Month: January 2019

పద్యం – హృద్యం


Warning: printf() [function.printf]: Too few arguments in /home/silicon/public_html/nextgen/sujanaranjani/2017/wp-content/themes/magazine/inc/template-tags.php on line 113
నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ముందస్తుగా పద్యకవితాసక్తులందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాఠకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మాకు అందిన పద్యాలు: భైరవభట్ల శివరామ్, కొక్కిరాపల్లి ఆ:   నూత్న వత్సరంబు నూలుకొనగరమ్ము ఆశలన్నితీర్చ అవనిజనుల యువతమేధనందు యోగ్యతలరుచుండ భావిజీవితంబు బంగరవగ ఆ:  రైతుకూలిమనసు రమ్మమైవెలుగొంద కొత్తపంటలన్ని కొలువుదీర ప్రకృతిసహకరించి ఫలితమివ్వంగను భావిజీవితంబు బంగరవగ ఆ:   మనుషులందుమార్పు మంచినికోరంగ

సంపాదకవర్గం

సుజననీయం
ప్రధాన సంపాదకుడు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకవర్గం: తమిరిశ జానకి కస్తూరి ఫణి మాధవ్ రాపోలు సీతారామరాజు Cheif Editor: M J Thatipamala Editorial Board: Janaki Tamirisa phani Madhav Kasturi Sita Ramaraju Rapolu

2018 కవిత

కవితా స్రవంతి
-రాపోలు సీతారామరాజు వస్తూ వస్తూ కోటి ఆశలను మోసుకొచ్చావు అడుగుపెడుతూనే భారత అంధుల క్రికెట్టులో వెలుగురేఖలు పూయించావు సొంతంగా యుద్ధవిమానంలో ‘అవని’ని అవనిలోకి ఎగిరించావు జిమ్నాస్టిక్స్ లో ‘దీప’కు బంగారపుటద్దులద్దావు పర్యావరణాన్ని పచ్చగా ఉంచాలంటూ ప్లాస్టిక్ ని నిషేధించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి సంకల్పదీక్షనిచ్చావు స్వలింగసంపర్కం సబబేనంటూ సుప్రీంతో తీర్పునిప్పించావు ఆలయంలోకి ఆడవారిని ఆహ్వానించమంటూ అయ్యప్పకే ఆర్డర్లు వేశావు ఆటగాడిని అందలమెక్కిస్తూ పాకిస్తాను ప్రధానిని చేశావు అడవుల్ని అన్యాయంగా నరకొద్దంటూ కేరళని కన్నీటివరదలో ముంచావు కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు రేపావు పుతిన్ ని నాలుగోసారి రష్యా గద్దెనెక్కించావు అక్కడే ప్రపంచదేశాలతో బంతిని తన్నించి ఫ్రాన్స్ ని ప్రపంచ విజేత చేశావు అరవైయేళ్ళ కాస్ట్రో కుటుంబపాలన కాదని క్యూబాలో కొత్తవారిని కోరుకున్నావు ప్రజల ఆకాంక్షలని సమాదర