పద్యం-హృద్యం

పద్యం-హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
పందినిఁ కౌగిలించుకొని పంకజలోచన సంతసించెరో

గతమాసం ప్రశ్న:
వంకాయన చెఱుకు రసము వడివడిఁ యుబికెన్

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ

ఇంకేమి వింతలుం డునొ
సంకర జాతులు పుట్టు సంబర మందున్
వంకర టింకర యుగమిది
వంకాయన చెఱకు రసము వడివడిఁ యుబికెన్

సూర్యకుమారి.  వారణాసి  .మచిలీపట్నం

టెంకాయ  నీరు  త్రాగియు
ఇంకా  దాహమనిపిం చి  ఇటునటు  చూడన్
పంకజ ముఖి చూడుము నా
వంకా యన  చెఱుకు రసము వడి వడి  యుబికెన్

గండికోట విశ్వనాధం, హైదరాబాదు

సాంకేత పదముగ నొకడు
“వంకా”యని యంత్రమందు వాడుచు కీలా
వంకన్‌ నొక్కగ, మదిలో
“వంకా’ యను ; చెరకు రసము వడివడి వుబికెన్‌

చావలి విజయ

ఎంకియు వండెను  బావకి
వంకాయ మసాల ఘుమల  వాసన  లెగయన్
ఎంకి  ని  చూడగా రుచికర
వంకాయ న చెరకు రసము వడి వడి యుబికెన్

Dr. రామినేని రంగారావు, పామూరు

అంకమ్మ జాతరందున
ఉంకించిన మాయలోడు ఉత్సాహముతో
వంకర దండము మీటగ
వంకాయన  చెఱుకు రసము వడివడి యుబికెన్

శివప్రసాద్  చావలి, సిడ్నీ

జంకక వంటల దిట్టని
బొంకగ నమ్మిన వరునికి భోజన వేళన్
లంకన పండగ వండిన
వంకాయన చెరకు రసము వడి వడి ఉబికెన్

పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా

శంకరి కొనె పిల్లలకై
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి యుబికెన్!
(బుగ్గ = bottle)

శంకరి పిల్లలకై కొనె
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి యుబికెన్

శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా

నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked