కవితా స్రవంతి

*అన్యాపదేశం*

కవితా స్రవంతి
-దర్భముళ్ల  చంద్రశేఖర్ నిన్నటిలో పుట్టిన అబద్ధానివి నువ్వు... రేపటిలో మొలిచే నిజాన్ని నేను! ఏ ఉన్మాదుడి ఊహలోంచో... ఊహాన్ లోంచో... ఉరికి వచ్చి, ఊరికొచ్చి ఉరి చిచ్చు పెట్టిన ఉపద్రవానివి... జడ లిప్పుకు తాండవం చేస్తున్న జగజ్జంత్రీవి! ఊడలు ఊబిలోకి దిగేసి నిర్దాక్షిణ్యంగా నాల్కతో లాగి నలిపేసే దెయ్యాల మర్రివి... రాక్షస కంత్రీవి!! అయినా నా ధృడ సంకల్పం ముందు నువ్వు నన్నేమి చేయలేవు........!!! ఒక్క బేతాళుడివి... కొమ్ములతో వేలాడే పాపాల పాతాళుడివి... ఏ భుజం ఆసరాగా దొరుకుతుందని చూసే పిచ్చి పీనుగవి నీలాంటి ఎందరో బేతాళుల్ని ముగింపు లేని వందల వేల శంకల్ని వంకల్ని తెగ నరికే విక్ర"మార్కు" తలారిని నేను!!! గుర్తుందా.... ఆనాడు అమృతాన్ని అరచుక్క చవి చూడకుండానే నాల్కలు చీల్చుకున్న విష సర్పమా... నీ కందకుండా అమృతభాండాన్ని అదిలించి మరీ ఎగరేసుకు పోయిన దమ్మున్న  ఖగరాజుని నేను రా! ఈనాడు నా గ

గజల్

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నీ తలపే నన్ను ప్రేమలో ముంచేసింది నీ వలపే నన్ను ప్రేమలోకంలో దించేసింది తొలిచూపులే కదా పలికింది ప్రణయం నీ మనసే నన్ను ప్రేమమైకంలో ముంచేసింది నిరంతరం వెంటాడే నీ ప్రేమకిరణం నీ చూపే నన్ను మోహంలో కప్పేసింది నువ్వే కదా నా జీవితానికి ఆరోప్రాణం నీ విరహం నన్ను వియోగంలో ముంచేసింది నీవులేని జీవితం నిజానికెంత నరకం నీ ఎడబాటు నన్ను కన్నీరులో ముంచేసింది జీవితమంతా ఆరాధనే కదా భీంపల్లి మరపురాని ప్రేమ జ్ఞాపకాల్లో ముంచేసింది

హృదయం ఊగిసలాట

కవితా స్రవంతి
- కొలిపాక శ్రీనివాస్ గతకాలపు జ్ఞాపకాలు వర్తమానంతో ముచ్చటిస్తున్నాయి నిరంతరం నీ తలపులలో పయనించి అలసిపోయిన రోజులన్నీ గుర్తొచ్చేసరికి..! మనసంతా కలుక్కుమంటుంది ప్రేమగా ముచ్చటించిన సంగతులు కాలం నీడలో కదిలిపోతున్న క్షణాలు యుగాలై మనోవేదనను రగిలిస్తున్నాయి..! అలవోకగా నీ జతలో గడిపిన గురుతులు ఇప్పుడు భారమై కాలము కఠినత్వాన్ని ప్రదర్శిస్తోంది గతములో నీ సహచర్యపు సంగమం ప్రకృతితో మిళితమైన మధురానుభూతులు.. ఉప్పెనలా ఎగిసిన ప్రణయ వేదనలు ప్రస్తుతాన్ని చుట్టుముట్టి ఊగిసలాటలో ఊరేగిస్తున్నాయి. సమయం తెలవని సంభాషణలన్నీ కూడా ఇద్దరికీ నడుమ మధ్యవర్తిగా ఉన్న చరవాణికి అడిగితే తెలుస్తుంది.! ఆశలకు స్వప్నాలకు మధ్య వారధిగా నిలబడి ఉత్తేజాన్ని కలిగించిన మాటలు నలుదిక్కుల ప్రతిధ్వనిస్తున్నవి నీ స్పర్శ తాలూకు ఊసుల తార్కాణాలు అదిమీ పట్టేస్తున్నవి హృదయం ఎప్పుడూ ఊగిసలాటలో.... ఊహల్ని అల్లుకొని కడత

ఓటుకు అమ్ముడు పోవద్దురా

కవితా స్రవంతి
- శైలజామిత్ర, హైదరాబాద్ ఓటుకు అమ్ముడు పోవద్దురా నిన్ను నువ్వే అమ్ముకోవద్దురా ఓటుని బేరానికి పెట్టావంటే నీ ఉనికే ఉండదురా రేపు నీ ఊసే ఉండదురా !!ఓటు !! ముందుకు బానిస కావద్దురా మందు సీసగా మారద్దురా గద్దెనెక్కేటోళ్ల వెతుకులాటంతా నీ బోటి వాళ్లెరా ఒక్క అవకాశమిస్తే పొడుచుకు తింటారురా గద్దలై పొడుచుకు తింటారురా !!ఓటు !! అన్నమంటూ పరుగులు తీయద్దురా బిరియాని పొట్లాంగా మారద్దురా ఒక్కపూట నువ్వు కక్కుర్తి పడితే మిగిలేది ఐదేళ్ల ఆకలిరా నీకు మిగిలేది ఆకలి చావేరా !!ఓటు !! డబ్బుకు తన్నుకు లాడద్దురా ఐదేళ్ల కాలం ఐసై కరిగిపోతాదిరా ఒక్క నోటుకోసం ఎంబడ బడితే బతుకంతా బూడిదేరా నీ బతుకంతా బూడిదేరా !!ఓటు !! విద్య లేని బతుకు పశువుకన్నా హీనంరా వైద్యం లేని ఊరు కంటే స్మశానం నయంరా ఈ విషయాలన్నీ పెడచెవిల పెడితే నీకు విషమే మిగిలెను రా తిననీకి విషమే మిగిలెను రా !!ఓటు !!

మిథ్యావాదం

కవితా స్రవంతి
- తాటిపాముల మృత్యుంజయుడు మాయంటావా? అంతా మిథ్యంటావా? అని అనలేదా శ్రీశ్రీ నీవలనాడు? నీవే నేడుంటే, ఈ బ్రతుకే కనివుంటే ఒట్టు తీసి గట్టున పెడతావ్ ఒక స్వప్నం అని ఒప్పేసుకొంటావ్ కలయో లేక వైష్ణవ మాయయో కంటిచూపును కప్పేస్తున్న తెరయో కంప్యూటర్ నడిపిస్తున్న లీలయో, మరి కృత్రిమ మేధస్సు ఆడిస్తున్న ఆటయో చూసేదంతా నిజమే కాదు చూడనిదంతా లేదని కాదు చూసి చూడని చూపుల మధ్యలో చోద్యం చూస్తున్న జీవితం మాది జైలు సెల్లులో చీకట్లో మూలన ఖైదీ ఆఫీసులో నల్లకోటులో అతని న్యాయవాది గంతలు కట్టిన దేవతతో కోర్టులో న్యాయమూర్తి అంతర్జాలంలో జరిగే వాదోపవాదాలు వినిపించే తీర్పులు, విధించే శిక్షలు ఈ వింతను ఎపుడైనాగన్నామా? కనులారా చూసామా? స్వచ్ఛంగా, ఉచ్ఛారణ దోషం లేకుండా ఫోనులో చిలుక పలుకులు పలికే చిన్నది అచ్చంగా జవసత్వాలున్న గుమ్మ కాకపోవచ్చు టెక్నాలజీ సృష్టించిన టక్కుఠవళీ ఐవుండవచ్చు పడకగదిలో ఒడిలో ల్యాపుటాపుతో శయని

జ్ఞానం

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. కులాలు, మతాలు నదుల లాంటివి! నదులుగా చూస్తే వేరుగా కనిపించే నీరు గంగగా చూస్తే ఒకటే అనిపిస్తాయి. మనుషులుగా చూస్తే వేరుగా కనిపించే కులాలు,మతాలు మానవత్వంతో చూస్తే ఒకటే అనిపిస్తాయి. “నేను” వేరుగా ఉంటేనే బేధాలు వస్తాయి, నేను, మీరూ మనంగా మారితే వాదాలు రావు. నదులన్నిటిలో నీటిని దర్శిస్తే,ఒకటిగానే కనిపిస్తాయి. కులాలు, మతాలను మానవత్వంతో స్పర్శిస్తే, ఒకటిగానే అనిపిస్తాయి. కులాలు నువ్వు ఏకాకివి కావని చెబుతాయి, కొట్టుకోమని చెప్పవు. మతాలు నీకు మానవత్వాన్ని బోధిస్తాయి, మూర్ఖుడిగా నిన్ను మారమని చెప్పవు. లోపం కులంలో లేదు, నీ ఆలోచనలో ఉంది, పాపం మతంలో లేదు, నీఅజ్ఞానంలో ఉంది. వేరు అనే భావాన్ని వీడి ఒక్కటే అనే నిజాన్ని చేరితే మానవత్వం వికసిస్తుంది,మాధవత్వం విలసిల్లుతుంది.

