వీక్షణం

వీక్షణం-100

వీక్షణం
కాలిఫోర్నియాలో ఘనంగా జరిగిన వీక్షణం-100వ సాహితీ సమావేశం -వరూధిని కాలిఫోర్నియా బే ఏరియాలోని "వీక్షణం" సాహితీ గవాక్షం సంస్థాపక అధ్యక్షులు డా|| కె.గీత, మొదటి నుంచి వీక్షణానికి వెన్నుదన్నుగా నిలిచిన శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ లెనిన్ అన్నే, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు, శ్రీ మృత్యుంజయుడు తాటిపామల, శ్రీ రావు తల్లాప్రగడ మున్నగు సంస్థాపక సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన 100 వ సాహితీ సమావేశం అంతర్జాల సమావేశంగా డిసెంబరు 12, 2020న విజయవంతంగా జరిగింది. డా|| కె.గీత, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు గార్లు స్వాగతోపన్యాసాలు చేశారు. ఈ సభకు విశిష్ట అతిథులుగా తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరి గారు, వంగూరి ఫౌండేషన్ సంస్థాపకులు శ్రీ చిట్టెన్ రాజు వంగూరి గారు విచ్చేసారు. ముందుగా జంపాల చౌదరిగారు మాట్లాడుతూ ఏ సంస్థ విజయానికైనా పేషన్ కలిగిన సారధులు ముఖ్యమని పేర్కొన్నారు. శ్రీ చిట్టెన్

వీక్షణం-99 సాహితీ సమావేశం

వీక్షణం
వరూధిని వీక్షణం-99 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, ఆద్యంతం ఆసక్తిదాయకంగా నవంబరు 15, 2020 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీమతి కొండపల్లి నీహారిణిగారు "ఆధునిక యుగంలో స్త్రీల వచన కవిత్వం" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు. నీహారిణిగారు ముందుగా ప్రథమ కవయిత్రులైన కుప్పాంబిక, మొల్ల, గంగాదేవిలను తల్చుకుంటూ  ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆధునికయుగం ప్రారంభంలో సోమరాజు ఇందుమతీబాయి, ఊటుకూరు లక్ష్మీబాయమ్మ, రుక్మాంపేట రత్నమాంబ వంటి వారి కవిత్వాన్ని విశేషిస్తూ  స్త్రీలు  వేసే ప్రతీ అడుగు వెనకా ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యే పురుషుల వ్యంగ్యాస్త్రాల పట్ల వ్యక్తమైన నిరసనలకి ప్రతిరూపమైన కొన్ని కవిత్వ వాక్యాల్ని ముఖ్యంగా ప్రస్తావించారు. ఆధునిక వాదాలు, కవిత్వ రూపాలని సంక్షిప్తంగా వివరించి అన్ని ప్రక్రియల్లోనూ స్త్రీలు రచించిన కవిత్వాల్ని పరిచయం చేశారు. 1993లో గొప్ప ఒరవడి సృష్టించిన నీలిమేఘాలతో ప్రారంభించి అందులోని ముఖ్యమై

వీక్షణం 98

వీక్షణం
వీక్షణం-98 సాహితీ సమావేశం -వరూధిని వీక్షణం-98 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా అక్టోబరు 18, 2020 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ సుభాష్ పెద్దు గారు "వరవీణ- సరస్వతీ స్వరూపం" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు. "వరవీణా మృదుపాణి" అన్న పురందర దాసు కీర్తనని ప్రస్తావిస్తూ ముందుగా "వరవీణ అంటే ప్రస్తుతకాలంలో అందుబాటులో ఉన్న ఏ వీణ?" అనే విషయం మీద సోదాహారణంగా ఉపన్యాసం ప్రారంభించారు. వివిధ దేశాల్లో ఉన్న వీణలు, సరస్వతి స్వరూపాలను చిత్రాలతో బాటూ పరిశోధనాత్మకంగా శోధించి చక్కటి వివరణని ఇచ్చేరు. ప్రాచీన కాలంలోని సరస్వతి స్వరూపాల్ని గుర్తు పట్టడానికి చేతిలో పుస్తకం, జపమాల, నెమలి లేదా హంస వాహనాలు ప్రత్యేక గుర్తులన్నారు. హళేబీడులోని జక్కన చెక్కినదిగా ప్రసిద్ధి గాంచిన సరస్వతి ప్రశాంత రూపానికి, ఆయనే చెక్కిన రుద్ర కాళికావతారానికి తేడాలు స్పష్టం చేసేరు. రవివర్మ చిత్రించిన సరస్వతి ముఖ కవళికలు, చిత్రానికి బ్యాక్ గ్రౌం

వీక్షణం-94-వరూధిని

వీక్షణం
జూన్ నెల వీక్షణం సమావేశం ఆన్ లైను సమావేశంగా జూన్ 14, 2020 న జరిగింది. ఇండియా నుంచి సమావేశానికి హాజరైన శ్రీమతి వెంకట లక్ష్మి మల్లాది గారి పరిచయ కార్యక్రమంతో సమావేశపు మొదటి సెషన్ ప్రారంభమయ్యింది. రెండవ సెషన్ "ప్రసంగం" లో భాగంగా  శ్రీమతి రఘు మల్లాది 'చాటువులు ఆధునిక కాలాన్వయం’ అనే  అంశంపైన ముప్ఫై నిముషాలు ప్రసంగించారు. ఏడేళ్ల కిందట తోలి వీక్షణ సమావేశంలో అధ్యక్షత వహించింది మొదలుగా నాలుగైదు సమావేశాలు వారింట జరుపుకున్న మధుర క్షణాల్ని గుర్తుచేసుకున్నారు. చాటువుల్ని ఇవేళ చాటుగా చెప్పుకోవాల్సిన దుస్థితి పట్టిందన్నారు. "సర్వజ్ఞ నామధేయము" "వీసపు ముక్కు నత్తు" వంటి చాటువుల్ని ఉదహరిస్తూ ఆ నాటి సమాజంలో కుల ప్రస్తావన ఏ విధంగా ఉందో వివరించారు. ఇప్పటి సమాజంలో చాటువులు కాదు కదా అసలు కవికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కొరవడిందన్నారు. ఈ విషయంగా చర్చలో భాగంగా డా||కె.గీత మాట్లాడుతూ కవికి సామాజిక బాధ్యత ఉం

