Author: Sujanaranjani

అతనిప్పుడు

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. అతనిప్పుడు మహావృక్షమే కావచ్చు కానీ, ఒకప్పుడు నేలలో... విత్తుగా నాటబడినప్పుడు ఎన్నో ప్రతికూలాలను ప్రతిఘటించేడు. ఎన్నో పరివర్తనలను ప్రతిబింబించేడు. వంచన,వంచినతల ఎత్తనీయకుండా చేస్తుంటే ఆ అవమానంతో కుమిలి కుంచించుకు పోయేడు ముంచిన అల మరలా లేవనీయకుండా చేస్తుంటే ఆ అహంకార ఆధిపత్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేడు. తన ఊపిరిని, ఉనికిని నిలబెట్టుకోవటమే అప్పటి అతని ఏకైక ధ్యేయమయ్యింది.. అయోమయం, అతని జీవితంలో సహజంగా ఒక అధ్యాయం అయ్యింది. ఒదుగుతూనే ఎదగటం అతనికి ఒక ఆటఅయ్యింది. ఎగ ఊపిరితోనే ఎగరటం అతనికి పరిపాటి అయ్యింది. మొక్కదశ నుండి చెట్టుగా మారటం, అతనికి మహా యజ్ఞమయ్యింది. అలాంటి చెట్టుదశనుండి చేవతో వృక్షంగా మారటానికి అతను మహా ప్రళయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇనా, ఇప్పటికీ అతను గతాన్ని మరువడు. ఎప్పుడూ బేలతనానికి వెరువడు. అతనిప్పుడు ఎందరికో ఒకపాఠం అయ్యేడు అత

తెలుసా?

కవితా స్రవంతి
-పారనంది శాంతకుమారి చీకటే నీకు వెలుగును అందిస్తోందని దుఃఖమే నీపై సుఖాన్ని చిందిస్తోందని ఓటమే గెలుపును నీ ముందుంచుతోందని పతనమే నిన్ను పైమెట్టుకు చేరుస్తోందని తెలుసా? ఓరిమే నీకు కూరిమిగా కలిసొస్తోందని చెలిమే నిన్ను బలిమిగా చేరుతోందని సహనమే నీకు సంపదగా మారుతోందని ప్రేమయే నిన్ను పరిమళమై చుట్టుకుంటోన్దని తెలుసా? శ్వాసయే నీ ఆశను కదిలిస్తోందని నిజాయతీవే నీకో రాయతీని కల్పిస్తోందని నిబద్దతే నీ భద్రతై బ్రతుకునిస్తోందని తెలుసా? ***

రామప్ప దేవాలయం

కవితా స్రవంతి
- అమరవాది రాజశేఖర శర్మ ఘనమైన రామప్ప దేవాలయం మన రామలింగేశ్వరుని ఆలయం నాటి చరితకు ఋజువు మేటి కళలకు నెలవు కోటి కాంతుల కొలువు తేట తెలుగుల పరువు సాటిలేదనిపించి పాటిగా చాటించి దిటవుగా కీర్తి నల్దిశలు పలికించినది కాకతీయులరేడు రేచర్ల రుద్రుడు లోకప్రశస్తిగా కట్టించె నీ వీడు లోకైకనాథు సుశ్లోక నామము గాక శ్రీకరమ్ముగ నిలుపుశిల్పి పేరున వెలుగు ఎత్తైన పీఠికన ఏలికల శైలిగా చిత్తరపు నక్షత్ర చిత్రమై నిలిచింది చిత్తములనలరించు శివలింగ రూపము చిత్తినొసగగ నునుపు శిలలాగ వెలిసింది మండపము స్తంభములు మెండైన ఇతిహాస దండి శిల్పాలతో ధన్యులను గావించు నిండైన రమణీయ నాగిని మదనికల అందాల శిల్పములు నలరించనలరింది ఏవైపు నిలిచినా మనవైపు గనునను భావమై ఆ నంది ప్రాణమై నిలిచింది చెవిని రిక్కించి ఈ భువిని అడుగును నిలిపి శివుని ఆనతి కోరి చిత్రమై తోచింది జలముపైనను దేలు బలముగల ఇటుకలను అల కోవెలను గట్ట వెలయించినారట అల

‘అనగనగా ఆనాటి కథ’

