– సునీల పావులూరు
“దేహో యమన్న భవనోన్నమ యస్తుకోశ
శ్చాన్నేన జీవతి వినశ్యతి తద్విహీనః,
త్వక్చర్మ మాంసరుధిరాస్థి పురీషరాశి
ర్నాయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధం:”5
“అన్నం బ్రహ్మేతి వ్యజానాత్| అన్నాధ్దేవ
ఖల్విమాని భూతాని జాయంతే| అన్నేన జాతాని జీవంతి|
అన్నం ప్రయం త్యభిసం విశంతీతి| తద్విజ్ఝాయ|”6
ప్రతిప్రాణీ అన్నం వలన జన్మించి, అన్నంతో జీవించి, అన్నంలోనే లయిస్తోంది. ఈ అన్నమయ్య కోశాన్ని
“కర్మేన్ద్రియైః పంచభిరంచితోయం
ప్రాణో భవేత్ప్రాణమయస్తు కోశః,
యేనాత్మవానన్న మయోన్న పూర్ణాత్
ప్రవర్తతే సౌ సకల క్రియాసు”7
“ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్| ప్రాణాద్ధేవ ఖల్విమాని
భూతాని జాయంతే| ప్రాణేన జాతాని జీవంతి|
ప్రాణం ప్రయం త్యభిసంవిశంతీతి| తద్విజ్ఞాయ|” 8
అన్నమయకోశాన్నావరించుకొని ప్రాణమయకోశం ఉంది. ఇది స్థూల శరీరాన్ని ఆవరించుకొని ఉంది.
ప్రాణమయ కోశానికి కూడా జనన మరణాదులు ఉన్నాయి.
“జ్ఞానేన్దియాణి చ మనశ్శ మనోమయః స్యాత్
కోశో మమాహమితి వస్తు వికల్ప హేతుః,
సంజ్ఞాది భేదకలనాకలితో బలీయాం
స్తత్పూర్వ కోశమభి పూర్య విజృంభతేయః”9
“మనో బ్రహ్మేతి వ్యజానాత్| మనసోహేవ
ఖల్విమాని భూతాని జాయంతే| మనసా జాతాని జీవంతి|
మనః ప్రయః త్యభినం విశంతీతి| తద్విజ్ఞాయ”10 శ్రోత్రాది పంచేంద్రియాలను మనస్సునుమనోమయ కోశమంటారు. మనస్సు ద్వారా మనం పరమాత్మను చేరలేము.
“బుద్ధిర్బుద్ధీన్ద్రియైః సార్ధం సవృత్తి: కర్తృ లక్షణః
విజ్ఞానమయకోశః స్యాత్పుంసః సంసారకారణమ్”11
“విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్| విజ్ఞానాద్డ్యేవ
ఖల్విమాని భూతాని జాయంతే| విజ్ఞానేన జాతాని
జీవంతి| విజ్ఞానం త్యభిసం విశంతీతి| తద్విజ్ఞాయ|” 12
క్షణిక విజ్ఞాన రూపమగు బుద్ధి జ్ఞానేంద్రియ సహితంగానూ, వాటి వృత్తులతోటీ, కర్తృత్వాద్యహంకారంతోనూ కలిసి ఉన్నదాన్ని విజ్ఞానమయకోశం అంటారు. ఈ కోశానికి కూడా జనన మరణాదులు ఉన్నాయి.
“ఆనన్ద ప్రతిబింబ చుంబిత తనుర్వృత్తి స్త మోజృంభితా
స్యాదానన్దమయః ప్రియాదిగుణకః స్వేష్టార్ధ లాభోదయః,
పుణ్యస్యానుభవే విభాతి కృతినామానన్దరూపః స్వయం
భూత్వానందతి యత్ర సాధు తనుభృన్మాత్రః ప్రయత్నం వినా”13
“ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్| ఆనందాద్ఢ్యేవ
ఖల్విమాని భూతాని జాయంతే| ఆనందేన జాతాని
జీవంతి| ఆనందం ప్రయం త్యభిసం విశం తీతి|”14
ఈ విజ్ఞానమయ కోశాన్నావరించుకొని ఉన్న సూక్ష్మ శరీరమే ఆనందమయకోశం. అంతర్ముఖమైన బుద్ధి వృత్తిగలవారిని బ్రహ్మేస్వయంగా ఆనందరూపంగా మారి ప్రసన్నులని చేస్తాడు.
పైన చెప్పినటువంటి అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయ కోశాల సంపుటీకరణమే సమగ్రానుభూతి. ఒక్కొక్కకోశం వల్ల కలిగేది పాక్షికానుభూతి.
“భారతీయ వేదాంత పరిభాషలో ఉన్న అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ప్రాణమయ, ఆనందమయ కోశాలను ఆధునిక మనశ్శాస్త్ర పరిభాషలో చెప్తే – ఇంద్రియ చైతన్య ప్రవృత్తి (Physical Domain), భావచైతన్య ప్రవృత్తి (Emotional Domain), జ్ఞానచైతన్య ప్రవృత్తి (Intellectual Domain), జీవచైతన్య ప్రవృత్తి (Physical Domain), ఆధ్యాత్మిక చైతన్య ప్రవృత్తి(Spiritual Domain). ఈ అయిదు ప్రవృత్తులు మనిషికి ఎలా వర్తిస్తాయో సమాజానికి కూడా అలాగే వర్తిస్తాయి. సమాజం ఇంద్రియ చైతన్య ప్రవృత్తిలో – అన్నమయకోశం ద్వారా – వాస్తవానుభూతులను ఆస్వాదిస్తుంది; భావ చైతన్య ప్రవృత్తితో – మనోమయకోశం ద్వారా – కాల్పనికానుభూతుల్ని అస్వాదిస్తుంది; జ్ఞాన చైతన్య ప్రవృత్తితో – విజ్ఞానమయకోశం ద్వారా బుద్ధిశక్తిచేత సాధించే వివిధ వైజ్ఞానిక ప్రయోగాల ప్రజ్ఞాపాట్యవం వలన కలిగే జ్ఞానానుభూతుల్ని ఆస్వాదిస్తుంది. జీవచైతన్య ప్రవృత్తితో ప్రాణమయకోశం ద్వారా సమాజంలోని సాటిమానవ సహానుభూతులకు స్పందించే సాత్విక చైతన్యాన్ని సాధించి పూర్ణమైన విశ్వచైతన్యంలో వ్యక్తిని కూడా పూర్ణచైతన్యాంశంగా పరివర్తింపచేయగలిగే అనుభవాన్ని ఆస్వాదిస్తుంది. ఆధ్యాత్మిక చైతన్య ప్రవృత్తిలో ఆనందమయ కోశం ద్వారా, విశ్వచైతన్యం వ్యక్తి చైతన్యం ఒక్కటే అన్న అద్వైత స్పృహతో కూడుకొన్న తాత్త్వికానుభవం సాధిస్తుంది.”15.
– సశేషం