Author: Sujanaranjani

దృగ్దృశ్య వివేకం

సారస్వతం
​-శారదాప్రసాద్ ఈ ప్రపంచంలో ఉన్న సకల మానవాళిని మూడు విధాలుగా వర్గీకరించవచ్చు! మొదటి వర్గం -పరమాత్మను గురించి తెలియని వారు . వీరే అజ్ఞానులు.రెండవ వర్గం -పరమాత్మను గురించి తెలుసుకోవటానికి తపనపడేవారు. వీరిని జిజ్ఞాసువులు అంటారు.ఇక మూడవ వర్గం --పరమాత్మను గురించి తెలిసినవారు.వీరిని జ్ఞానులు అనొచ్చు! వీరందరూ కూడా ప్రపంచాన్ని వారి వారి దృష్టిలో చూస్తారు.దృగ్దృశ్య వివేకం అనే ఈ గ్రంధం మూడవ వర్గం వారి కోసం వ్రాయబడింది .నిత్యానిత్య వస్తు వివేకం వలన మాత్రమే వైరాగ్య భావం ఏర్పడుతుంది.ఇటువంటి విశ్లేషణం వలన మనసులో ద్వద్వములు లేకుండా పోతాయి.అలా వైరాగ్యం ఏర్పడుతుంది.దృగ్ -దృశ్యం అంటే ఏమిటని కదూ మీ సందేహం?సాధారణ భాషలో చెప్పాలంటే-- చూచేది చూడబడేది -వీటిని గురించి తెలుసుకోవటం. నాలుగు వివేకములను పూర్తి చేసిన సాధకుడు, దృక్ దృశ్య వివేక పరిధిలోకి వస్తాడు. 1) నిత్యానిత్యవస్తువివేకము. 2) ఆత్మానాత్మవివేకము 3)

చిటపట చినుకులతో

కవితా స్రవంతి
- భువనగిరి వేంకట సుబ్రహ్మణ్య ప్రసాద్ ఆ కురిసే వానలో తడవాలని నాకుంది ! వాన వాన వల్లప్పా పాడలని నాకుంది ! వాన నీటి గుంతలో గెంతాలని నాకుంది ! కాగితపు పడవల తొ అడాలని నాకుంది ! చిటపట చినుకులతో చిందులు వేయాలని నాకుంది ! విరిసిన హరివిల్లు ఎక్కాలని నాకుంది ! మెరిసే మెరుపులతో ఎగరాలని నాకుంది ! గొడుగులతో వానలో తిరగాలని నాకుంది ! ఉరుములతో గొంతు కలిపి అరవాలని నాకుంది ! ****

జీవన సాఫల్యం

కవితా స్రవంతి
- కోడం పవన్ కుమార్ శాపం కాదు వ్యాధి అంతకన్నా కాదు అది రెండో బాల్యం క్షణం గడుస్తుంటే వయస్సు పెరుగుతుంటుంది వయస్సు పెరిగేకొద్దీ ముసలితనంతో పాటు పెద్దరికం వస్తుంది భూమ్మీద ఉండటం శాశ్వతం కాదు పుట్టడమే దేహ నిష్క్రమణ కోసం బాల్య కౌమార యౌవ్వనదశలెంత సహజమో వార్ధక్యం అంతే సహజం వయస్సు పెరిగేకొద్దీ సామర్థ్యం తగ్గుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది అంతమాత్రాన కుంగిపోవటం వివేకం కాదు మనఃసామర్థ్యం పదిలపరచుకోవాలి శరీరాన్ని విల్లులా వంచడానికి యోగాసనాలను స్వాగతించాలి మనస్సు మలినపడకుండా ధ్యానం దరిజేర్చుకోవాలి శరీరథర్మంగా దేహం బలహీనపడినా జ్నానార్జన వెలుగుతూనే ఉంటుంది మనస్సు ఆరోగ్యంగా ఉంటే దేహారోగ్యం నిగనిగలాడుతుంటుంది వ్రుద్ధాప్యం మరణానికి దగ్గరి మెట్టు కాదు జీవిత గమనంలో ఓ దశ మాత్రమే గడిచే ప్రతిక్షణాన్ని అమ్రుతంలా పొందాలి జీవితాన్ని పండించుకుని జీవన సాఫల్యం పొందాలి ***