మహాకాలదేవా

కవితా స్రవంతి
…నాగలక్ష్మి N.భోగరాజు. మహాకాలదేవా - అమేయ ప్రభావా అవంతీనివాసా - అహో భక్తపాలా నిత్య నూతనము నీదు దర్శనము నిన్ను చూచుటే నాకు భాగ్యము ఎన్నబోకయా నాదు నేరము నన్ను బ్రోవుమా నాగభూషణా ||మ|| మహాకాళియే కన్నతల్లిగా హరసిద్ధిమాతయే కల్పవల్లిగా కాలభైరవుడు కరుణ చూపగా వెలసినారయా మమ్ము బ్రోవగా ||మ|| మంగళకరమౌ నీదు రూపమూ తొలగించునుగా మహాపాపమూ భస్మహారతది అత్యద్భుతమూ తిలకించిన మా జన్మ ధన్యమూ || మ||

తపస్సమీరం..!

కవితా స్రవంతి
తపస్సమీరం..! -శైలజామిత్ర తారను అనుసరించి చదరంగ వ్యూహంలో గగన తలంపై చందమామ బరువుగా ఇరుక్కుంది ఒకవైపు ఆహ్వానం.. మరోవైపు వీడ్కోలు! ఒక ఇంటి నుండి మరో ఇంటికి చేరినట్లు.. ప్రయాణం ఏదయినా రాత్రే కళ్ళు విప్పుతుంది యానం ఎక్కడికైనా అందరితో మాట్లాడుతుంది చిరుగాలికి తల పంకిస్తూ పాదు గుండెలోంచి ముళ్ళమధ్య నుండి తీయని గులాబీ దర్శనమిస్తుంది.. ఆకలి పులి అవకాశానికై ఎదురుచూసినట్లు ఇంటి ముందు బిక్షగాని స్వరం సైతం చరిత్రను సృష్టిస్తుంది . బిడ్డను చంకనెత్తుకుని వచ్చే దారిలో అమ్మ కనే కలల దృశ్యం రాబోయే సూర్యోదయానికి ముచ్చెమటు పట్టిస్తుంది.. గాయం మానిపోయి దాని స్థానంలో మరో గాయం చేరినట్లు మనిషి కళ్ళకు ముఖాన్నీ వర్ణచిత్రాలై కనిపిస్తాయి మాసిన దుస్తుతో కూర్చున్న విరామ సమయం గెలుపు నుండి ఓటమి దాకా సంశయాల్ని నింపుతుంది.. చినిగిపోతుందని వస్త్రం, పగిలిపోతుందని కుండ నలిగిపోతుందని గుండెను వాడటం మానే

పోయెట్రీ

కవితా స్రవంతి
తపస్సమీరం..! -శైలజామిత్ర తారను అనుసరించి చదరంగ వ్యూహంలో గగన తలంపై చందమామ బరువుగా ఇరుక్కుంది ఒకవైపు ఆహ్వానం.. మరోవైపు వీడ్కోలు! ఒక ఇంటి నుండి మరో ఇంటికి చేరినట్లు.. ప్రయాణం ఏదయినా రాత్రే కళ్ళు విప్పుతుంది యానం ఎక్కడికైనా అందరితో మాట్లాడుతుంది చిరుగాలికి తల  పంకిస్తూ పాదు గుండెలోంచి ముళ్ళమధ్య నుండి తీయని గులాబీ దర్శనమిస్తుంది.. ఆకలి పులి అవకాశానికై ఎదురుచూసినట్లు ఇంటి ముందు బిక్షగాని స్వరం సైతం చరిత్రను సృష్టిస్తుంది . బిడ్డను చంకనెత్తుకుని వచ్చే దారిలో అమ్మ కనే కలల దృశ్యం రాబోయే సూర్యోదయానికి ముచ్చెమటు పట్టిస్తుంది.. గాయం మానిపోయి దాని స్థానంలో మరో గాయం చేరినట్లు మనిషి కళ్ళకు ముఖాన్నీ వర్ణచిత్రాలై కనిపిస్తాయి మాసిన దుస్తుతో కూర్చున్న విరామ సమయం గెలుపు  నుండి ఓటమి దాకా  సంశయాల్ని నింపుతుంది.. చినిగిపోతుందని వస్త్రం, పగిలిపోతుందని కుండ నలిగిపోతుందని గుండెను వాడటం