ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం
అలాగే గురజాడ అప్పారావుగారూ సంఘసంస్కరణ పతాకగా వెలిగారు.
“ధూమకేతువు కేతువనియో
మోము చందురు డలిగి చూడడు?
కేతువాయది? వేల్పు లలనల
కేలి వెలితొగ కాంచుమా!’’
అని చెప్పి ప్రజలలో ఆలోచనని రేకెత్తింప చేశారు. మగడు వేల్పన్న పాతమాటను, స్త్రీపురుష సంబంధాన్ని గురించి, బూజుపడ్డ పాతభావాలనీ కడిగివేశాడు. ఈ విధమైన రచనల్లో అనుభూతి జ్ఞాన చైతన్య ప్రవృత్తిని ఆశ్రయించి (Intellectual Domain) ప్రకాశించిందని చెప్పుకోవచ్చు.
ఆంగ్ల విద్యా ప్రభావంవల్ల తెలుగు భాషలో నవలలు, నాటకాలు, కధలు, విమర్శలు, జీవితచరిత్రలు మొదలైన ఎన్నో ప్రక్రియలు తెలుగుబాషలో తమ తమ స్థానాలను ఆక్రమించుకుంటూ వచ్చాయి. నవలలు పౌరాణికాలుగా, చారిత్రకాలుగా, సామాజికాలుగా - మరెన్నో విధాలుగా విభాగాన్ని కలిగి ఉన్నా ప్రధానంగా నవల కాల్పనిక చైతన్యానికి (Emotional Domain) కి సంబంధించిది. ఇంగ్లీషులో Fiction విభాగానికి చెందిన నవల కల్పనలకి చెందినదై, ఊహల అల్లికకు చెంద