తాపీ ధర్మారావు గారు
*శారదాప్రసాద్ *
తాపీ ధర్మారావు గారు తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు .తన కాలానికి కన్నా ముందు ఆలోచనలతో వర్ణాంతర వివాహాలు, దండల పెళ్లిళ్లకు అప్పట్లోనే పురోహితుడు ఈయన . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.ధర్మారావు గారు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం )లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు.వారి ఇంటి పేరును గురించి వారే ఈ విధంగా చెప్పారు --- "మా పూర్వీకుల ఇంటి పేరు బండి వారో, బండారు వారోనట! సైన్యంలో సిపాయిలుగా ఉంటూ, సైన్యం నుంచి విడుదలై వచ్చాక ఏదో పని చేసుకొనేవారట. మా తాతయ్యకు ముత్తాత లక్ష్మయ్య వాళ్ళ ఊళ్ళో (శ్రీకాకుళం) తాపీ పనిలో బాగా పేరు తెచ్చుకున్నారట. కొడుకూ, కూతురూ చనిపోవడంతో తన దగ్గర పెరుగుతున్న మనుమణ్ణి లక్ష్మయ్య బడిలో వేసినప్పుడు ‘తాపీ లక్ష్మయ్య మనుమడు అప్పన్న’ అని