Month: March 2017

గొలుసు కవిత

కవితా స్రవంతి
అయ్యయ్యో ! శివ శివా! - (సూత్రంః శివ నిందాస్తుతి. మొదటి రెండు వాక్యాలు నిందాస్తుతి, మూడవ వాక్యం స్తుతితో శివతత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం. మహాశివరాత్రి తరుణంలో మనబడి భాషాప్రేమికులు అల్లిన మారేడు దళ మాలిక.  ఆలోచనః వేణు ఓరుగంటి )   ఎద్దునెక్కుతావు, పులితోలు తొడుగుతావు భూతదయ నీకెక్కడయ్యా భూతేశా? శివ శివా! పంచభూతాలూ నువ్వేకదా ఓ పరమేశా! (వేణు ఓరుగంటి)   బూడిద రాస్తావు, పుర్రెల హారం చుడతావు! నీదేమి అందమయా గౌరీశా? హరహరా! నీలో సగమైనది జగన్మోహనం ఓ అర్ధనారీశా! (భాస్కర్ రాయవరం)   త్రిశూలం పట్టుకుంటావు, శ్మశానంలో ఉంటావు, నువ్వంటే భయంతో చావాలి కానీ, హరోం హర! చచ్చినాకా నీదగ్గరకే చేరాలని  తపస్సు!  మృత్యుంజయా! (వేణు ఓరుగంటి)   బొమ్మతల కొట్టేవు, బొమ్మకు తలపెట్టేవు ఇదేమి తిక్కనో తెలీదు కానీ, తిక్కశంకరయ్యా! చక్కటి కథలురాసిచ్చే బొ

పద్యం – హృద్యం

శీర్షికలు
నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: నిర్ధిష్టాక్షరి మరియు వర్ణన: "హే", "వి", :"ళం(లం)", "బి" అనే అక్షరాలతో ఒకొక్క పాదము ప్రారంభిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో వసంత ఋతువర్ణన చేయాలి గతమాసం ప్రశ్న: సమస్య: రామా యన బూతుమాట రమణీ వినుమా!   ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.   సహస్రకవిరత్న,సహస్రకవిభూషణ శ్రీమతి.జి. సందిత.బెంగుళూరు. కామాతురుల విరామా రామపు"మారామ"నంగఁ"రామ"   పదమునన్ కామంబుండు కతన “మా రామా”

ఫన్‌చాంగం

శీర్షికలు
                  నచ్చితే నలుగురికీ చెప్పండి !  నచ్చకపోతే నాకు చెప్పండి !!                 ఫణి మాధవ్ కస్తూరి ఫేస్ బుక్ రాశి : ఆదాయం :  ముఖం తెలీని ఫ్రెండ్లు                            వ్యయం  : విలువైన సమయం రాజ పూజ్యం :  లైకులు                                   అవమానం :  ప్రొఫైల్ పిక్ కి వచ్చే కామెంట్లు ఈ రాశివారికి 365 రోజుల్లో 50% సమయం వృధా. వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా.. అందులో పరిచయం ఉన్నవారు,పనికొచ్చే వారు సున్నా. ప్రొఫైల్ పిక్ ఎవరో హీరోది/హీరోయిన్ ది ఉండడం వల్ల ఎంతో మంది ఆకర్షితులైనా..నిజం తెలుసుకుని వదిలి వెళ్లే వళ్ళే ఎక్కువ. లైకులు, కామెంట్లు మెసెంజర్ లో మెసేజులు.. సినిమాలు-రాజకీయాల గురించి చర్చలు తప్పవు. తెలీక తలదూరిస్తే, అవమానాలు తప్పవు. వాట్సాప్ రాశి : ఆదాయం : శూన్యం                                         వ్యయం  : డాటా చార్జీలు రాజ పూజ్యం : రోజూ గుడ్డు మార్నింగు మెసే

విశ్వామిత్ర 2015 – నవల ( 10వ భాగము )

