ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 11వ భాగము )

– యస్. యస్. వి రమణారావు

శివహైమ ని డ్రాప్ చేసి గెస్ట్ హౌస్ కి వచ్చాడు అభిషేక్. తాజ్ లో డిన్నర్ చేస్తుండగా తెలిసిన రెండు విషయాలు అతన్ని అశాంతికి గురిచేశాయి.అవి రెండు టెలిఫోన్ కాల్స్ కి సంబంధించినవి.మొదటి కాల్ రఘురామ్ నుంచి వచ్చినది.రెండవది శివహైమకి వచ్చిన కాల్.”మూడో మనిషిని పంపించడం ఇష్టం లేక నేనే వెళ్ళాను.నీ కానిస్టేబుల్ ఇంకొక ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ తో కలిసి జగదాంబ జంక్షన్ దగ్గరున్న ’జానీహార్స్’ బార్ కి వెళ్ళాడు.అక్కడ వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు.అదంతా నాపెన్ కెమెరాతో రికార్డ్ చేశాను.నేను రికార్డింగ్ మొత్తం చూడలేదు క్వాలిటి చెక్ చేయడానికి అక్కడక్కడ చూశాను. శివహైమ,విశ్వామిత్ర అన్న పేర్లు బాగా వినపడ్డాయి.మధ్యలో మన సిటి మునిసిపల్ కమీషనర్ శివకుమార్ పేరు కూడా వినపడింది.నీకా పెన్ను మా కానిస్టేబుల్ తో సీల్డ్ కవర్ లో పంపిస్తున్నాను.ప్లీజ్ కీప్ ద పెన్ ఏస్ మై గిఫ్ట్”అంతా విని కానిస్టేబుల్ ని మఫ్టీలో పంపించమని చెప్పాడు అభిషేక్. ఇక రెండవది డిన్నర్ చేస్తుండగా తొమ్మిది,తొమ్మిదిన్నర మధ్యలో వచ్చిన ఇంకో ఫోన్ కాల్.శివహైమ ఆ కాల్ ఆన్సర్ చేయలేదు.అసలు ఫోన్ చూడకుండానే కట్ చేసింది.అందులో అంత అశాంతికి గురి అవ్వాల్సిన అవసరం ఏముంది?అభిషేక్ కి సడన్ గా అప్పుడు గుర్తు వచ్చింది,శ్రీశైలంలో కూడా అప్రోక్సిమేట్ గా అదే సమయంలో ఫోన్ వచ్చింది.అప్పుడు కూడా శివహైమ ఫోన్ చూడకుండానే కట్ చేసింది.సమయం విషయంలో తను పొరబడి ఉండవచ్చు.కానీ తను కాల్ చేసినప్పుడు వచ్చే రింగ్ టోన్ వేరు.ఆ రింగ్ టోన్ వేరు.తల విదిలించుకుని రఘురామ్ ఇచ్చిన పెన్ కెమెరాలోని వీడియో ప్లే చేశాడు.వీడియో చూస్తుంటే అభిషేక్ కి బుర్ర గిర్రున తిరగడం ప్రారంభించింది.”ఏమిటిది? తను చూస్తున్నది వింటున్నది నిజమేనా?శివహైమ ఏమిటి? మద్యం షాపు గొడవలో ఇరుక్కోవడం ఏమిటి?అప్పుడు విశ్వామిత్ర తప్పించడం ఏమిటి?అతనికి బుర్ర పిచ్చెక్కి పోయింది.వెంటనే లాప్ టాప్ ఆఫ్ చేసి ,లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు.అప్పుడు మోగింది అతని ఫోన్.రాజునుంచి కాల్.”సార్,విశ్వామిత్ర గురించి తెలిసిన వాళ్ళనెవరినైనా పట్టుకోమన్నారు కదా,ఆ ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేసే కేప్టెన్ దొరికాడు సార్.విశ్వామిత్ర ఆ హోటల్ కి ఎప్పుడు వచ్చినా వాడే అన్నీ చూసేవాడంట సార్ ”

“ఓ!దట్స్ రియల్లీ గుడ్.ఎలా పట్టుకున్నారు?”

“మీరే చెప్పారు కద సార్.ఆ హోటల్ లో పనిచేసేవాళ్ళంతా చుట్టుపక్కలే ఎక్కడో సెటిలయిపోయుంటారు పట్టుకొమ్మని”

“ఓకె.వాడిప్పుడెక్కడున్నాడు?”

“సిటీ సబర్బ్స్ లో వాడు ,వాడితోపాటు ఇంకో నలుగురు బేంక్ లోన్ తీసుకుని సబ్బవరం దగ్గర సొంతంగా ఒక హోటల్ పెట్టుకున్నారంట సార్”

“రేపే వాడితో మాట్లాడదాం”

“మీరీమాటంటారనే నేను ఆల్రెడీ వాడితో మాట్లాడాను సార్.అతని దగ్గర చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది సార్” ఒక్క నిమిషం ఆగి అన్నాడు రాజు”సారీ సార్.మిమ్మల్ని అడగకుండా చాలా మాట్లాడేశాను.”

“ఇట్స్ ఓకె.ఎప్పుడు రమ్మన్నాడు?”

“రేపే సార్.లంచ్ టైమ్ కి రమ్మన్నాడు.ఇంకొక్క విషయం సార్.బాగా డబ్బులడుగుతున్నాడు సార్.వాడి బేంక్ లోన్ సగం మనచేతే కట్టించేటట్టున్నాడు సార్”

“తప్పకుండా ఇద్దాం.ముందర డబ్బులిచ్చే మాట్లాడదాం.ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు కదా”

“థాంక్యూ సార్”

“గుడ్ నైట్”

ఎందుకో చాలా రిలీఫ్ గా అనిపించింది అభిషేక్ కి.అశాంతిగా ఉన్న సమయంలో మంచి డైవర్షన్,అందులోనూ కేసుకు ఉపయోగపడేది.

`గాడ్ ఈస్ గ్రేట్’ అనుకున్నాడు అప్రయత్నంగా.లైట్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked