి బజ్జీ మషాళా పొట్లం నా గొంతు విప్పాను.... అప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కొత్త సూర్యుళ్ళే కత్తు ల్లాంటి గొంతులతో పొడుచుకొచ్చేవాళ్ళు, ఎండల మీసాలు తిప్పుకుంటూ కిరణాల రోషాలు పెంచుకుంటూ... స్థూల కాయం చీకటి తొక్కేసిన కాలాన్ని ఇవతలకు లాగి కాపాడిన చంద్రుళ్ళు కూడా వచ్చి సూర్యుళ్ళ ఎదురుగా వినయంగా కూర్చునేవాళ్ళు, చంద్రుళ్ళలో చాలా మంది సూర్యుళ్ళుగా మారిపోయేవాళ్ళు... సూర్యుళ్ళను చూడటానికి పొలాలు నడిచి వచ్చేవి కలాలు కదిలి వచ్చేవి కొడవళ్ళు పారలు వివిధ ఉపకరణాలు ఎక్కడెక్కడినుంచో సైకిళ్ళమీద ఎడ్ల బండ్ల మీద బస్సుల్లో రైళ్లల్లో సాగి వచ్చేవి సూర్యుళ్ళ కిరణాలను గుండెల్లోకి తీసుకొని అన్నీ సూర్యుళ్ళయ్యేవి... జగ మంతా సూర్య మయం అవుతుందని నేనూ ఓ సూర్యుడినై నిప్పులు తొక్కటం మొదలుపెట్టా... కాలం మారిపోయింది, ప్రవాహం ఆరిపోయి

ఆచారాల పేరిట

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు ఆచారాలపేరిట అజ్ఞానానికిలోను కాకండి. విచారాలపేరిట విజ్ఞానానికిదూరంకాకండి. ఆచార్యులపేరిట అజ్ఞానులనుఆదరించకండి. జాతకాలపేరిట జీవితాలనుబలిచేసుకోకండి. కులాలపేరిట కలకలం సృష్టించకండి. మతాలపేరిట మారణహోమం మొదలెట్టకండి. దైవంపేరిట దగాచేయకండి. నమ్మినవారిని నట్టేటముంచకండి. ప్రవచానాలపేరిట అసత్యాన్నిప్రచారంచేయకండి. మతమార్పిడిపేరిట మూర్ఖులనుముంచకండి. భక్తిముసుగులో భ్రమలనుప్రోత్సహించకండి. శక్తిపాతంపేరుతొ సత్యాన్నివక్రీకరించకండి. దైవానుగ్రహానికి దగ్గరదారులువెతకకండి. ****

2018 కవిత

కవితా స్రవంతి
-రాపోలు సీతారామరాజు వస్తూ వస్తూ కోటి ఆశలను మోసుకొచ్చావు అడుగుపెడుతూనే భారత అంధుల క్రికెట్టులో వెలుగురేఖలు పూయించావు సొంతంగా యుద్ధవిమానంలో ‘అవని’ని అవనిలోకి ఎగిరించావు జిమ్నాస్టిక్స్ లో ‘దీప’కు బంగారపుటద్దులద్దావు పర్యావరణాన్ని పచ్చగా ఉంచాలంటూ ప్లాస్టిక్ ని నిషేధించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి సంకల్పదీక్షనిచ్చావు స్వలింగసంపర్కం సబబేనంటూ సుప్రీంతో తీర్పునిప్పించావు ఆలయంలోకి ఆడవారిని ఆహ్వానించమంటూ అయ్యప్పకే ఆర్డర్లు వేశావు ఆటగాడిని అందలమెక్కిస్తూ పాకిస్తాను ప్రధానిని చేశావు అడవుల్ని అన్యాయంగా నరకొద్దంటూ కేరళని కన్నీటివరదలో ముంచావు కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు రేపావు పుతిన్ ని నాలుగోసారి రష్యా గద్దెనెక్కించావు అక్కడే ప్రపంచదేశాలతో బంతిని తన్నించి ఫ్రాన్స్ ని ప్రపంచ విజేత చేశావు అరవైయేళ్ళ కాస్ట్రో కుటుంబపాలన కాదని క్యూబాలో కొత్తవారిని కోరుకున్నావు ప్రజల ఆకాంక్షలని సమాదర

గజల్

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ కవిత్వమే ఎప్పుడూ రాయాలని ఉంటుంది వాస్తవాన్ని కళ్లముందు పెట్టాలని ఉంటుంది నీతిని,నిజాయితిని ఉరి వేసి చంపుతుంటే నిప్పులా,అగ్గిరవ్వలా మండాలని ఉంటుంది న్యాయానికి సంకెళ్లు వేసి తిప్పుతుంటే ధర్మం వైపు ఎప్పుడూ నిలబడాలని ఉంటుంది సంకుచితమే సమాజంలో ఏలుతూ ఉంటే మానవతా జెండా ఎగరేయాలని ఉంటుంది మనసుకు గాయాలు తగులుతూ ఉంటే నిస్సహాయంగా ఉండిపోవాలని ఉంటుంది తడిలేని పదాలను పలుకుతూ ఉంటే మనిషిపై జాలి చూపాలని ఉంటుంది కోరికలు ఎప్పుడూ జనిస్తూ ఉంటే భీంపల్లి మనసును అదుపులో పెట్టాలని ఉంటుంది ****

ఆభరణాలు

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి. అజ్ఞానం,అమాయకత్వం బాల్యానికి ఆభరణాలు. ప్రేమ,ద్వేషం యవ్వనానికి ఆభరణాలు. సుఖ దుఃఖాలు జీవితానికి ఆభరణాలు. జపతపాలు జ్ఞానానికిఆభరణాలు. మందులు,మాత్రలు ఆర్యోగ్యానికి ఆభరణాలు. తీర్ధయాత్రలు మనో వికాసానికి ఆభరణాలు. గుళ్ళు,గోపురాలు సచ్ఛీలతకు ఆభరణాలు. ***

ఆటవెలదిలో అమెరికా

కవితా స్రవంతి
- సబ్బని లక్ష్మీనారాయణ ఆట వెలది లోన అమెరికా కథరాసి తేట తెల్ల పరుతు తెలుగు లోన అగ్ర రాజ్య మదియు అన్ని రంగాలలో ఉజ్వలమ్ము చూడు ఉర్వి మీద ! చూడ చక్కదనము చూసిన మేరనూ అందమైన దేశ మదియ కనగ పచ్చదనము చూడు పరిశుభ్రతయు చూడు ముదము తోన మదియు మురిసి పోవ ! జాతులన్ని అచట రీతితో అలరారు మతము లన్ని యచట మసలి యుండు దేశ రక్షణమ్ము దీటైన పాలన క్రమము శిక్షణకదియు క్రతువు చూడు చెట్లు చేమ లవియు చేరి నిలకడగ పచ్చదనము చూడు పరిమళింపు అడుగు అడుగు లోన అంద మదియ చూడు ఎంచి చూడ బతుకు ఎదలు మురియ కుక్క పిల్ల కూడ కూడి బతుకు చుండు చెంత నుండె తోడు చెలిమి తీరు ముద్దు చేయ జనులు ముద్దార బతుకును చక్కనైన బతుకు కుక్క బతుకు ! అమెరికనెడు దేశ మందరి దదియును అద్భుతమ్ము లెన్నొ ఆలకింప సుందరమ్ము మనకు సుస్వాగతమనును అందమైన దేశ మదియ చూడు ! రోడ్ల మీద కార్లు రొప్పుకుంట జనులు దారులన్ని చూడు బారు తీరి కార్లు ఎక్కువచట దార్లు ప

రెండూ అవసరమే

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. జీవితానికి ఆటలు, చదువూ రెండూ అవసరమే. అమ్మ, ఆలి ఇద్దరూ అవసరమే. వయసు,మనసు రెండూ అవసరమే. శ్రమ, విశ్రాంతి రెండూ అవసరమే. నవ్వు, ఏడుపు రెండూ అవసరమే పగలు, రాత్రి రెండూ అవసరమే. ప్రేమ,ద్వేషం రెండూ అవసరమే. జ్ఞాపకం, మరపు రెండూ అవసరమే భక్తి, రక్తి రెండూ అవసరమే. సంసారం,సన్యాసం రెండూ అవసరమే. బంధం, మోక్షం రెండూ అవసరమే. ఆవేశం, ఆలోచన రెండూ అవసరమే ప్రేమ, ద్వేషం రెండూ అవసరమే ఆసక్తి, విరక్తి రెండూ అవసరమే పరవశం, పరితాపం రెండూ అవసరమే నమ్మకం, అనుమానం రెండూ అవసరమే శిక్ష, రక్ష రెండూ అవసరమే నిజం, అబద్ధం రెండూ అవసరమే గోప్యం, బహిరంగం రెండూ అవసరమే మౌనం, భాషణం రెండూ అవసరమే భోజనం, ఉపవాసం రెండూ అవసరమే కలిమి, లేమి రెండూ అవసరమే ఊహ,అనుభవం రెండూ అవసరమే! జననం, మరణం రెండూ అవసరమే. ****