శీర్షికలు
‘అనగనగా ఆనాటి కథ’
-సత్యం మందపాటి
నేపధ్యంః
క్రికెట్ టెస్ట్ మేచిలోలాగానే నా సాహిత్య ప్రస్థానంలో కూడా రెండు ఇన్నింగ్సులు వున్నాయి. భారతదేశంలో 1950 దశకంలో చిన్న కథల రచనలతో మొదలయి, 1960 దశకం మధ్యలోనే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన ప్రముఖ వారపత్రికల్లోనూ, జ్యోతి, యువ మొదలైన ప్రముఖ మాసపత్రికల్లోనే కాక, ఆనాటి ఎన్నో పత్రికల్లో నా కథలు వచ్చేవి. 1970 దశకం వచ్చేసరికీ నేను సాహితీ పాఠాశాలలో కొంచెం చోటు సంపాదించాను. 1980 దశకం మొదట్లో అమెరికాకి వచ్చాక, ఇక్కడ ఉద్యోగంలోనూ, జీవితంలోనూ స్థిరపడటానికి చాల సమయం పట్టింది. దాదాపు పదేళ్ళ పైన ఒక్క కథ కూడా వ్రాయలేదు. కొంతమంది సంపాదక మిత్రులు, నాకు ఉత్తరాలు వ్రాసి, అమెరికా జీవితం గురించి కథలు వ్రాయండి అని అడిగేవారు కూడాను. చివరికి నాకు బోధివృక్షం క్రింద కూర్చోకుండానే, ‘టైము లేదు అనేది పెద్ద కుంటిసాకు అనీ, రోజుకి ఒక గంట మిగుల్చుకుంటే సంవత్సరానికి 364 గంటలు మిగులుతాయనీ, అంత సమయంలో ఎన్నో
‘చేనేత మొగ్గలు’ – పుస్తకపరిచయం
చేనేత మొగ్గలు
రచయిత: తాటిపాముల మృత్యుంజయుడు
ఆంగ్లపదం Handloom మనందరికి పరిచయమే. దీనికి సమానార్థమైన తెలుగుపదం 'చేనేత '. గ్రామీణ జీవిత నేపథ్యం గలవారికి ఈ వృత్తి గురించి ఎంతో కొంత సమాచారం తెలిసే వుంటుంది. నాకైతే బాల్యంలో మావూళ్లో తిరిగిన 'పద్మశాలీ' వాడ గుర్తుకు వస్తుంది. అక్కడి ఇళ్లలోనుండి వచ్చే మగ్గాల శబ్దాలు, వీధి పొడుగునా ఆరబోసిన జలతారుల్లాంటి నూలు దారాలు, ఆడామగా కలిసి పనిచేసే దృశ్యాలు గుర్తుకు వస్తాయి. అయితే, అప్పుడు చేనేత పనిలో వుండే కష్టాలు, నష్టాల గురించి తెలిసేది కాదు.
'చేనేత మొగ్గలు ' కవితాపుస్తకంలో కవి డా. భీంపల్లి శ్రీకాంత్ చేనేతకారుల జీవితాల్ని 360 డిగ్రీల్లో చూపిస్తూ 60కి పైగా పేజీల్లో నిజాయితీగా స్పృశించారు. చెప్పగా విన్నవి, చదువగా తెలుసుకొన్నవి, చూడగా అర్థమైన విషయాన్ని భావుకత వున్న మనిషి ఏదో ఒక సాహిత్య రూపంలో కొన్ని పేరాగ్రాఫుల్లో రాయగలడు. కాని 60 పేజీల్లో కవితా ప్రక్రియ
పుస్తక పరిచయం
భోగరాజు వెంకట సత్యనారాయణమూర్తి
పుస్తకం పేరు : కదంబవన కుసుమాలు
రచయిత్రి పేరు : శ్రీ శేష కళ్యాణి గుండమరాజు.
