చంద్రశేఖర్ చరిత్ర

సంప్రదించిన గ్రంథాలు

Chandrasekhar, S., Truth and Beauty: Aesthetics and Motivations in Science, The University of Chicago Press, 1987. Wali, Kameshwar C., Chandra: A Biography of S. Chandrasekhar, University of Chicago Press, Chicago, 1991. Wali, Kameshwar C., “Chandra: A Tribute,” in (Ed.) Robert M. Wald (Ed.) Black Holes and Relativistic Stars, The University of Chicago Press, 1998. Chandrasekhar, Lalitha., “Our Song,” in (Ed.) Robert M. Wald (Ed.) Black Holes and Relativistic Stars, The University of Chicago Press, 1998. Miller, Arthur L., Empire of the Stars: Obsession, Friendship, and Betrayal in the Quest for Black Holes, Houghton Mifflin Co, Boston, 2005. వేమూరి వేంకటేశ్వరరావు, వేమూరి నిఘంటువు, తెలుగు వికీపీడియా వేమూరి వేంకటేశ్వరరావు, విశ్వస్వరూపం, కినిగె ప్రచురణ, Kinige.com

క్లిష్ట పదాలకి అర్థాలు

-వేమూరి వెంకటేశ్వర రావు అణువు = atom అత్యూద = ultra violet అనిశ్చితత్త్వ సూత్రం = Principle of Uncertainty అనిష్టాపత్తి = reductio ad absurdum అభిజాత్యం = impeccable lineage అభిజిత్ = Vega, the star అభిషవ శశవిషాణం = achieving the impossible by illogic అరుణ మాహాతార = red giant, a type of star అవధి = limit అసాపేక్ష శిధిలత్వం = non-relativistic degeneracy ఆత్మగత దృక్పథం = subjectivity ఆదర్శ వాయువు = ideal gas, perfect gas ఆదర్శ వాయు సూత్రం = ideal gas law, PV = kT ఆర్ద్ర = Betelgeuse, the star ఆహూతులు = invitees ఉదజని = Hydrogen ఉరుము = volume కణిక = nucleus కర్రి బిలం = black hole కుబ్జతార = dwarf కృష్ణ బిలం = black hole గణాంకాలు = statistics గరిమ = mass గుంపుల వాదం = Group theory గురుత్వ పతనం = gravitational collapse గురుత్వాకర్షక ఎరుపు మొగ్గు = gravitational reds

శకాంతం

చంద్రశేఖర్ జీవితంలో ఎడింగ్టన్, మిల్ని, జీన్స్, ఫౌలర్ ప్రభృతుల పాత్రలు ముగిసేయి. సా. శ. 1950 నాటికి పైన పేర్కొన్న నలుగురూ స్వర్గస్తులయారు, కాని వారి మధ్య చెలరేగిన భేదాభిప్రాయాల దుమారం వాతావరణాన్ని కలుషితం చెయ్యడం మానలేదు. ఆ శుక్రవారం, 11 జనవరి, 1935 నాడు లండన్ లోని పికడిల్లీ దగ్గర ఉన్న బర్లింగ్టన్ హవుస్ లో, రోయల్ ఎస్ట్రనామికల్ సోసైటీ వారి సమావేశం లో, జరిగిన పరాభవపు ప్రతిధ్వని చంద్రని జీవితాంతం వెంటాడింది! జేమ్స్ జీన్స్ తన అరవైతొమ్మిదవ ఏట, అనగా 1946 లో, మరణించేడు. రోయల్ సోసైటీ వారి పత్రికలో ప్రచురణార్థం మృతి సంస్మరణ రాస్తున్నప్పుడు కూడా మిల్ని పాత భేదాభిప్రాయాలని మట్టుపెట్టి మరచిపోలేకపోయాడు. “ఎడింగ్టన్ ప్రాణప్రదంగా పోషించుకుంటూ వచ్చిన ప్రామాణిక నమూనాపై జీన్స్ లేవదీసిన అభ్యంతరానికి ఎడింగ్టన్ ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పనేలేదు” అని జీన్స్ ని వెనకేసుకొస్తూన్నట్లు పైకి అనిపించినా ఆ రాతలో, ఆ సందర్

అమెరికా ప్రయాణం

చంద్రశేఖర్ పరపతి అమెరికాలో క్రమేణా పెరగడం మొదలయింది. శుక్రవారం, 11 జనవరి, 1935 నాడు - బర్లింగ్టన్ హవుస్ లో, బహిరంగ సభలో, పరాభవం జరగక ముందే - అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన హార్లో షేప్లి (Harlow Shapley) నుండి ఒక వేసవి హార్వర్డు లో గడపమంటూ ఆహ్వానం వచ్చింది. చంద్ర ఆహ్వానాన్ని అంగీకరించేడు కానీ కేంబ్రిడ్జిలో ఫెలోషిప్ డిసెంబరు 1936 వరకు ఉంది. ఇంతలో అక్టోబరు 1935 లో హార్లో షేప్లి దగ్గర నుండి మరొక ఉత్తరం వచ్చింది; హార్వర్డు లో కాస్మిక్ భౌతిక శాస్త్రంలో మూడు నెలలపాటు ఉపన్యాసకుడిగా నియామకం అని నిర్ధారిస్తూ జీతం వగైరాలు ఉన్నాయి ఆ ఉత్తరంలో. కేంబ్రిడ్జిలో నవంబరు 29, 1935 న బయలుదేరి లివర్పూల్ వెళ్లి, మరునాడు White Star Brittannica అనే పడవ ఎక్కి డిసెంబరు 8, 1935 ఆదివారం, మధ్యాహ్నం అయేసరికి బోస్టన్ చేరుకున్నాడు. హార్లో షేప్లి స్వయంగా రేవుకి వచ్చి చంద్రని అమెరికా ఆహ్వ

నిస్పృహ

జనవరి 12, 1935. సమయం ఉదయం. మంచం మీద నుండి లేచిన చంద్రశేఖర్ కి మరో ప్రపంచం ఎదురయింది. ఒక్క రోజులోఎంత తేడా? నిన్న ఉరకలు వేస్తున్న ఉత్సాహం! నేడు నిస్సత్తువ! నిస్తేజం! నీరసం! నిన్న గాలిలోకట్టుకున్న మేడలన్నీ నేడు నేల పాలయ్యాయి. మరీ ఎక్కువ ఆశించేడేమో? తను భారతీయుడు. నల్లటివాడు. ఇంగ్లీషు వాళ్ళ దృష్టిలో నాసిరకం వాడు. పైగా అనుభవం లేని వాడు. వయస్సులో చిన్నవాడు. వాళ్ళ సరసన నిలబడడానికి తనకి అర్హత లేదేమో! కాకపోతే ఎడింగ్టన్ చేసిన పరాభవానికి కారణం? ఎడింగ్టన్ నోటి దురుసు మనిషి అన్న విషయం చంద్రకి తెలుసు. సర్ జేమ్స్ జీన్స్ తో దురుసుగా మాట్లాడ్డం తాను స్వయంగా చూసేడు. మిల్ని కి లెక్కలు రావని వెటకారం చెయ్యడం తాను స్వయంగా చూసేడు. కాని గత రోజు అతను చంద్రని పరాభవించిన పద్ధతిలో వెటకారంతో పాటు విషం ఉంది. ఎంతో ఉక్రోషంతో నిండిన ఆ పెద్దమనిషి వాదన సారాంశం ఏమిటంటే, “ప్రకృతిలో సాపేక్ష శిధిలత్వం అనే భావానికి తావు లేదు.”

పండితానామ్ అనేకత్వమ్

పండితులలో ఏకీభావం కుదరడం కష్టం. విశ్వవిద్యాలయాల్లో పని చేసే ఆచార్యులలో ఈ భేదభావం తరచు కనిపిస్తూ ఉంటుంది. పైనున్నవాడు చెప్పేడు కదా అని తందానా అంటే అది సృజనకి దోహదం చెయ్యదు. ఈ భేదభావ ప్రదర్శనకి కేంబ్రిడ్జి సైతం అతీతం కాదు. అక్కడ పని చేసే ఆచార్యులు కూడా మనుష్యులే కదా! వాళ్ళకీ చీము, నెత్తురు ఉన్నాయి కదా! వాళ్ళకి ఆత్మాభిమానాలు, పట్టుదలలు ఉంటాయి కదా! తను సాధించిన ఫలితం - అనగా, శ్వేత కుబ్జతారల గరిమకి ఒక అవధి ఉంది అనే ఫలితం - గురించి ఎవ్వరూ పట్టించుకోకుండా, అందరూ గూడుపుఠాణి చేసినట్లు విస్మరిస్తున్నారంటే దానికి విద్వద్విషయానికి సంబంధించని మరొక కారణం ఏదో ఉందని చంద్రకి అనుమానం పట్టుకుంది. ఈ విషమ పరిస్థితిలో చంద్రకి ఒకే ఒక మార్గం కనిపించింది: తన ఫలితాన్ని మిల్నీ ఫలితంతో కలిపి, రంగరించి, గిలకరించి, చిట్టచివరికి అన్ని నక్షత్రాలు చరమదశలో కఠిన శిలలా తయారవుతాయని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే అప్పుడు ఎడింగ్ట

కేంబ్రిడ్జి

భారత దేశం వదలి పెట్టి ఇంగ్లండు వెళ్ళడానికి పడవ ప్రయాణం చేసే వేళకి చంద్రశేఖర్ అఘమేఘాలలో ఉన్నాడు! పడవ ముందుకి కదులుతోంది, బొంబాయి నగరం వెనక్కి వెళుతోంది. ఆ సమయంలో చంద్రశేఖర్ మనస్సు డోలాయమానంగా ముందుకి, వెనక్కి ఉగిసలాడుతూ ఉండి ఉంటుంది. గత పందొమ్మిది సంవత్సరాలు బంగారు రోజులు! ఏ విధంగా చూసినా అవి మరుపురాని రోజులు. పందొమ్మిదేళ్ళ వయస్సుకే విశ్వవిద్యాలయంలో ఆనర్స్ డిగ్రీ వచ్చేసింది! అప్పటికే ఐదు పరిశోధనా పత్రాలు ప్రచురించేడు - ప్రతిష్టాత్మకమైన పత్రికలలో! విశ్వవిఖ్యాతి చెందిన ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలతో - హైజెన్బర్గ్, సోమర్ఫెల్డ్ లతో - పరిచయం అయింది. భారత దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న రామన్, సహా - ఇద్దరూ - తన మీద ఎన్నోఆశలు పెట్టుకున్నామని సందేశాలు పంపేరు. “ఏ కోణం నుండి చూసినా ఈ యువకుడు దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు.” అని రామన్ కీర్తించేడు. ఇంగ్లండు నుండి తిరిగి రాగానే ప్రెసిడెన్సీ కాలే

ఫౌలర్

రాల్ఫ్ ఫౌలర్ (17 జనవరి 1889 - 28 జూలై 1944) చాలా పెద్ద మనిషి. మనిషి భారీగా ఉంటాడు. ఆజానుబాహువు అనొచ్చేమో. నక్షత్ర భౌతిక శాస్త్రవేత్తలలో గుళిక వాదం బాగా జీర్ణం చేసుకున్న బహు కొద్దిమందిలో ఇతను ప్రథముడు. వీటికి తోడు మనిషి స్నేహశీలి. సామంతుల కుటుంబంలో 17 జనవరి, 1889 లో పుట్టేడు. పుట్టినప్పటినుండి “పనికొస్తాడు” అనే పేరు తెచ్చుకున్నాడు. ఆటలలో దిట్ట. క్రికెట్, ర గ్బీ, గాల్ఫ్ మొదలైన ఆటలు ఆడడంలో మంచి ప్రావీణ్యం ప్రదర్శించేవాడు. చీట్లపేకతో బ్రిడ్జ్ అద్భుతంగా ఆడే వాడు. అందరితోటి కలుపుగోలుగా ఉండి, మనస్ఫూర్తిగా, నిండుగా నవ్వుతూ పలకరించేవాడు. ఇతని స్నేహాబృందం కూడా పెద్దది - అంటే, ప్రతిష్టాత్మకమైన పెద్ద వారితో, ఎంతో మందితో, పరిచయం ఉన్న వ్యక్తి. చెణుకు లాంటి పాల్ డిరాక్ ఇతని విద్యార్ధి. డిరాక్ కి గుళిక వాదాన్ని పరిచయం చేసినది రాల్ఫ్ ఫౌలర్! గుళిక వాదంలో మహామహోపాధ్యాయులన దగ్గ నీల్స్ బోర్ ని, హైజెన్బర

