సారస్వతం

నరసింహ సుభాషితం

– ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి

శ్లోకం:

यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् ।
लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।।

యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం? ।
లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి? ।।

సంధి విగ్రహం

యస్య, న, అస్తి, స్వయం, ప్రజ్ఞా, శాస్త్రం, తస్య, కరోతి, కిం।
లోచనాభ్యాం, విహీనస్య, దర్పణః, కిం, కరిష్యతి।।

శబ్దార్థం

యస్య = ఎవనికి,

నాస్తి = లేదు,

తస్య = అతనికి,

కరోతి = చేస్తుంది,

కిం =ఏమి,

శాస్త్రం = ఏ విషయ గ్రంథమైనా,

లోచనాలు = కళ్ళు,

విహీనస్య = లేని వానికి,

దర్పణః = అద్దం,

కిం =ఏమి, కరిష్యతి =చేయగలదు

Meaning

One who does not have any stuff with in him or does not possess any inherent abilities and grasping of things, what a Shastra or subject can do to him? Means, subjects simply cannot help anyone who is incapable of understanding and master them.

It is like, for a person whose both eyes are blind totally, what a mirror can do to him? A mirror is not a means to give him vision. Such a person cannot get vision by external means.

భావార్థం

ఎవనికైతే స్వయం ప్రజ్ఞా పాటవాలు లేవో వానికి శాస్త్రం ఏమి చేస్తుంది?
ప్రతీ మనిషీ పుట్టుకతో కొన్ని శక్తి సామర్థ్యాలు సహజసిద్ధంగా కలిగి ఉంటాడు. అవి అతనిలో అంతర్లీనమై ఉంటాయి. బాహ్య ప్రేరణల ద్వారా అవి మెల్లగా ప్రస్ఫుటమౌతాయి. క్రమక్రమంగా రాణింపుకి వస్తాయి. శైశవ దశలోనే వాటిని గ్రహించగలిగితే, వానికి ఆయా శాస్త్రాలలో సరియైన గురు ముఖతహా ప్రవేశం కలిగించినట్లైతే ఆ శాస్త్ర సంబంధమైన విషయపరిజ్ఞానంతో ఆతనిలో అంతర్లీనమై నిద్రాణముగా ఉన్న శక్తి సామర్థ్యాలు మెల్లగా బాహ్య ప్రపంచానికి ప్రస్ఫుటమవుతాయి. తదుపరి తన స్వయం ప్రతిభతోనూ,మేథా శక్తితోనూ, విషయపరిజ్ఞాన పరిశోధనతోనూ, తనయొక్క విశ్లేషణా శక్తితోనూ వాటికి పదునుపెట్టి, తోటి విద్యార్థులతోను మరియూవిద్వాంసులతోచర్చల ద్వారామరికొంత నేర్చుకుని, కాలక్రమేణా తన జీవితానుభవాల ద్వారా, జిజ్ఞాసతో కూడిన నిరంతర గ్రంధ పఠనం ద్వారా మిగిలినది నేర్చుకుని ఆయా శాస్త్రాలలో పరిపక్వత సాధించుతాడు. ఆ శాస్త్రాలలో లేదా ఆ విద్యలలో నిష్ణాతుడౌతాడు.

ఈ సాధానా, సాఫల్యాలకి అసలు మూలం అతనికి సహజ సిద్ధముగా అంతర్లీనముగా ఏదో ఒకవిషయాశక్తి ఉండడమనేది ప్రధానం. ఏ రకమైన విషయాశక్తి లేనివానికి ఏ విధమైన ఉత్ప్రేరకమూ కూడా పనిచేయదు. శాస్త్రము అతనికి ఏ రకమైన ఉత్ప్రేరకమూ కాజాలదు.

“అంతస్సార విహీనానాం రసః కేనోపజాయతే”అనే నానుడి ఇక్కడ గుర్తుకి వస్తుంది. తనలో ఏ రకమైన సారము లేనివానికి రసోత్పత్తి దేనివలన జరుగుతుంది? అతనికి శాస్త్రము ఏమిచేయగలుగుతుంది? శాస్త్రాలు అన్నీ అతని ముందు వ్యర్థం. శాస్త్రం ఏమీ చేయలేదు అని తాత్పర్యం.

స్వయం ప్రజ్ఞ లేని వానికి శాస్త్రము ఏమీ చేయలేదు అనేది ఎటువంటిది సామీప్యం కలిగినది అంటే, అసలు కళ్ళే లేని వానికి, అంధునికి ఒక దర్పణం అనగా అద్దం ఇచ్చినట్లు అయితే అతనికి ఆదర్పణం ఏమి చేయగలుగుతుంది ? ఏమీ చేయలేదు. ఏవిధంగానూ ఉపయోగపడదు. అతని అంధత్వాన్ని ఆ దర్పణం పోగొట్టలేదు.

