Month: February 2018

అచ్చివస్తున్న 2018

సుజననీయం
2017 డిసెంబర్ నెల మధ్యనుండే 2018 సంవత్సరం సిలికానాంధ్రకు శుభసూచకంగా ఉంటుందన్న సంకేతాలు మెండుగా కనిపిచసాగాయి. డిసెంబర్ 15 నుండి 19 వరకు హైద్రాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ సాహిత్యవేదికలపైన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవిత మొదలుకొని పలు సాహితీ దిగ్గజాలు సిలికానాంధ్ర, మనబడి, సుజనరంజని సేవలను కొనియాడుతూ ఆ పేర్లను తమ ప్రసంగాలలో ఉటంకించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ముగింపు సమావేశాల్లో భారతదేశ ఉపరాష్ట్రపతి ప్రవాసభారతంలో మనబడి సేవలను గుర్తిస్తూ ఇప్పటి తరాలకు, భావితరాలకు మధ్య వారధిగా నిలుస్తున్నదని కొనియాడడం మరొక ఎత్తు. 2018 జనవరి మాసంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఒక సంవత్సరం పూర్తి చేసుకొన్నది. ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు ఐటీ మంత్రివర్యులు నారా లోకేశ్ ముఖ్య అతిధిగా విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వ్యాప్తికి సిలికానాంధ్ర చేస

తెలుగు వెలుగుల స్వాగతం పాట

కవితా స్రవంతి
పల్లవి : ముద్దు ముద్దుల మూట నా తెలుగు మాట మురిసిపోయే పూజ నా తెలుగు పాట వేల యేండ్ల చరిత గలది తెలుగు భాష ఎన్నో అణచివెతలను చవిచూసిన ఆశ నా తెలుగు భాష చరణం : నిజాము పాలనలో నలిగినట్టి భాష అయినా తన అస్తిత్వం వదులుకోని ఆశ పోన్నిగంటి తెలుగన అచ్చతెలుగు భాష మల్కిభరాముడిన కుతుబ్ షాహి పోషించిన భాష నా తెలుగు భాష ||ముద్దు|| చ|| సురవరం ప్రతాపరెడ్డి - గోల్కొండ కవుల సంచిక నన్నయ, తిక్కన, ఎర్రన = రాసిన మహాభారతం సినారె సిరా చుక్క నుండి జాలువారె భాష శ్రీశ్రీ అందించిన జయభేరి రా నా భాష రణభేరిరా నా తెలుగు ||ముద్దు|| చ|| కాళోజి నేర్పినట్టి పలుకుబడల భాషరా సామల, (సదాశివం) యశోదరేద్ది తెలంగాణా యాసరా కందుకూరి, గురజాడ, గిడుగు జనం మాటరా పాల్కుర్కి వారి ద్విపద చందము నా భాషరా సందమామనె తెలుగురా ||ముద్దు|| చ|| జానపదుల జనజాతర - తెలంగాణ నేలరా కళామతల్లి కల్పవల్లి - తెలంగాణ గడ్డరా ఆమరుల త్యాగాలకు - ఊపిరిచ్

మనబడి బాలానందం

మనబడి
మీరందరూ అభిమానించే 'మనబడి బాలానందం ' రేడియో కార్యక్రమం ఇప్పుడు వారానికి 2 రోజులు! ప్రతి శనివారం మరియు ఆదివారం టోరీ రేడియోలో!! మనబడి - బాలానందం మనబడి పిల్లలకు తరగతులలో తెలుగు నేర్చుకోవడంతో పాటూ వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉన్నదన్న విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమాలలో "మనబడి బాలానందం", రేడియో ఒకటి. గత 7 ఏళ్ళుగా మనబడి పిల్లలు "బాలానందం" కార్యక్రమాన్ని, ఒక చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదంగా అందిస్తున్నారు. పలువురు పెద్దలు బాలానందం అత్తయ్యలు, మామయ్యలుగా, మనబడి పట్టభద్రులు బాలానందం అన్నయ్యలు , అక్కయ్యలుగా మనబడి విద్యార్థులచే ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. వందలాది మంది పిల్లలు బాలానందంలో పాల్గొని, తెలుగు మాట్లాడటంపై, విని అర్థం చేసుకోవడంపై తమ పట్టుని మరింత పెంచుకొన్నారు. పెంచుకొంటున్నారు. మనబడి బాలానందం రేడియో మీ కోసం ప్రతి శనివారం 11 AM (CST) , ఆదివారం 1 PM (CST) కు

