Author: Sujanaranjani

వీక్షణం సాహితీ గవాక్షం- సప్తమ వార్షికోత్సవం

వీక్షణం
-మాధవపెద్ది ఫణి రాధాకుమారి సెప్టెంబరు 8, 2019 న కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో స్వాగత్ హోటల్ లో ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం- సాహితీ గవాక్షం సప్తమ వార్షికోత్సవం ఆహూతుల ఆనందోత్సాహల నడుమ అత్యంత రసవత్తరంగా జరిగింది. వీక్షణం నిర్వాహకురాలు డా||కె.గీత మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా నెల నెలా క్రమం తప్పకుండా కొనసాగుతున్న వీక్షణం సాహిత్య కార్యక్రమాలకు సహకారం అందజేస్తున్న స్థానిక సాహిత్య కారుల్ని, అభిమానుల్ని వేనోళ్ల కొనియాడారు. ఈ సందర్భంగా వీక్షణం తనతో బాటూ అందరికీ అందజేస్తున్న సాహిత్య స్ఫూర్తి వల్లే ఇదంతా సాధ్యపడుతున్నదని అన్నారు. ఈ సభలో ఉదయం సెషన్ కు శ్రీ పొద్దుటూరి ఎల్లారెడ్డి అధ్యక్షత వహిస్తూ కరుణశ్రీ గారి పద్యంతో ప్రారంభించారు. తర్వాత శ్రీ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం నుంచి పద్యాలనాలపించి అందరినీ ముగ్ధుల్ని చేశారు. ముందుగా శ్రీ చుక్కా శ్రీనివాస్ "ఖదీర్ బాబు కథల గురించి మాట్ల

అమ్మ

కవితా స్రవంతి
- రూపారాణి బుస్సా పేగు తెంచి నొప్పి భరియించి ప్రాణంబు శ్వాస నిచ్చి పలుకు నేర్పి లెస్స మనిషి జేసి గుణము మలచము జేసిన అన్నెమేది మిన్న అమ్మ కన్న జనుమనిచ్చి భువిని చవిజూపితివి తల్లి సంస్కృతినొసగితివి సకలమిచ్చి హితము పెంచి మనము అడవరించితివిగాద అన్నెమేది మిన్న అమ్మ కన్న నాదు అనరు నీదు నాభీలముగ మోసి తీడి దిద్ది నాదు దిటము పెంచి నాదు సుఖము నందు నందము పొందుతు అన్నెమేది మిన్న అమ్మ కన్న

అమెరికా ఉద్యోగ విజయాలు – 10

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న తాబేలు - కుందేలు “అర్జునా! వాళ నీకొక మంచి కథ చెబుతాను” అన్నాడు కృష్ణ. “అదేమిటి బావా, ఇప్పుడు కథలెందుకు. ఇంతకు ముందు చెప్పినట్టుగా కాస్త మంచి విషయాలు చెప్పి, నా ఉద్యోగంలో పనికొచ్చేటట్టుగా చేయి” అన్నాడు అర్జున్. నవ్వాడు కృష్ణ. “నీ ఉద్యోగ విజయాల్లో ఉపయోగపడే కథేనయ్యా. ఇది నేనొకసారి ఒక ప్రాజెక్ట్ మానేజ్మెంట్ సెమినారుకి వెడితే, అక్కడ చెప్పారు. ఇదే కథ ఇంకోరకంగా చిన్నప్పుడే పంచతంత్రంలో కూడా చదివాననుకో. విను మరి” అన్నాడు కృష్ణ. “అయితే చెప్పు మరి” అన్నాడు అర్జున్ సర్దుకుని కూర్చుంటూ. కృష్ణ చెప్పటం మొదలు పెట్టాడు. “అనగా అనగా ఒక తాబేలు. ఒక కుందేలు. ఆ రెండూ ఒక రోజు, ఊరికే కూర్చుంటే ఊరా పేరా అని, పోటీ పడ్డాయి, మనం ఇద్దరం పరుగెడితే ఎవరు గెలుస్తారూ అని. సరే ఎలాగూ అనుకున్నాం కదా ఇక ఆలస్యమెందుకు పరుగెడితే పోలా అని, అవి పరుగెత్తటం మొదలుపెట్టాయి. కుందేలు, ఎలాగైనా మరి కుందేలు కద

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం అక్టోబర్ 2019

ధారావాహికలు
కవికి కలిగిన వ్యక్తిగతానుభవాలను కవితలో వెలువరిస్తాడు. ఈ అనుభవాలన్నిటినీ కవి ఆత్మాశ్రయ కవితలుగా రూపొందిస్తాడు. కవిలో కలిగిన ప్రతి అనుభవాన్నీ కవి వ్యక్తపరచకపోవచ్చు. కవి వ్యక్తపరచిన అనుభూతిని పఠిత తన అనుభూతిగా మార్చుకుంటారు. స్వాత్మీకరణంలో సామాజికుడికి అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవితలో కవి వ్యక్తీకరించటం, దాన్ని సామాజికుడు ఆత్మీకరించుకొని తాదాత్మ్యంతో అనుభవించటం జరుగుతుంది. అనుభూతి ప్రధానంగా ఏర్పడిన కవిత్వంలో వాడిన పదాలు అనుభూతికి మరో పేరుగా ఉంటాయి. ఆత్మగతమైన కవితలో ఈ పదాలకు అనుభూతులే చిహ్నాలు. అనుభవాలని అనుభూతులుగా మార్చుకొన్నప్పుడు కవికి సమగ్రదార్శనికత ఏర్పడుతుంది. సమగ్ర దార్శనికత వల్ల కవి పఠితకు సమగ్రానుభూతిని అందించగలడు. ఈ సమగ్రానుభూతి కవిలో ఏ విధంగా కళానుభూతిగా మారుతుందో వారి మాటల్లోనే చూద్దాం. “సచేతనంగా, సబుద్ధికంగా, సంకల్పసహితంగా జీవితాన్ని ఆచమనం చెయ్యడం అనుభూతిని కళగా అభ్యసించటం

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
అప్పుడు కార్త్యవీరుడి మంత్రులు 'ముందు మాతో యుద్ధం చేయండి' అని రావణుడి మంత్రులను కోరారు. రావణుడి మంత్రులు కోపంతో వాళ్ళను చంపివేశారు. అప్పుడు కార్త్యవీరుడి సేనాపరివారంలో గొప్ప గగ్గోలు పుట్టింది. సంక్షోభం బయలు దేరింది. కొందరు పరిచారకులు వెళ్ళి నదిలో ఉన్న కార్త్య వీరుడికి ఈ సంగతి విన్నవించారు. కార్త్యవీరుడప్పుడు మహాకోపోద్రిక్తుడైనాడు. తనతో జలక్రీడలాడుతున్న సుందరీమణులకు అభయం పలికి ఆయన గొప్ప గద ధరించి గట్టుమీదికి వచ్చాడు. ముందుగా అతడు రావణుడి మంత్రి అయిన ప్రహస్తుడితో తలపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్యా పోరు భీకరంగా సాగింది. తన గదతో బలంగా ప్రహస్తుణ్ణి ప్రహరించాడు కార్త్యవీర్యార్జునుడు.. రావణుడి మంత్రి తలపగిలి కిందపడి పోయినాడు. తరువాత తక్కిన మంత్రులు కార్త్యవీర్యార్జునుణ్ణి ఎదుర్కొన్నారు. వాళ్ళను అవలీలగా పరాజితుల్ని చేసి రావణుణ్ణి బంధించి మాహిష్మతీ నగరం తీసుకొని పోయినాడు కార్త్యవీరార్జునుడు. నగరమంతా తమ

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
కవికి కలిగిన వ్యక్తిగతానుభవాలను కవితలో వెలువరిస్తాడు. ఈ అనుభవాలన్నిటినీ కవి ఆత్మాశ్రయ కవితలుగా రూపొందిస్తాడు. కవిలో కలిగిన ప్రతి అనుభవాన్నీ కవి వ్యక్తపరచకపోవచ్చు. కవి వ్యక్తపరచిన అనుభూతిని పఠిత తన అనుభూతిగా మార్చుకుంటారు. స్వాత్మీకరణంలో సామాజికుడికి అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవితలో కవి వ్యక్తీకరించటం, దాన్ని సామాజికుడు ఆత్మీకరించుకొని తాదాత్మ్యంతో అనుభవించటం జరుగుతుంది. అనుభూతి ప్రధానంగా ఏర్పడిన కవిత్వంలో వాడిన పదాలు అనుభూతికి మరో పేరుగా ఉంటాయి. ఆత్మగతమైన కవితలో ఈ పదాలకు అనుభూతులే చిహ్నాలు. అనుభవాలని అనుభూతులుగా మార్చుకొన్నప్పుడు కవికి సమగ్రదార్శనికత ఏర్పడుతుంది. సమగ్ర దార్శనికత వల్ల కవి పఠితకు సమగ్రానుభూతిని అందించగలడు. ఈ సమగ్రానుభూతి కవిలో ఏ విధంగా కళానుభూతిగా మారుతుందో వారి మాటల్లోనే చూద్దాం. “సచేతనంగా, సబుద్ధికంగా, సంకల్పసహితంగా జీవితాన్ని ఆచమనం చెయ్యడం అనుభూతిని కళగా అభ్యసించటం

దెయ్యాలు

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి పెళ్ళైన అయిదేళ్లకి పుట్టింట్లో ముగ్గురు అక్కచెల్లెళ్ళు మళ్ళీ కలుసుకున్నాక అందరికీ ఒకటే ప్రశ్న – గీతకి ఇంకా పిల్లలెందుకు పుట్టలేదో? ఈ ప్రశ్న ఎలాగా ముందునుంచీ అడుగుతారన్నుకున్నదే కనక గీత తయారుగా ఉంచుకున్న సమాధానం – మా ఆయనకి అప్పుడే పిల్లలక్కర్లేదుట, స్వంత కిరాణా కొట్టు ఉద్యోగం కనక పగలూ రాత్రీ పనీ, అదిగాక కొంత కాలం కుటుంబ నియంత్రణ అవలంబిస్తున్నాం. అడిగిందే అడిగాక, చెప్పిందే చెప్పి ఇంక అందరి నోర్లూ మూసుకున్నాక గీత వెనక్కొచ్చేసింది మొగుడి దగ్గిరకి. తన ఇంటికి వచ్చిన రోజు రాత్రి తాను పడుకుందన్నమాటే గానీ నిద్ర లేదు. పక్కన పడుకున్న రమణ కేసి చూసింది – ఆయన నిద్రలో ఉన్నట్టు గురకే చెప్తోంది. మళ్ళీ ఎప్పుడు లేస్తాడో, పొద్దున్నే లేచి ఎప్పుడు పనిలో పడతాడో తెలియదు. పొద్దున్న ఏడునుంచి రాత్రి తొమ్మిది దాకా అలా కొట్లో కూర్చుని సామాను అమ్ముతూ చిల్లర లెక్కపెట్టుకోవడంలోనే ఈయన జీవితం అయిపోతోం

అమెరికా ఉద్యోగ విజయాలు-10

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న తాబేలు - కుందేలు “అర్జునా! వాళ నీకొక మంచి కథ చెబుతాను” అన్నాడు కృష్ణ. “అదేమిటి బావా, ఇప్పుడు కథలెందుకు. ఇంతకు ముందు చెప్పినట్టుగా కాస్త మంచి విషయాలు చెప్పి, నా ఉద్యోగంలో పనికొచ్చేటట్టుగా చేయి” అన్నాడు అర్జున్. నవ్వాడు కృష్ణ. “నీ ఉద్యోగ విజయాల్లో ఉపయోగపడే కథేనయ్యా. ఇది నేనొకసారి ఒక ప్రాజెక్ట్ మానేజ్మెంట్ సెమినారుకి వెడితే, అక్కడ చెప్పారు. ఇదే కథ ఇంకోరకంగా చిన్నప్పుడే పంచతంత్రంలో కూడా చదివాననుకో. విను మరి” అన్నాడు కృష్ణ. “అయితే చెప్పు మరి” అన్నాడు అర్జున్ సర్దుకుని కూర్చుంటూ. కృష్ణ చెప్పటం మొదలు పెట్టాడు. “అనగా అనగా ఒక తాబేలు. ఒక కుందేలు. ఆ రెండూ ఒక రోజు, ఊరికే కూర్చుంటే ఊరా పేరా అని, పోటీ పడ్డాయి, మనం ఇద్దరం పరుగెడితే ఎవరు గెలుస్తారూ అని. సరే ఎలాగూ అనుకున్నాం కదా ఇక ఆలస్యమెందుకు పరుగెడితే పోలా అని, అవి పరుగెత్తటం మొదలుపెట్టాయి. కుందేలు, ఎలాగైనా మరి కుందేలు క

ఈ మాసం తెలుగు సాంస్కృతిక ఉత్సవం

ఈ మాసం సిలికానాంధ్ర
Place - Chabot College, Hayward Date: October 5, 2019 TCF highlights - 1: Bala Gaandharvam - A grand musical extravaganza- Musical vocal fusion performance by kids ( age -6th grade to 12 grade 2: Veennolla Veyyella padhyam 3: special Kuchipudi Ballet 4: TBD - more info coming in this Sunday meeting . 5: Drama 6: Veena mega musical- by eminent Veena Artist - Phani Narayana 7: Mega Folk Ballet