విశ్వనాథ గారి సినిమా సమీక్ష
పేరడీ రచన -- శ్రీరమణ
సేకరణ--శారదాప్రసాద్
పేరడీ అనేది ఆంగ్ల సాహిత్యం నుండి మనం దిగుమతి చేసుకున్న ఒక సాహితీ ప్రక్రియ . సూక్ష్మంగా చెప్పాలంటే ఒక విధంగా అనుకరణను పేరడీ అనవచ్చు.పేరడీలు వ్రాయటం కష్టతరమైన పని. చాలామంది అనుకున్నట్లుగా మూలాన్ని వ్రాసిన కవిని ఎగతాళి చేయటం కాదు పేరడీ అంటే!మూలాన్ని వ్రాసిన రచయితను దగ్గరగా చూసి,ఆయన రచనా శైలిని క్షుణ్ణంగా అనుక(స)రించి వ్రాయటమే పేరడీ. కాకపోతే మూలంలో భావగర్భితంగా,గంభీరంగా ఉన్న దానికి కొద్దిగా హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి వ్రాస్తుంటారు పేరడీలు వ్రాసే కవులు. శ్రీశ్రీ మొదలుకొని శ్రీ రమణ గారి దాకా ఎందరో ఈ పేరడీ ప్రక్రియతో పాఠకులను రంజింపచేసారు. ఈ పేరడీకి వన్నె తెచ్చిన వాడు శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు. వీరు శ్రీశ్రీ కి అత్యంత ఆప్తులు. శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు వ్రాసిన ఈ పేరడీనిని చూడండి!
నేను సైతం
కిళ్ళీకొట్