ధారావాహికలు
 – యస్. యస్. వి రమణారావు   Dr.శివహైమ,ఎమ్ బిబిఎస్.వైట్ బోర్డ్ మీద నీలిరంగు అక్షరాలతో మెరిసిపోతోంది ఆ పేరు.ఎక్సైటెడ్ గా తలుపు కొట్టాడు అభిషేక్.తలుపు తెరుచుకుంది.నల్లని దట్టమైన మేఘాల మధ్య వెలుగుతున్న మెరుపులాగ ,కొండమీదనుంచి జారుతున్న జలపాతంలాగా అందంగా,......ఆ డ్రెస్ లో అద్భుతంగా కనబడుతున్న ఆఅమ్మాయే శివహైమ,అభిషేక్ గర్ల్ ఫ్రెండ్." వెల్ కమ్ టు మై హోమ్"ఆహ్వానించింది అభిషేక్ ని."థాంక్యూ"అంటూ లోపలికి వచ్చాడు అభిషేక్. "టిఫిన్ ఈజ్ రెడీ.వడ ప్లస్ సాంబార్ అన్డ్ పెసరట్ ప్లస్ ఉప్మా Of course followed by strong coffee,just like hotel menu hope u like it." "వావ్. దట్స్ గ్రేట్.చాలా ట్రబుల్ తీసుకున్నావ్.హోటల్ కి వెళిపోయేవాళ్ళం కదా" అంటూ తలుపు వేయబోయాడు. "నోనో తలుపు వేయకు" వారించింది శివహైమ. "వై?ఇంకా ఎవరినైనా పిలిచావా?"అడిగాడు అభిషేక్ "నో" "మరి" "చెప్తాను.స్టార్ట్ ద బ్రేక్ ఫాస్ట్"

పాఠకుల స్పందన

పాఠకుల స్పందన
Response to: response to january2017 patakulaspandana Name: Sridevi City: Hyderabad Message: Sir, Do we have to subscribe the magazine to send our writings   Editor: Madam ! You can subscribe to get mail alerts about SujanaRanjani. You can always visit - sujanaranjani.siliconandhra.org - Please send your writings.   ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------   Response to: response to january2017 silicanandra Name: B V S S PRASAD City: GUNTUR Message:  మీ పత్రిక చాలా బాగుంది, మీ కు వ్యాసాలు పంపాలంటే ఏమీ చేయాలి. Editor: If possible send your essays in Unicode. Otherwise, PDF, image

వీక్షణం 55వ సమావేశం

వీక్షణం
కాలిఫోర్నియా క్యూపర్టినోలోని నాగసాయి బాబా గారి ఇంట్లో ఈ నెల 12న వీక్షణం 55వ సమావేశం జరిగింది. అతిధేయ దంపతుల ఆత్మీయ ఆహ్వానం తరువాత, అధ్యక్షులు శ్రీ నరసింహాచార్యులు గారు సమావేశాన్ని తమ అధ్యక్షోపన్యాసం తో ప్రారంభించారు. ఆచార్యులవారు బమ్మెర పోతన విరచితమైన శ్రీమద్భాగవతం లోని భక్తి తత్వాన్ని, సాంప్రదాయ నవనవోన్మేష కవిత్వ వైభవాన్ని సాధికార సమగ్రతతో కొనియాడారు. స్థాలీపులాక న్యాయంగా ఉటంకిస్తాను అంటూనే, పోతన బాల్య ఉదంతాల నుండి గజేంద్ర మోక్ష ఘట్టాల దాకా ఆసక్తికరంగా వివరించారు. ఆచంద్ర తారార్కా లైన  సెలయేళ్ళ గిరిసీమలో ఆదిశంకరుణ్ణి నెలకొల్పుకొని, తన నోట రామభద్రునిచే భాగవత బృహద్రచనను పలికించుకున్న హరిహరాద్వైత భక్త కవితల్లజుడు బమ్మెర. ఆచార్యుల వారి ప్రసంగంలో ఆణిముత్యాల లాంటి అనేక పోతన పద్యాలు అలవోకగా దొర్లాయి. "పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట",  "అలవైకుంఠ పురములో", "మందార మకరంద మాధుర్యమును గ

సంగీతరంజని – సంగీత సౌరభం – డా. పినాక పాణి

శీర్షికలు
- డా. కోదాటి సాంబయ్య కొందరు మహానుభావులు ఏదో ఒక సత్కార్యం చేయడానికే భువిపై జన్మిస్తారు. త్యాగయ్య, అన్నమయ్య అలాంటివారు. వారినే కారణ జన్ములు అంటారు. అలాంటి కారణ జన్ములే డా. శ్రీపాద పినాకపాణి గారు. శ్రీకాకుళం జిల్లా, ప్రియ అగ్రహారంలో ప్రమాదీచ నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పాడ్యమి, ఆదివారం ( 8 ఆగస్ట్ 1913 ) నాడు పుట్టిన పినాకపాణి గారు వృత్తి రీత్యా వైద్యులైనా ప్రవృత్తి రీత్యా సంగీత విద్వాంసుడు. 99 సంవత్సరాల సంపూర్ణ జీవితం గడిపి 11 మార్చ్ 2013 నాడు స్వర్గస్తులయ్యారు. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ నుండి సంగీతా కళానిధి అవార్డ్, కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డ్ (1984 ) పొందారు. వారి స్వీయ చరిత్ర ' నా సంగీత యాత్ర' లోని చివరి పేరా చదివితే వారెంత ఉన్నతులో తెలుస్తుంది. " పెద్దలు పాడిన రీతులలో నేను పాడ గలుగు తున్నానన్న నిజం తప్ప నన్నే ప్రశంస సంతోష పెట్టగలదు? విద్వాంసులకు తదితర పెద్దలకూ నా పాట వినగా