వీక్షణం సాహితీ గవాక్షం -64

శీర్షికలు
- డా|| లెనిన్ అన్నే వీక్షణం 64 వ సమావేశం మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో డిసెంబరు 10 వ తేదీన ఆసక్తికరంగా జరిగింది. శ్రీ చిమటా శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా మిసిమి పత్రిక సహ సంపాదకులు, ప్రముఖ చిత్రకళా చారిత్రకులు శ్రీ కాండ్రేగుల నాగేశ్వర్రావు ఆంధ్రుల చిత్ర కళ చరిత్ర గురించి సవివరంగా ప్రసంగించారు. ముఖ్యంగా పాశ్చాత్య యుగంలో రినైసాన్స్ తరువాత పునరుజ్జీవనం పొందిన చిత్రకళ ను గురించి, ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గురించి వివరించేరు. ముఖ్యంగా పికాసో భారతీయ చిత్రకళా గొప్పదనాన్ని, అప్పటి ఇల్లస్త్రేటెడ్ వీక్లీ సంపాదకులు ఏ. ఎస్. రామన్ గారికి తెలియజేసిన విధానాన్ని వివరించేరు. ఎవరికీ అంత సులభంగా ఇంటర్వ్యూ ఇవ్వని పికాసో ఏ. ఎస్. రామన్ ను దగ్గరకు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇస్తూ "ఇండియా ఈజ్ ఎ లాండ్ ఆఫ్ వేదాస్, ద బుద్ధా, అండ్ ద కలర్స్ " అని పొగిడారట. పార్లమెంటు భవనంలో అశోక చక్ర నమూనా ని తీ

ఎవరీ రాధ?

సారస్వతం
-శారదా ప్రసాద్ రాధ,రాధిక,రాధారాణి,రాధికారాణి అని పిలువబడే ఈమె శ్రీకృష్ణుని బాల్య స్నేహితురాలు. ఈమె ప్రస్తావన భాగవతం లోనూ, జయదేవుని 'గీత గోవిందం'లోనూ ఎక్కువగా కనపడుతుంది. రాధ ఒక శక్తి స్వరూపిణి.అందుకే శ్రీ కృష్ణ భక్తులు రాధాకృష్ణులను విడదీసి చూడలేరు. భాగవతంలో ఈమె ఒక గోపికగా చెప్పబడింది.శ్రీ కృష్ణుడు బృందావనాన్ని వదలి వెళ్ళే సమయానికి రాధ వయసు కృషుని వయసుకన్నా పదేళ్ళు తక్కువ.అయితే రాధ శ్రీకృష్ణుని కన్నాపెద్దదని చెప్పటానికి ఒక వింత కథ ప్రచారంలో ​ఉంది. ఆ కథను కూడా పరిశీలిద్దాం. రాధ ఒక ​గుడ్డి పిల్లగా జన్మించినదని ప్రచారంలో ​ఉంది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని కొన్ని కారణాల వల్ల తన కన్నా ముందుగా జన్మించమని కోరాడు.  లక్ష్మీదేవి, శ్రీహరి కన్నా ముందుగా జన్మించటానికి సున్నితంగా తిరస్కరించింది. శ్రీహరి పలుమార్లు విన్నవించుకోగా, ఒక షరతుపై, ఆమె అందుకు అంగీకరించింది. శ్రీ కృష్ణుణ్ణి చూసే వరకూ, కన

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. పాఠకులందరకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వారణాసి సూర్యకుమారి కం. నూతన సంవత్సర మున మీ తపనలు తీరి కలుగు  మెండు శుభమ్ముల్ పూతావి వోలె  కీర్తియు యేతావున  పరిమళించి  మిమ్మలరించున్ కం. పిల్లా పాపల  గూడియు చల్లగ  కాపురము సాగి చక్కగ  శుభముల్ వెల్లివిరియు  సుఖశాంతులు కొల్లగ  సంపదలు కలిగి  కోర్కెలు  తీరున్ సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ విద్వాన్ శ్రీమతి జి. సందిత, బెంగుళూరు కవిరాజవిరాజి