ఆధ్యాత్మిక అహంభావం
-శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి)
ఈ మధ్య నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక ఆధ్యాత్మిక గ్రంధాన్ని పోస్ట్ లో పంపించాడు.దానికొక రచయిత(?) కూడా ఉన్నాడు. ఆ గ్రంధంలోని విషయాలన్నీ ప్రాచీన గ్రంధాలలోని విషయాలను ఏర్చి కూర్చినవి.ఆ శ్లోకాలను వ్రాసిన వారు పరమ పురుషులు,అద్వైత సిద్ధాంత ప్రవచకులు,సాక్షాత్తు శంకర స్వరూపులు.అలా ఏర్చికూర్చిన గ్రంధానికి 'రచయిత ' అని పేరు పెట్టుకోవటం ఆది శంకరులకు ద్రోహం చేయటమే!దీనినే ఆధ్యాత్మిక అహంభావం అని అనవచ్చు.జ్ఞానం వలన అహంభావం పెరిగే అవకాశం ఉన్నదని మరొకసారి తెలుసుకున్నాను.మనసు ఎలాగైతే సృజనాత్మక దృష్టితో సృష్టి చేయగలదో, అలాగే అదే మనసుకు నసింపచేసే శక్తికూడా ఉన్నదని 'జ్ఞానయోగం'ద్వారా తెలుసుకొనవచ్చును.అన్నీ నాకే తెలుసు అని అనుకోవటం అహంకారం,అజ్ఞానం.నాకు తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది ఇంకా ఎక్కువ ఉంది అని అనుకోవటం 'జ్ఞానం'.ఈ అజ్ఞానపు చీకటిలో పడిన ఇంకా చాలామంది ఆధ్యాత్మికవేత్తలు మ