వీక్షణం – 93 వరూధిని

వీక్షణం
వీక్షణం-93-వరూధిని ఏప్రిల్ నెల సమావేశం లాగానే ఈ నెల వీక్షణం సమావేశం కూడా ఆన్ లైను సమావేశంగా మే 17, 2020 న జరిగింది. కరోనా కష్టకాలంలో సాహిత్యమే ఊపిరైన బుద్ధిజీవులకు కాలిఫోర్నియాలోని "వీక్షణం" సేదతీర్చే చెలమ అయ్యింది. ఆన్ లైను సమావేశాలు కావడం వల్ల దూర ప్రాంతాల వారు కూడా సమావేశాలకు హాజరు కాగలుగుతున్నామని అంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొదటి సెషన్ పరిచయ కార్యక్రమం. సమావేశానికి కొత్తగా వచ్చిన యువ కవి వెంకట్, బే ఏరియా నివాసి గోపినేని ప్రసాదరావు గార్ల పరిచయంతో సమావేశం మొదలయ్యింది. రెండవ సెషన్ "ప్రసంగం" లో భాగంగా డా|| కె.వి.రమణరావు 'ఆధునిక కవిత్వపు తీరుతెన్నులు ’ అనే అంశంపైన నలభై నిముషాలు ప్రసంగించారు. ఆ ప్రసంగ సారాంశం ఇది:- "సంప్రదాయ కవిత్వానికంటే పూర్తిగా భిన్నమైన సాహిత్య ప్రయోజనం, వస్తుశిల్పాలతో ఇరవయ్యో శతాబ్దారంభంలో ఆధునిక కవిత్వం మొదలైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కవిత్వంలో మ

వీక్షణం- 90

వీక్షణం
-రూపారాణి బుస్సా వీక్షణ 90వ సమావేశం ఫిబ్రవరి 9, 2020 న ఫ్రీమౌంట్ లోని సుభాష్ గారు, వందన గారింట్లో అతి ఉత్సాహకరంగా జరిగింది. అపర్ణ గారు అధ్యక్షత వహింహారు. సభ ప్రారంభంలో సమావేశమైన రచయితలందరు తమ పరిచయంతో పాటు తాము ఇటీవల చదివిన కథ లేక కవిత గురించి చెప్పి ఎందుకు నచ్చిందన్న విషయాన్ని తెలియపరిచారు. మొదట గోకుల్ రాచి రాజు గారు తమ పరిచయం తరువాత సైరాబి పొయట్రీ గురించి తెలియపరిచారు. అలాగే ఒక కొరియాన్ చలనచిత్రం గురించి కూడా చెప్పారు. తదుపరి రమణా రావు గారు కథకు కథాశిల్పం ఎంత ముఖ్యం అని చెబుతూ "పడవప్రయాణం" అనే కథ అద్భుతంగా ఉందని ఏ కథకైన క్రమ పద్ధతి పెట్టుకుని వ్రాస్తారు ఏ రచయితైనా అని చెప్పారు. వాస్తవ పరిస్థితి తీసుకువచ్చిన కథా శైలి బాగా నచ్చిందని చెప్పారు. ఆ తరువాత ఉదయలక్ష్మిగారు గొల్లపూడి మారుతిరావుగారి గురించి మాట్లాడుతూ కిరణ్ ప్రభగారు గొల్లపూడి గారికి సన్నిహిత ఆప్తులుగా ఉండేవారని కిరణ్

వీక్షణం-89

వీక్షణం
-రూపారాణి బుస్సా కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ లో శ్రీ వెంకటరమణ, శ్రీమతి సుభద్ర గారింట్లో జనవరి 12, 2020 న జరిగిన 89వ వీక్షణ సమావేశానికి శ్రీ వేణు ఆసూరి గారు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మొట్టమొదటగా వెంకటరమణ గారు కథలు వ్రాసే విధానం లో చారిత్రకంగా వచ్చిన మార్పులను గురించి వివరంగా మాట్లాడారు. దాదాపు 1910 నుండి మొదలైన కథా రచన పరిస్థితులను బట్టి, కాలానికి తగినట్టు ఎలా మార్పు చెందిందన్నది చాల చక్కగా తెలియజెప్పారు. కథ యొక్క ప్రయోజనమేవిటి, కథావస్తువు ఎలా ఎంచుకోవాలి, కథా శిల్పమేమిటి వంటి అనేక విషయాల గురించి క్షుణ్ణంగా తెలియపరిచారు. విరామం తరువాత సభను డా|| కె.గీతగారు ప్రారంభించారు. తమ తల్లి శ్రీమతి కె.వరలక్ష్మి గారికి ఇటీవలే లభించిన అజో-విభోకందాళం ఫౌండేషన్ వారి జీవన సాఫల్య పురస్కారం గురించి చెబుతూ కె.వరలక్ష్మి గారి కథా ప్రస్థానాన్ని, జీవన విశేషాల్ని వివరించారు. కె. వరలక్ష్మి గారి