కథా భారతి
-సత్యం మందపాటి స్పందనః అందమనేది శాశ్వతమా, అనుబంధమనేది శాశ్వతమా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు అల్లిన కథే ఈ “సజీవ శిల్పం”. ఈ కథ చదివితే అందంగా వచ్చిన ఈ కథకీ, నాకూ వున్న అనుబంధం మీకు ఇట్టే అర్ధమైపోతుంది. ఆ రోజుల్లో ఎన్నో కొత్త కొత్త వారపత్రికలూ, మాస పత్రికలూ వస్తుండేవి. కొన్ని ఎన్నాళ్ళ తరబడిగానో నిలిచి కాలగమనంలో అంతర్ధానమయాయి. కొన్ని ముందు బాగానే నిలద్రొక్కుకున్నా ఎక్కువ సంవత్సరాలు వుండలేక పోయాయి. కొన్ని ఒకటి రెండు సంవత్సరాల్లోనే మూతపడ్డాయి. ఆనాటి రచయితలకు ఎంతో స్పందనా, పాఠకులకు మంచి కథలూ అందించిన చిన్న సైజు పత్రికల్లో కొన్ని ప్ర్రముఖమైన పత్రికలుః ప్రజామత, జయశ్రీ, ప్రభవ, పొలికేక, విశ్వరచన, నిర్మల, విజయ, పద్మప్రియ, ప్రగతి, జనసుధ, నీలిమ, అపరాధ పరిశోధన మొదలైనవి. సాహిత్య రంగంలో అప్పుడు ఎన్నో పత్రికలతో సాహితీ ప్రియులను అలరించిన రోజులవి. ఇక చదవండి నాకు నచ్చిన ఆనాటి నా కథల్లో నాకు ఇష్టమైన ఒక మంచి కథ

ఆదుకున్న అమ్మ భాష

కథా భారతి
-G.S.S.కళ్యాణి. అది భారతదేశంలో ఒక ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థ. అక్కడ వివిధ స్థాయిల్లో ఉద్యోగులను నియమించేందుకుగానూ ముఖాముఖి సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశానికి హాజరు కావడానికి వచ్చిన అభ్యర్థులు, అక్కడ వరుసగా వేసిన కుర్చీల్లో కూర్చుని తమ వంతు కోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. వారిలో కొత్తగా డిగ్రీ చదువు పూర్తి చేసి, ఉద్యోగాల వేటలో ఉన్న మారుతి కూడా ఉన్నాడు. తన చదువుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చేతిలో పట్టుకుని, అక్కడి పరిసరాలను గమనిస్తున్న మారుతికి తన భవిష్యత్తు పై ఇంతకుముందెన్నడూ కలగని ఆశలు కొన్ని కలుగుతున్నాయి! ‘నాకు ఈ సంస్థలో ఉద్యోగం వస్తే నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు!! నా చదువుకోసం చేసిన అప్పులన్నీ తీర్చెయ్యగలుగుతాను! నాన్న చేత కూలీపని మాన్పించేసి, అమ్మనూ, నాన్ననూ బాగా చూసుకోగలుగుతాను! డబ్బుల కోసం ఇంకెప్పుడూ ఇబ్బంది పడకుండా హాయిగా జీవితంలో స్థిరపడిపోతాను!’, అని అనుకు

ఏం చేస్తుంది?

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. పుట్టగొడుగుల్లా పండితులు పూటకొక్కరు పుట్టుకొస్తుంటే, టీవీలలో ఠీవిగా కనిపిస్తూ, పోటీలుపడి మరీ ప్రసంగాలు పెట్టించుకుంటుంటే, పసలేనితనాన్ని పట్టెనామాలవెనుక దాచుకొని, పనికిరానితనాన్ని రూపుమాపుకోవటానికి, పైసల సంపాదనే పరమార్ధంగా చేసుకొని, ప్రజల మనసులను మభ్యపెడుతుంటే, ఆలకించేవారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అనంతంగా అజ్ఞానులిలా అవతరిస్తుంటే, సుజ్ఞానులు సుంతైనా శ్రద్ధచూపక మౌనాన్ని అభినయిస్తుంటే, విజ్ఞానులు వీటన్నిటినీ వింతనుచూసినట్లు చూస్తుంటే, ఆధ్యాత్మికం అపహాస్యం పాలుకాక ఏమౌతుంది? అసలు తత్త్వం అంతర్ధానమవక ఏం చేస్తుంది?