విశ్వామిత్ర 2015 – నవల ( 22 వ భాగము )
-ఎస్ ఎస్ వి రమణారావు
విశాఖపట్టణం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,వచ్చీపోయే ప్రయాణీకులతో రద్దీగానే ఉంది.ఎయిర్ ట్రావెలర్స్, ఇండియా మొత్తంలో ఏపిలోనే అధికంగా ఉన్నారని వచ్చిన న్యూస్ సర్వే నిజమే అని ధృవీకరిస్తున్నాట్టున్నారు జనం. సమయం ఉదయం పదకొండు గంటలైంది. ఎయిర్ పోర్ట్ కారిడార్ ని ఆనుకుని ఉన్న ఇన్నర్ రోడ్ ఒకటుంది.విఐపి కార్లు, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ కారులు మాత్రమే అక్కడ పార్క్ చేసుకునే అవకాశం ఉంది.ఆరోడ్డులోకి పొలీస్ రక్షక్ వేన్ లు నాలుగు, ఫ్యాక్షనిష్ట్ సినిమాల్లో సుమోల్లాగా దూసుకు వచ్చాయి.అందులోంచి చక చక క్రమబద్ధమైన బూట్ల చప్పుడుతో దిగారు పోలీసులు.సరిగ్గా ఏడు నిమిషాల్లోఎయిర్ పోర్ట్ అంతా సరౌండ్ చేసేశారు.అన్నివేన్ లకి ముందున్న కారులోంచి ఫ్యాక్షన్ లీడర్ లాగా దిగాడు జగదీష్.అతడి మొహం వెలిగిపోతోంది.అందుకు కారణం ఉంది.అమెరికానుంచి వయా ఢిల్లీనుంచి వస్తున్న విశ్వామిత్రని అరెస్ట్ చేసి దారిలోనే కాల్చి చంపేయమని