స్వయం ప్రజ్ఞ-2

శ్లోకం:

व्याधिर्भेषजसंग्रहैश्च विविधैर्मन्त्रप्रयोगैर्विषं ।
सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम् ।।

వ్యాధిర్భేషజసంగ్రహైశ్చ వివిధైర్మంత్రప్రయోగైర్విషం ।
సర్వస్యౌషధమస్తి శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్త్యౌషధం ।।

సంధి విగ్రహం

వ్యాధిః,భేషజైః, సంగ్రహైః, చ,వివిధైః,మంత్రైః, ప్రయోగైః, విషం
సర్వస్య, ఔషధం, అస్తి, శాస్త్రః, విహితం, మూర్ఖస్య, న, అస్తి, ఔషధం

శబ్దార్థం

వ్యాధిః = రోగము,

భేషజైః సంగ్రహైః = ఔషథ మూలికలచేత,

చ = మరియు,

వివిధైః =అనేక రకములైనటువంటి,

మంత్రైః ప్రయోగైః = మంత్రములచేత,

విషం = విషముని
సర్వస్య = అన్నిటికినీ,

ఔషధం = మందు,

అస్తి = ఉన్నది,

శాస్త్రః విహితం = శాస్త్ర పరిజ్ఞానము లేని,

మూర్ఖస్య = మూర్ఖునికి,

ఔషధం = మందు,

న అస్తి = లేదు.

Meaning

For a disease, there are many combinations of herbals that make medicinal drugs to cure the disease and by chanting many varieties of mantras or hymns, poison in the body can be completely eradicated.

The one who does not possess any subject knowledge or knowledge of any Shastra is ignorant of things and is considered a Moorkha or a fool.For everything, there is a medicine but, there is no “Aushadham” or medicine to cure the ignorance or foolishness of such a person who does not possess any knowledge of Shastra. Assuming there are inherent abilities of grasping of things for a person, acquiring any subject skills is very important and the need is very much stressed. There is no medicine to cure ignorance of such a person’s lack of subject knowledge.

భావార్థం

వ్యాధిని ఔషధ సమ్మిళితాలతో నివారించవచ్చు, విషహరణానికి అనేకమైన మంత్ర ప్రయోగాలు ఉన్నాయి.

అన్నిటికీ ఔషధాలు ఉన్నాయి, కానీ శాస్త్ర విహీనునుడైన మూర్ఖునికి ఏ ఔషధమూ లేదు.

మనిషి అన్నాక, శరీరానికి ఎన్నో రకాలైన రోగాలు సంక్రమిచడానికి అవకాశం ఉంది. శరీరం రోగగ్రస్థమవడం అనేది కూడా సహజం. అయితే అన్ని రకాలైన వ్యాధులకి వైద్యం ఉంది. మూలికా వైద్యం ఆయుర్వేద శాస్త్రం యొక్క ప్రముఖ వైద్య విధానం. వివిధ ఔషధాల సమ్మిళితముచే వ్యాధిని నిర్మూలించ వచ్చు. ప్రాణాంతకమైన వ్యాధులకి కూడా మంచి ఔషధాలు ఉన్నాయి.శరీరం లో వివిధ రకాలైన విషాలు జేరుతూ ఉంటాయి. వాటిని ఆంగ్లములో oxidants అంటాం. వాటి నిర్మూలనకి మూలికాపరంగా ఔషధాలు ఉన్నాయి. అవే వివిధ రకాలైనanti oxidants.

కొన్ని క్రిమికీటకాదులచే, జంతువులచే అనగా పాము కాటు, తేలు కాటు వగైరా వాటిచే శరీరం విష ప్రయోగానికి గురి కావచ్చు. వాటి నియంత్రణకి, ప్రజా బాహుళ్యం బాగా నమ్మేటటువంటి మంత్ర ప్రయోగములాంటి చికిత్సలు ఉన్నాయి.

వెరసి, అన్నిటికీ అంటే ప్రతీ రోగానికి ఏదో ఒక రకమైన ఔషధమూ, ఔషధ విధానమూ ఉన్నాయి.

కానీ శాస్త్ర విహీనుడైన వానికి, అనగా ఏ రకమైన స్వయం ప్రజ్ఞ లేనివానికి ఏ శాస్త్రమూ ఉత్ప్రేరకం కాజాలదు కావున ఒక విధంగా అతనిని మూర్ఖుడిగా పరిగణించ వచ్చు, వాని అజ్ఞానము అనే మూర్ఖత్వాన్ని తొలగించడానికి మాత్రము ఏ రకమైన ఔషధమూ లేదు.

తివిరి యిసుమునఁ దైలంబుఁ దీయవచ్చుఁ

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావ వచ్చుఁ

దిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చుఁ

జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

అని భర్తృహరి తన సుభాషిత రత్నావళి శ్లోకాన్ని తెలుగులో యేనుగు లక్ష్మణ కవి ద్వారా మూర్ఖుని మనస్సు రంజింపజేయలేము అనే విషయం స్పష్టం చేస్తున్నాడు.

అనగా ఏ రకమైన ఔషధమూ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked