“సంస్కృతి అంటే?“
– తాటిపాముల మృత్యుంజయుడు
సంస్కృతి అంటే జీవన విధానం, నాగరికత, భాష, సాహిత్యం, కళలు ఇలా కలగలుపుతూ ఎన్ని విధాలుగానైనా చెప్పుకోవచ్చు. సంసృతి అంటే ముందు కాలం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భావితరాలకు భద్రంగా అందించే సంపద అనుకోవచ్చు. కళలు 64 (చతుషష్టి) విధాలు. వెనువెంటనే మనకు తట్టేవి సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం మొదలుగాగల జనసామాన్యమైనవి.
సర్వే లెక్కల ప్రకారం, ఉత్తర అమెరికాలో గత కొన్నేళ్ళుగా అత్యంత గణనీయంగా పెరుగుతున్న జాతి తెలుగు మాట్లాడే కుటుంబాలు. ఈ విషయాన్ని ముందస్తుగానే గమనించి అనుకుంటాను, సిలికానాంధ్ర 17 ఏళ్ళ క్రితం ఆవిర్భవించి తెలుగు సంసృతిని ముందు తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో నిర్విరామంగా కృషి చేస్తున్నది.
అదే విధంగా సుజనరంజని మాసపత్రిక కూడా రచనల రూపంలో తెలుగు సంస్కృతిని వెల్లడించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇందుకు సహకరిస్తున్న మీకందరికి సాహితీ వందనాలు!