ఇగో నిన్నే !
- ఫణి మాధవ్ కస్తూరి
ఇగో నిన్నే ....
ఎందుకా చికాకు ? ఎవర్ని చూసి ఆ అసహనం ?
ఎవడ్ని చూసినా ఆ కోపం ?
ఇగో నిన్నే ...
ఒక్క సారి చుట్టూ చూడు, ఇప్పుడు లోపలికి చూడు..
అసలు నిన్నవడైనా పట్టించుకుంటునాడా.. నిన్ను నువ్వు గమనిస్తున్నావా
ఇగో నిన్నే
ఎన్నాళ్ళైంది నువ్వు మనసారా నవ్వి, పక్కవాడి ఎదుగు చూసి నవ్వి
నీవాళ్లతో మనసు విప్పు మాట్లాడి. అసలు నీతో నువ్వు మాట్లాడి... ఎన్నాళ్లైందీ...
ఇగో నిన్నే
ఎందుకా ఇగో… ఏం సాధించావని
ఇగో నిన్నే... గుర్తెట్టుకో...జనం లేక మనం లేము..
ఆ మనం లో జనం లో నువ్వూ ఉన్నావా ? ఇగో నిన్నే ...