ఒక వర్ధమాన రచయిత్రి స్వానుభవాలు, సమాజములో జరిగిన, జరుగుతున్న సంఘటనలను కథా వస్తువులుగా చేసి తనదయిన శైలిలో పరిష్కారాలను సూచించిన చిన్న చిన్న కథల సమాహారమే ఈ కథల సంపుటి. వివిధ పత్రికలలో ప్రచురితమైన 18 కథలను ఒక పుస్తక రూపంలో ప్రచురించి ఆసక్తి కల పాఠకులకు ఒకేచోట అందించాలన్న ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలోని కథలలో ఇతివృత్తాలు రచయిత్రికి సమకాలీన సామజిక సమస్యలపైన ఉన్న అవగాహనకు దర్పణంగా నిలుస్తాయి. అంతేకాక కొన్ని కథలలో అంతర్లీనముగా గోచరమయ్యే ఆధ్యాత్మికత రచయిత్రికి దైవం పట్ల, పురాణేతిహాసాల పట్ల గల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
'గడ్డి పోచ’ కథకు వాల్మీకి కృత రామాయణం సుందరకాండలో రావణ సీతా సంవాదంలో, మహాసాధ్వి సీతాదేవి దుష్టుడైన రావణునితో సంభాషించడానికి మాధ్యమంగా ఉపయోగపడిన గడ్డి పరక కథా వస
పుస్తకావిష్కరణ
"వీరయ్య" పుస్తకము తనికెళ్ళ భరణి గారి నాస్సర్ గారి చేతులు
మీదుగాఆవిష్కరించబడింది :
బ్రిటిష్ సామ్రాజ్యపు చెరుకు ఫారాలలో పని చెయ్యడానికి బానిసల స్థానం లో 13
లక్షల భారతీయులు పంపబడ్డారు. వారిలో కృష్ణ ముత్తాత వీరయ్య ఒకరు. ఇది ఆయన కథ
కృష్ణ ఈ కథ గుండెలలో లో కలం పెట్టి నెత్తురుతో రాసినట్టుంది. నాకు చాలా
ఇష్టమైన రూట్స్ (ఏడు తరాలు) పుస్తకాన్ని గుర్తు కు తెచ్చింది - తనికెళ్ళ భరణి
ఈ పుస్తకం యువతరాన్ని తమ సొంత కుటుంబ చరిత్రను వెదకటానికి ప్రోత్సాహిస్తుంది -
నాస్సర్
ఇండియాలో వీరయ్య తెలుగు పుస్తకము కొనతలుచుకున్నవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి :
https://amazon.in/dp/8194427339
అమెరికా లో వీరయ్య తెలుగు పుస్తకము కొనతలుచుకున్నవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి :
https://www.amazon.com/dp/8194427339
కృష్ణ
Book Launch:
The Telugu translation of Veerayya was launched by Tanikella Bharani ga
ఆచరణ
ఆచరణలు అలవాటుగా మారితే !
బాల్యం నుండే మనం అనేక విషయాలను తెలుసుకుంటూ వుంటాము. తెలుసుకున్న చాలా విషయాలలో అనేక విషయాలను ఆచరణకు దగ్గరా తీసుకురాక పోవటం చేత జీవితంలోని చాలా సందర్భాలలో మనం ఎదగవలసిన స్థాయికి ఎదగ లేక చతిగిల పడిపోతూ ఉంటాము. దానికి ప్రధానకారణం తెలుసుకునే ఏ విషయం పై నైనా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ ,ఇష్టత అనురక్తి లేకపోవటం,ఏకాగ్రత లోపించటమే ప్రధాన కారణాలు. అందుకే జీవితానికి అవసరమైన విషయాలలు సరియైన సందర్భాలలో నేర్చుకోలేక ,ఏదో నేర్చుకున్న బలంగా మనస్సులో నిక్షిప్తం కాక అవసర సమయాలలో అవకాశాలు అందుకోలేక మానసిక వేదన అనుభవిస్తుంటారు. అందుకే ఇటువంటి సందర్భాలలోనే పెద్దలంటారు మంచిని అంటించుకొని చెడును వదిలించుకోవాలని.
ముఖ్యంగా నేటి విద్యా విధానాలలో మంచి విషయాలను నేర్చుకొనే దశలో ఆచరణ అలవాటుగా మార్చుకోవటం అటుంచి అసలు నేర్చుకోవటమే ఏదో యాంత్రికంగా నాలుగు మార్కుల కోసమన్నట్లుగా నేర్చుకుంటూ పొందవలసిన సంప
అష్టవిధనాయికలు
(పద్య ఖండిక)
స్వాధీనభర్తృక
...................
మత్తేభము
పతియే దైవమటంచునెంచివ్రతమున్ భక్తిన్ ఘటించున్ పతి
వ్రతగెల్వంగఁవశీకృతుండగు సతీస్వాధీనుడౌభర్తయున్
స్తుతి జేతున్భవదీయకౌశలముఁ విధ్యుక్తంబులౌ నీహొయల్
ద్యుతిసౌందర్యవిలాసముల్ కళలు సత్యోత్కృష్టసౌభాగ్యముల్
వాసక సజ్జిక
...............
మత్తేభము
పడకన్ పద్మదళమ్ములన్ బరచి పుష్పంబుంచి ద్వారంబులన్
పడకింటన్ రమణీలలామకదిలెన్ప్రాణేశునిన్ దల్చి వా
ల్జడకున్ పూవులగూర్చివేచె హృదయోల్లాసంబులన్ గూర్చగా
వడిచేరన్ జనుదెంచు ప్రేమికునికై స్వాలంకృతస్త్రీత్వమై
విరహోత్కంఠిక
...,.,.........,.,,
మత్తేభము
క్షణముల్ దీర్ఘములై గతింపగను కక్షంబూనెనేమో యనన్
గణుతింపన్ వ్యథలుండుకోటి విరహోక్కంఠీమనోగీతికన్
తృణమేతానన విస్మరించుటనసంతృప్తిన్ యథాతప్తతన్
వణకంగన్ మృదులాధరద్వయముతాన్ వాపోవుచాంచల్యయై!
విప్రలబ్ద
............
మత్తేభము
కినుకన్ జెందెను రాత్
పుస్తకసమీక్ష-అష్టవిధ నాయికలు
శ్రీ గాదిరాజు మధుసూదన రాజు గారు రచించిన
అష్టవిధ నాయికలు
(పద్యఖండిక)
పై
పూజ్యశ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య వారి సమగ్రసమీక్షా వ్యాసం
ఈరోజు గాదిరాజు మధుసూదన రాజుగారి కవిత్వానికొద్దాం. మధుసూదన రాజుగారు
సుక్షత్రియ వంశంలో జన్మించి వృత్తి రీత్యా ప్రభుత్వ
నేత్రవైద్యాధికారిగాఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. పూర్వీకులది భీమవరం.
బెంగుళూరులో స్థిరనివాసము. క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు పేరుతో
ఇటీవలబ్లాగొకటి పెట్టారు. శంకరాభరణం బ్లాగులో 2019లో అనుకుంటా వారి పద్యాన్ని
చూశాను. నాలాంటి వాడే ఎవరో తెలీక సార్! మీరు క్రొత్తా అని అడిగితే వారు
చమత్కారంగా "నా కలం చాలా పాతది - కవి రచయితల చరితలో పాతది - జర్నలిజంలో నలభై
ఏళ్ళ ముందున్నది. కవుల సమాఖ్యలో బూజుపట్టిన మాజీది - బ్లాగులోకంలో ఈమధ్యే
దూరినది" అని క్లుప్త పరిచయం చేసుకున్నారు. 1979 నుండి నేటి వరకు
అన్నిప్రముఖపత్రికలలో కవితలు కథలు ప్రచురింప