గతం నుంచి…

కవితా స్రవంతి
  - ఎస్.ఎస్.వి.రమణరావు గతం నుంచి మంచే తీసుకుందాం ధైర్యంకళ్ళతోటి భయం చూద్దాం నిజం తెలిసి తెలివి కూర్చుకుందాం 'నేడు'లోనే మనం జీవిద్దాం 'నేడు'లోనే మనం జీవిద్దాం నిన్న అంటే ఆలోచన నేడు అంటే చే సే పని రేపు అంటే తెలిసిందా నేడులోనే ఉందీ అది నేడులోనే ఉందీ అది // గతం// అమెరికన్ని రష్యన్ని ఇండియన్ని చైనీస్ ని ఒకే షోలో నిలబెడదాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం క్రిస్టియన్నీ ముస్లిమ్ నీ హిందువునీ బుద్ధిస్ట్ నీ ఒకే షోలో నిలబెడదాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం జవాబులన్నీ దులిపేద్దాం మెదడులన్నీ సరిచేద్దాం మనస్సులన్నీ మార్చేద్దాం మనస్సులన్నీ మార్చేద్దాం //గతం// ఉన్నదొకటే ఆలోచన లేనిదొకటే వివేచన ధైర్యమంటే కాదు యుద్ధం స్నేహమంటే ఎందుకూ భయం? స్నేహమంటే ఎందుకూ భయం? // ప్రశ్న//

తల్లివేరు

కవితా స్రవంతి
- డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం పడమటి తీరాన్ని చేరిన పక్షులు తొడుక్కున్న ముఖాలే తమవనుకున్నాయి . పాప్ లు,రాక్ లు,పిజ్జాలు,కోక్ లు పక్కింటి రుచులు మరిగాయి . సాయంకాలం మాల్ లో పొట్టి నిక్కర్ల పోరీలు అందాల కనువిందులు . సిస్కో లో పని చేసినా, సరుకులే అమ్మినా డాలరు డాలరే! కడుపులో లేనిది కావలించు కుంటే రాదని , నలుపు నలుపే గానీ తెలుపు కాదని , పనిమంతుడి వైనా ,పొరుగునే వున్నా ,పరాయి వాడివే నని , తత్వం బోధపడే సరికి చత్వారం వస్తుంది. అప్పుడు మొదలవుతుంది అసలైన వెతుకులాట . నేనెవరినని మూలాల కోసం తనక లాట . జండా పండుగలు,జాగరణలు ,పల్లకీ సేవలు,పాద పూజలు , భామా కలాపాలు,బతుకమ్మ పాటలు అస్థిత్వ ఆరాటాలు . రెండు పడవల రెండో తరానికి ఆవకాయ అన్నప్రాసనం ఉదయం క్వాయిర్ క్లాసు,సాయంత్రం సామజ వరగమన మన బడి గుణింతాలు, రొబొటిక్స్ ప్రాజెక్ట్ లు అటు స్వేఛ్ఛా ప్రపంచపు పిలుపులు, ఇటు తల్లి వేరు తలపులు

నా జీవితం ఎక్కడికెళ్ళింది?

కవితా స్రవంతి
- సుమ (సుమన నూతలపాటి) జడి వానల వాగుల్లోన పడవలతో చిరుగాలిలో గాలిపటాల సరిగమతొ జీవితాంతం సరిపడాల్సిన చదులతో చిరునవ్వులతో ఆపెయలేని నవ్వులతో... నా బాల్యం యెక్కడికెళ్ళింది? నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది? ఆశలతో బారులు తీరిన ఆకాశం పరువాలతో పరిగెత్తించేే పరవశం ఏ కొండని ఢీ కొట్టాలనీ ఆవేశం? నవ జీవన నాడులు పాడే ఆ నాదం నా యవ్వనమెక్కడికెళ్ళింది? నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది? నవ వధువై అడుగు పెట్టిన జీవితం నా తోడై నిలిచిన వ్యక్తి సాంగత్యం నను గన్న వాళ్ళు చూపిన ఆదర్శం నే గన్న వాళ్ళు నేర్పిన ఆరాటం నా కాపురం యెక్కడికెళ్ళింది? నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది? నా బిడ్డల రెక్కల బలంలో నా గర్వం నే నేర్పిన పాఠాలన్నిటి ప్రతిబింబం చిట్టి పాపల కేరింతలతో కైవల్యం మానవత్వపు విలువలు పెంచే పోరాటం నడి వయసు యెక్కడికెళ్ళింది? నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది? నా అడుగులు తడబడి పోడం సాధ్యమా? మేధస్సు మరుపున పడటం