వీక్షణం

వీక్షణం-82

వీక్షణం
వీక్షణం 82వ సమావేశం కాలిఫోర్నియాలోని మోర్గాన్ హిల్ లో డా||కె.గీత గారింట్లో ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం డా||కె.గీత, భర్త శ్రీ సత్యన్నారాయణ గారితో బాటూ కలిసి సభకు ఆహ్వానం పలికారు. ఈ సభకు శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా "తెలుగురచయిత.ఆర్గ్" నుండి శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి "ఉద్వేగాలు" కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు. రాజు, శేషి అన్నా చెల్లెళ్లు. కథా ప్రారంభంలో "ఉద్వేగాలు అంటే నాకు చాలా అసహ్యం. ఏమీ కారణం లేకపోయినా ఏడవగలగడం ఒక గొప్పతనమేమోగాని, సంఘమర్యాదకీ, నాగరికతకీ తగినదిమాత్రంకాదు. పెద్దవాళ్లెవరేనా కంటనీరు పెట్టుకొని ఏడిచారంటే నాకు రోత. నాకేగాదు, నాగరికత అంటే తెలిసిన ప్రతివాడికీని. హరిశ్చంద్రనాటకంలో కూర్చుంటేవేషాలు వేసేవాళ్లు సరిగా ఏడవలేకపోయినా, మనకి అటూ ఇటూ కూర్చున్నవాళ్లు ముక్కులు చీదుకుంటూ, గొంతులు సవరించుకొంటూ కళ్లనీళ్ల

వీక్షణం-81

వీక్షణం
సమీక్ష - ఛాయాదేవి ఛాయాదేవి వీక్షణం-81 వ సమావేశం శానోజే లోని క్రాంతి మేకా గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు గారు అధ్యక్షత వహించారు. ముందుగా అందరికీ పరిచితమైన వీక్షణం సాహితీ గవాక్షం సాహితీ లోకానికే వీక్షణంగా పేరు గాంచాలని సభలోని వారందరూ ఆకాంక్ష వెలిబుచ్చారు. మొదటి అంశంగా డా||కె.గీత శ్రీ విశనాథ సత్యన్నారాయణ గారి "జీవుడి ఇష్టం" కథానికను సభకు చదివి వినిపించి కథా చర్చకు ఆహానం పలికారు. ఈ కథపై ఆసక్తికరంగా చర్చ జరిగింది. కథలో నాగరిక, అనారిక ప్రజల్ని భారతదేశంలోని ప్రజలు, బ్రిటీషు వారిగా ఊహించుకోవచ్చని, ఇందులో ప్రధాన పాత్రధారి అయిన స్త్రీ ధైర్యాన్ని కొనియాడవలసినదని, సీతా రావణుల కథకు ప్రతిరూపమని, స్త్రీ హృదయం ఎవరూ దొంగిలించలేరని, కథ పురుషుడు రాసినందు వల్ల స్త్రీ హృదయావిష్కరణ సరిగా జరగలేదని, ఒక స్త్రీ తన పిల్లల్ని తన కళ్ల ముందు నిర్జీవం కానివ్వదని... ఇలా అనేక రకాల ఆసక్తి

వీక్షణం సాహితీ గవాక్షం-80

వీక్షణం
-వరూధిని వీక్షణం-80 వ సమావేశం కాలిఫోర్నియా బే-ఏరియాలోని పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారింట్లో ఏప్రిల్ 14, 2019 న జరిగింది. ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు, శాంత గారు సభకు ఆహ్వానం పలుకుతూ నిన్నా మొన్న ప్రథమ సభ జరిగినట్లుగా ఉందని ఇంతలోనే వీక్షణం 80 వ సమావేశం లోకి అడుగు పెట్టడం, ఈ సమావేశం తమ ఇంట్లో జరగడం తమకు అత్యంత ఆనందదాయకమని అన్నారు. ఉగాది కవి సమ్మేళనం ప్రధాన కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశానికి శ్రీ రావు తల్లాప్రగడ గారు అధ్యక్షత వహించారు. ముందుగా శ్రీ చరణ్ గారు "రామ నామ శబ్ద విశిష్టత" అనే అంశమ్మీద మాట్లాడుతూ "రం" అనే ధాతువు గురించి, ఋగ్వేదంలోని శబ్ద మూలాల గురించి వివరించారు. రాముని పుట్టుకకు ముందే ఈ శబ్దం ఉన్నదనీ, అత్యంత ఆనందస్థితే ఈ శబ్దమని అంటూ రామ శబ్దానికి ఈశ్వర తత్త్వానికి ఒకటే అర్థమని వివరించారు. ఇందులో భాగంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాల గురించి వివరిస్తూ వేదాల్లో చెప్పిన విషయాలను

వీక్షణం- 79

వీక్షణం
-వరూధిని వీక్షణం 79 వ సమావేశం మిల్పిటాస్ లోని తాటిపామల మృత్యుంజయుడు గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ సుభాష్ పెద్దు అధ్యక్షత వహించారు. ముందుగా చలం గారి కథ "యముడితో చలం" కథను డా||కె.గీత, శ్రీమతి కె. శారద గార్లు చలం, యముని పాత్రలుగా కథను చదివి వినిపించి అందరినీ అలరించారు.కథా పథనం తర్వాత సభలో రసవత్తరమైన చర్చ జరిగింది. ఈ కథ 1958 లో చలం గారు పూర్వ జీవితానికీ, ఆశ్రమ జీవితానికీ మధ్య కాలంలో రాసినదని, కథలో తత్త్వ విచారం సరిగా జరలేదని, కొన్ని ప్రశ్నలకు అర్థం లేనిదని, తప్పు చేస్తేనే శిక్షా?, స్వరం, నరకం అంటే ఏవిటి? పాప పుణ్యాలకు అర్థాలు ఏవిటి? చదువరుల విశ్లేషణ ఎలా ఉంది? అసలు ప్రశ్నలు కథ ముగిసేక మొదలవుతాయి, యముణ్ణి విమర్శిస్తే ఎక్కడా ఎందుకు ప్రతి చర్చ ఉండదు? యముడు, చలం ఇద్దరూ చలమే. చలం గారి ఆత్మాన్వేషణే ఈ కథ..." అంటూ విభిన్న అభిప్రాయల్ని వెలిబుచ్చారు.ఆ తర్వాత కిరణ్ ప్రభ గారు "చలం జీవితం లో

వీక్షణం సాహితీ సమావేశం-78

వీక్షణం
-వరూధిని వీక్షణం 78 వ సాహితీ సమావేశం కాలిఫోర్నియా బే ఏరియాలోని ప్లెసంటన్ లో ఫిబ్రవరి 10, 2019 న శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు, శ్రీమతి ఉమా వేమూరి గారి ఇంట జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు అధ్యక్షత వహించారు. ఈ సభలో ముందుగా శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి కథ "ఉద్యోగం" మీద కథా చర్చ జరిగింది. కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు. ఒక మధ్యతరగతి వాడు ఉద్యోగం కోసం ఎన్ని పాట్లు పడాలో వివరించే కథ ఇది. ఇక కథ పట్ల సభలోని వారు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతూ, చిన్న చిన్న విషయాలు వివరంగా చెప్పడం కొ.కు స్టైల్ అనీ, కథాంశం కంటే చెప్పే విధానం చాలా బావుందని, కథ చదువుతున్నపుడు కాలమానపరిస్థితులు చక్కగా తెలుసుకోగలిగిన కథ, ఆశ, నిరాశల మధ్య ఊగిసలాటని వ్యంగ్యంగా చెప్పడం బావుందని, కథ వేగంగా నడిచినా కథలో వేగం లేదని, చిన్న ఉద్యోగి కేపిటలిస్టిక్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలియజెప్పే కథ అనీ అన్నారు

వీక్షణం-77

వీక్షణం
-- విద్యార్థి   వీక్షణం 77వ సమావేశం జనవరి 13, 2019 నాడు, శ్రీమతి విజయా ఆసూరి, శ్రీ వేణు ఆసూరి దంపతుల స్వగృహమునందు జరిగినది. భోగి పండుగ నాడు జరిగిన ఈ సమావేశం సంక్రాంతి సాహిత్య సభగా, ఒక ఆత్మీయ సమావేశంగా సాగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన వారు ఆచార్య చెన్న కేశవ రెడ్డి గారు. ఈ సభలో మొదటి అంశం రావి శాస్త్రి గారి "పిపీలికం" కథా పఠనం మరియు చర్చ. కథ ఎంత బాగుందో, వేణు ఆసూరి గారి కథా పఠనం కూడా అంత ఆసక్తికరముగా సాగింది. ఈ కథ గురించి వేణుగారు వివరిస్తూ, "రావి శాస్త్రి గారు ఆంధ్ర జ్యోతి పత్రిక వారివద్ద అప్పు తీసుకుని, ఆ అప్పు తీర్చటం కోసం వ్రాసి ఇచ్చిన బాకీ కథలలో పిపీలకం ఒక కథ" అని వివరించారు. ఈ కథ శ్రామిక వర్గాలలో చైతన్యం నింపే కథ. వేరే వారెవరూ కాకుండా, పీడిత ప్రజలు తమకు తాము చైతన్యవంతులై దోపిడీవర్గాలను ఎదుర్కోవటాన్ని తెలిపే కథ. కథా శైలి గురించి విపులంగా జరిగిన చర్చ ఆసక్తికరముగా సాగింది.

వీక్షణం-76 సమీక్ష

వీక్షణం
-వరూధిని వీక్షణం-76 వ సమావేశం ఫ్రీ మౌంట్ లోని షర్మిలా గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.ఈ సభకు శ్రీ తాటిపామల మృత్యుంజయుడు అధ్యక్షత వహించారు.ముందుగా సభలో వీరేశలింగం గారి గురించి ప్రసంగిస్తూ శ్రీ అక్కిరాజు రమాపతిరావు వారి రచనలపై తన డాక్టరేట్ రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు.వీరేశలింగం గారి విశిష్టతను సభకు పరిచయం చేస్తూ ఆధునిక ఆంధ్ర దేశం గోదావరి అయితే వీరేశలింగం నాసికాత్ర్యయంబకం అన్నారు. తెలుగు సాహిత్యంలో ఆధునిక ప్రక్రియలైన నవల, కథ, నాటిక మొ.న అన్నిటికీ ఆయనే ఆద్యుడని పేర్కొన్నారు. ఆయన వితంతువులకి ఉచిత విద్యని అందించాడు.ఆయనను గురించి చిలకమర్తి "అటువంటి సంఘసంస్కర్త, అటువంటి రచయిత మరి కొన్ని వందల ఏళ్లకు గాని మళ్లీ పుట్టడు" అన్నారని అన్నారు.వీరేశలింగం "వివేకవర్థిని" పత్రికను నడిపారు, అనేక ప్రహసనాలు రాసేరు, ఆధునిక భావాల్ని విస్తరింపజేసారు. తన స్వీయ చరిత్రను తన శ్రీమతి రాజ్యలక్ష్మికి అంకితం

వీక్షణం సాహితీ గవాక్షం- 75

వీక్షణం
వజ్రోత్సవ సమావేశం -ఆర్. దమయంతి కాలిఫోర్నియా బే ఏరియాలో నెలకొన్నవీక్షణం సాహితీ సంస్థ 75 మాసాలను పూర్తి చేసుకున్న శుభ తరుణాన వజ్రోత్సవ వేడుకలనుఎంతో ఘనంగా జరుపుకుంది. మిల్ పిటాస్ లో నివసిస్తున్నరచయిత శ్రీ అనిల్ ఎస్ రాయల్ గారి స్వగృహం లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆ నాటి సభలో పాల్గొన్న వారిలో తెలుగు సాహిత్యంలో ఘనాపాటీలు గా కీర్తింపబడుతున్నవారు, వేద పండితులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రసిద్ధ కవులు, రచయితలు, విశేష విశ్లేషకులు,మధుర గాయనీ గాయకులు పాల్గొని , తమ తమ ప్రతిభాపాటవాలతోసభికులను రంజింప చేసారు. సభని ప్రారంభిస్తూ, డా. గంగిశెట్టిలక్ష్మీ నారాయణ వీక్షణం వారి సాహితీ సేవలనుకొని యాడారు. ఆనాటి ప్రధానోపన్యాసకులు, కేంద్రసాహిత్య అకడెమీ అవార్డ్ గ్రహీతలు అయిన శ్రీ సదాశివ మూర్తి గారిని గారిని వేదిక మీదకి సాదరం గా ఆహ్వానించారు. శ్రీ సదాశివ మూర్తి గారు - రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ

వీక్షణం 74వ సమావేశం- సమీక్ష

వీక్షణం
- విద్యార్థి వీక్షణం 74వ సమావేశం శా.శ. ౧౯౪0 ఆశ్వీయుజ పంచమి నాడు, ( అక్టోబరు 14, 2018) నాడు, శ్రీ పెద్దిభొట్ల ఇందు శేఖర్, లావణ్య గార్ల గృహము నందు జరిగినది. ఈ సభకు అధ్యక్షత వహించిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ప్రసంగిస్తూ Myth అనే మాటకు తెలుగులో మిథ్య అనే మాటకు సరి పోలికలున్నవి. హిందీలో మిథిక అనే వాడుక ఉంది. ప్రపంచములోని ఎక్కడి మిథాలజీ కథలు అయినా, మనిషి ఎక్కడ ఉన్నా ఆలోచనలు ఒక్కటే అనేటట్లు ఋజువు చేస్తాయి. గ్రీకు మిథాలజీ కథలు కూడా అటువంటివే" అని చెప్పి, ప్రాచీన గ్రీకు కావ్యాలను సభకు పరిచయం చేయటానికి ఆసూరి వేణు గారిని ఆహ్వానించారు. వేణు గారి ప్రసంగ విశేషాలు - "ప్రాచీన గ్రీకు కావ్యాలు ఇలియడ్, ఒడిస్సేలు మన రామాయణ మహాభారతాలని పోలి ఉంటాయి. వీటి రచయిత హోమర్. షుమారు సామాన్య శక పూర్వం 6వ శతాబ్ది కి చెందినవాడు. హోమర్ అనాథ, పైగా అంధుడు. వాల్మీకిలాగా ఆనాటి కుల వ్యవస్థలో ఉన్న కష్టాలును అధిగమించి,

వీక్షణం ఆరవ వార్షికోత్సవం

వీక్షణం
-జయమాల & దమయంతి వీక్షణం ఆరవ వార్షికోత్సవం సెప్టెంబరు 16, 2018 న మిల్పిటాస్ లోని స్వాగత్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. సభను ప్రారంభిస్తూ వీక్షణం సంస్థాపకురాలు డా||కె.గీత ఆరేళ్ల ప్రస్థానాన్ని తల్చుకుంటూ ఇప్పుడు వీక్షణం ఇక్కడి వారి జీవితంలో భాగస్వామ్యమైపోయిందనీ, ఆపాలనుకున్నా ఆగని నిరంతర సాహితీ వాహిని గా అందరినీ అలరిస్తూందని, ఈ సంవత్సరం శేక్రమెంటో లో మరో శాఖతో విస్తరిస్తూ సాహితీ సేవలో మరో అడుగు ముందుకేసిందనీ అంటూ అందరికీ ఆహ్వానం పలికారు. ఉదయం సెషన్ కు శ్రీ చుక్కా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా సాహిత్య సమావేశాలు జరుపుకుంటున్నామంటే మనందరిలో సాహిత్యాభిరుచి, సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి కారణమని అందరినీ అభినందిస్తూ సభను ప్రారంభించారు. ముందుగా శ్రీ తాటిపామల మృత్యుంజయుడు "భగవద్గీత ను ఎలా చదవాలి, ఎందుకు చదవాలి?" అనే అంశం పై ప్రసంగిస్తూ, తాను చెప్పదలుచుకున్నద