గొలుసు కవిత
అయ్యయ్యో ! శివ శివా! -
(సూత్రంః శివ నిందాస్తుతి. మొదటి రెండు వాక్యాలు నిందాస్తుతి, మూడవ వాక్యం స్తుతితో శివతత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం. మహాశివరాత్రి తరుణంలో మనబడి భాషాప్రేమికులు అల్లిన మారేడు దళ మాలిక. ఆలోచనః వేణు ఓరుగంటి )
ఎద్దునెక్కుతావు, పులితోలు తొడుగుతావు
భూతదయ నీకెక్కడయ్యా భూతేశా? శివ శివా!
పంచభూతాలూ నువ్వేకదా ఓ పరమేశా! (వేణు ఓరుగంటి)
బూడిద రాస్తావు, పుర్రెల హారం చుడతావు!
నీదేమి అందమయా గౌరీశా? హరహరా!
నీలో సగమైనది జగన్మోహనం ఓ అర్ధనారీశా! (భాస్కర్ రాయవరం)
త్రిశూలం పట్టుకుంటావు, శ్మశానంలో ఉంటావు,
నువ్వంటే భయంతో చావాలి కానీ, హరోం హర!
చచ్చినాకా నీదగ్గరకే చేరాలని తపస్సు! మృత్యుంజయా! (వేణు ఓరుగంటి)
బొమ్మతల కొట్టేవు, బొమ్మకు తలపెట్టేవు
ఇదేమి తిక్కనో తెలీదు కానీ, తిక్కశంకరయ్యా!
చక్కటి కథలురాసిచ్చే బొ