రాక్షసుల పుట్టుపూర్వోత్తరాలు – యుద్ధకాండ

ధారావాహికలు
రాక్షసుల పుట్టుపూర్వోత్తరాలు అగస్త్యులవారప్పుడు "సరే! అయితే విను. రావణుడి పుట్టుపూర్వోత్తరాలు ముందుగా చెప్పి, ఇంద్రజిత్తు ఆ రావణుణ్ణి ఎట్లా మించిపోయినాడో నీవే తెలుసుకొనేట్లు ఆ రాక్షసుల వృత్తాంతం చెపుతాను" అన్నారు. “కృతయుగం దగ్గరకు వద్దాం. బ్రహ్మదేవుడు ముందుగా పదిమంది ప్రజాపతులను (మానసపుత్రులను) సృష్టించాడు కదా! ఈ పదిమందిలో పులస్త్యుడు ఒకడు. ఆయన బ్రహ్మర్షి, వేదనిధి, తపస్వి, మహామహిమాన్వితుడు. ఆయన నిరంతర తపస్సు కోసం మేరుపర్వత పాదప్రదేశంలోని తృణబిందు మహర్షి ఆశ్రమం ఆవాసంగా చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతం రమ్యమైన ప్రకృతి సౌందర్య విరాజితమైన ప్రదేశం కాబట్టి సకల దేవగణ సుందర తరుణులు అక్కడ ఆటపాటలతో, వేడుకలతో, తమ యౌవన విలాసాలతో విహరిస్తుండే వారు. అది పులస్త్య మహర్షికి భరింపరానిదైంది. ఆయనకు చాలా కోపం వచ్చింది. “నా చూపుమేర ఇక్కడకు వచ్చినవాళ్ళు, నా తపస్సుకు అంతరాయం కలిగించిన వాళ్ళు తమ కన్యత్వం పోగొట్టుకొ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి నాటకాన్ని చూస్తున్నా, కవిత్వాన్ని పఠిస్తున్నా సహృదయుడు ఆనందాన్ని పొందుతాడు. ఈ అనుభవం కవికీ, పాఠకుడికీ ఇద్దరికీ ఉంటుంది. “నాయకస్య కవేః శ్రోతుః సమానో నుభావస్తతః" అంటే కవి అనుభూతిని పొంది రాస్తే, దాన్ని పాఠకుడు అనుభవిస్తున్నాడు. అలాగే రంగస్థలం మీద నాయకాదులు అనుభవించి ప్రదర్శిస్తున్న అనుభూతిని ప్రేక్షకుడు అనుభవిస్తున్నాడు. అంటే ఈ అనుభూతికి కారణం కవి పొందిన అనుభూతే. దాన్నే సహృదయుడూ పొందుతున్నాడన్న మాట. అంటే ఈ రెండు అనుభూతులు సమానాలైపోతున్నాయి. ఏ యుగంలోనో రాముడు పొందిన బాధను కవి వర్ణిస్తే, రామాది పాత్రధారులు నటిస్తుంటే, సహృదయుడు అదే అనుభూతిని పొందుతున్నాడన్నమాట. దీన్ని అలంకారశాస్త్రంలో సాధరణీకరణమంటారు. “భారతదేశ రణసిద్ధాంతం"లో సాధారణీకరణం ప్రసిద్ధం. ఈ మార్గం కథనాశ్రయించిన కావ్యాలకే ఎక్కువగా వర్తిస్తుంది. సామాజికానుభవ చైతన్యాన్ని గమనించిన కవి, సామాజికుల సహానుభూతి పొంద కలిగిన పాత్

విశ్వామిత్ర 2015 – నవల ( 23 వ భాగము )

ధారావాహికలు
విశ్వామిత్ర సరెండర్ అయిపోయాడు పోలీస్ స్టేషన్ లో. మీడియాకి ఆ విషయం ముందే తెలియడం వల్ల,మీడియా మొత్తం,నేషనల్ ఛానెల్స్ తో సహా పోలీస్ స్టేషన్ ముందు ఉంది. "నగరంలో జరిగిన బ్లాస్ట్ లకు మీకు సంబంధం ఉందా?" అని విశ్వామిత్రని అడిగినప్పుడు "ఉంది"అని విశ్వామిత్ర చెప్పినప్పుడు మీడియా మొత్తం స్టన్ అయింది. "ఎందుకు బ్లాస్ట్ చేశారు?" "నేరం కాదు కాబట్టి" "ఎందుకు నేరం కాదని మీరు అనుకుంటున్నారు?" "నేను బ్లాస్ట్ చేసిన ప్రోపర్టీస్ అన్నీ నా, నామిత్రుల ప్రోపర్టీలు." "కొన్ని హాస్పటల్స్, హోటళ్ళు కూడా కూల్చేశారు కదా? ఉదాహరణకి గ్రాండియోర్ హోటల్, డాక్టర్స్ n డాక్టర్స్ హాస్పటల్" "అవన్నీ నాలాల్లోనూ, ప్రభుత్వస్థలాల్లోనూ కబ్జాలు చేసి కట్టినవి. కూలిస్తే తప్పేముంది? ఒక్క ప్రాణనష్టమైనా జరగలేదే. అధికారంతోటి, రాజకీయబలం తోటి, కొంతమంది అధికారుల అవినీతిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని కొంతమంది దుర్మార్గులు, లొంగ దీసు

ఈ నెల ప్రత్యేకతలు

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు - అమర్ నాథ్ జగర్లపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హైద్రాబాద్ వారి శీర్షిక గత నెలనుండి ప్రారంభమయ్యాయి. పిల్లలకు, పెద్దలకు వివిధ అంశాలపై వచ్చే రచనలు ప్రతినెల చదవండి. - 2002వ సంవత్సరంలో సిలికానాంధ్ర హస్యవల్లరి పేరిట సేకరించిన కొత్తపాత కార్టూనిష్టుల కార్టూన్లు ఈ నెలనుండి 'హాస్యరంజని ' లో చూడండి. - అమెరికాదేశ వ్యాప్తంగా జరిగిన మనబడి పరీక్షలు, స్నాతకోత్సవాల ఫోటోలు కొన్నింటిని 'మనబడి ' లో చూడండి. మరిన్ని శీర్షికలతో వచ్చే నెలలో కలుద్దాం.  

సంగీత రంజని జూన్ 2018

610వ అన్నమయ్య జయంత్యుత్సవం లో భాగంగా మిల్పీటస్ లో ఏప్రిల్ 23 న జరిగిన ప్రాంతీయ పోటిల్లో బే ఏరియా గురువులు ఆలపించిన కొన్ని కీర్తనలు.