తారలలో వర్గ భేదాలు

పందొమ్మిదవ శతాబ్దపు ఆఖరి రోజుల్లో ఈ విశ్వం అంతా రకరకాల కాంతి కిరణములతో నిండి ఉందని అర్థం అయింది. వీటిల్లో కొన్ని మానవుల కంటికి కనబడే (దృశ్య లేదా గోచర) కాంతులు (visible light) అయితే కొన్ని మన కంటికి కనబడని (అదృశ్య లేదా అగోచర) కాంతులు (invisible light). ఈ కాంతులన్నిటిని కలగలిపి “విద్యుదయస్కాంత తరంగాలు” (electromagnetic waves) అని కానీ, విద్యుదయస్కాంత వికీర్ణము (electromagnetic radiation) అని కానీ అంటారు. ఈ తరంగాలలో ఎక్కువ “పొడుగు” ఉన్న వాటిని రేడియో తరంగాలు అంటారు; వీటి శిఖ నుండి శిఖ దూరం, “పొడుగు”, కొద్ది మీటర్లు ఉండొచ్చు. ఈ విద్యుదయస్కాంత తరంగాలులో తక్కువ పొడుగు ఉన్న వాటికి, పొడుగుని బట్టి, కొన్ని పేర్లు: అత్యూద కిరణాలు, ఎక్స్-కిరణాలు, గామా కిరణాలు. (శిఖ నుండి శిఖ దూరం ఎక్కువ ఉంటే తరంగం అనిన్నీ, తక్కువ ఉంటే కిరణం అనిన్నీ అనడం సంప్రదాయం అయిపోయింది.) పరారుణ (infra red) కిరణాలకి, అత్యూద (ultr

ఎడింగ్టన్

“పద్యానికి వర్గమూలం ఎలా తియ్యలేమో అలాగే మానవుల వ్యక్తిత్వాలని సంకేతాలతో కొలవలేము.” - సర్ ఆర్థర్ స్టేన్లీ ఎడింగ్టన్ ఛాయాచిత్రం చూస్తే కను,ముక్కు తీరు ఎలా ఉందో తెలుస్తుంది, బుద్ధులు తెలియవు కదా? ఎడింగ్టన్ ఫోటో చూసినప్పుడు బింకంగా ఉన్న అతని ముఖ భంగిమ, గంభీరమైన కళ్ళు, సన్నటి పొడుగాటి ముక్కు, చిరునవ్వుకు నోచుకోని సన్నని పెదవులు కనిపిస్తాయి. చూడగానే పిదప కాలపు నూటన్ ఇతనేనేమో అనిపించేలా ఉంటాడు. ఎదుటివారి స్థానాన్ని బట్టి, స్థితిని బట్టి విలువనిచ్చేవారు ఎక్కువ, కానీ ఎదుటివారి శీలాన్ని, వ్యక్తిత్వాన్ని చూసి విలువనిచ్చేవారు తక్కువ. గుడిలో శివలింగం మీదకి పాము వస్తే దానికి దండం పెట్టి పూజ చేస్తారు - అది విషసర్పం అని తెలిసినా, మరొక సందర్భంలో కాటేస్తుందని తెలిసినా. ఎడింగ్టన్ శీలాన్ని, వ్యక్తిత్వాన్నీ అంచనా వెయ్యడానికి ఎక్కువ శ్రమ పడక్కరలేదు. ఎడింగ్టన్ ని మొదటిసారి చూసినప్పుడు చంద్రశేఖర్ మనస్సులో మె