ఆరోగ్యమే మహాభాగ్యం
- తాటిపాముల మృత్యుంజయుడు
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే |
ఔషధం జాన్హవీతోయం వైద్యో నారాయణో హరిః
వైద్యుడు 'నారాయణుడు 'తో సమానమని పై శ్లోకం అర్థం. మనకొచ్చే వ్యాధులు
మందులతోనే నయం కావు. ఔషాథాలతో పాటు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు కూడా
చికిత్సకు దోహదం చేస్తాయి. మన జీవనశైలి, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యాంశాలే.
సిలికానాంధ్ర సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయలను విస్తరింపజేస్తూ తెలుగువారి
జీవనవిధానాన్ని గత పదిహేడేళ్ళుగా మెరుగుపరుస్తున్నది. ఇప్పుడు వైద్యసేవలను
అందించడానికి కూచిపూడీ గ్రామంలో 'రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవనీ వైద్యాలయం'
ప్రారంభించింది. ఇది ఈ రంగంలో మొదటి అడుగు మాత్రమే. ముందు ముందు వైద్యరంగంలో
చాలా సేవలు చేయాలన్నది సిలికానాంధ్ర ఉద్దేశం.
వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' చూడండి.
అలాగే మనసుకు ఆహ్లాదపరిచే ఇతర రచనలను చదవండి.
***