కథా భారతి

అసలుది తప్ప!!

కథా భారతి
- సముద్రాల హరిక్రృష్ణ "ఎండను పడి వచ్చారు ఏం తీసుకుంటారు?!" "అబ్బే, ఏమీ వద్దండీ, అది ఇచ్చేస్తే,తీసుకెళ్దామనీ....." "మజ్జిగ పుచ్చుకుంటారా!అయినా, పేరుకె కానీ,ఏం మజ్జిగ లేండి,తెల్లటి నీళ్ళు తప్ప...." "సరిగ్గా చెప్పారు,ఒక్క వస్తువు ససిగ ఉండట్లేదు పాలు బాగుంటే కద మజ్జిగ రుచి సంగతి..". "బుర్రలో మాట అందిపుచ్చుకున్నట్టు చెప్పారు.దాణా బాగుంటే కాదుటండీ పాడి ,అదీ వదలట్లేదుగా మహానుభావులు!" "అవు న్నిజమేనండీ,సామాన్య జనం మనం ఏం చేయకల్గుతాం,... మరి అది కాస్తా ఇప్పిస్తే...." "ఏం సామాన్యమో ఏం జనమో, చురుకు లేదు ఒక్క శాల్తీలో, నిలదీసి అడిగి,కడిగి పారేయద్దండీ, వెధవ పిరికితనం కాకపోతేనూ!!మనిషన్నాక ఆ మాత్రం ఖలేజా ఉండద్దూ!" "ఎట్లా ఉంటుందండీ ఖలేజా?!వాళ్ళా- డబ్బు, దస్కమ్; మందీ మార్బలం ఉన్నవారు,జనం దగ్గర ఏముంది? రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాయె!" "అదిగొ, ఈ చేతకాని మాటలే నాకు నచ్చవు.మన

పనికిరాని ‘ఘటం’

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి (Leo Tolstoy రచించిన 'Alyosha the pot' కథకు అనువాదం)   “హేయ్ అల్యోషా ఆగాగు,” పిలుపు విని వెనక్కి చూసాడు అల్యోషా. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన స్కూల్లో కలిసిన తన ఈడు స్నేహితులే పిలుస్తున్నారు చెయ్యెత్తి. వాళ్ళు తన దగ్గిరకొచ్చేదాకా ఆగి నవ్వుతూ పలకరించాడు అల్యోషా అందర్నీ. “ఏవిరా, ఇంకా మీ అమ్మ కుండలో పాలూ, పెరుగు ఎవరికైనా ఇచ్చి రమ్మంటే వాటిని విరక్కొడుతూనే ఉన్నావా? ఇప్పటికి ఎన్ని బద్దలు కొట్టావేంటి?” అందరూ కలిసి నడుస్తూంటే ఓ కుర్రాడు అడిగాడు. ఈ ప్రశ్న విని నవ్వుతూ చెప్పేడు అల్యోషా, “ఆ మధ్యన ఇచ్చిన కుండ ఒక్కటే కదా చేతిలోంచి జారిపోయి బద్దలైంది? ఆ తర్వాత అమ్మ నాచేతికి ఏ గిన్నే, కుండా ఇవ్వనని చెప్పేసింది.” “అందుకేరా నువ్వు పనికిరాని ఘటానివి,” రెండో స్నేహితుడు అనేసరికి అందరూ నవ్వు కలిపేరు. తనని ఏడిపిస్తున్నారని తెలిసినా అల్యోషా కూడా నవ్వేడు అందరితో కలిసి.

కృష్ణుడి నవ్వు

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి యుధిష్టిరుడు పంపిన ఆహ్వానం చూసి కృష్ణుడు ఉద్ధవుణ్ణి అడిగేడు, “చూసావు కదా, మొన్నటికి మొన్ననే రాజ ప్రతినిధులు వచ్చి జరాసంధుడు చెరలో పెట్టిన రాజులని విడిపించమన్నారు. ఇప్పుడే యుధిష్టిరుడి నుంచి ఈ రాజసూయానికి ఆహ్వానం. మనం ఏం చేస్తే బాగుంటుంది?” “జరాసంధుడు మనచేతిలో చావడనేది నీకు తెల్సిందే. తనకి తగ్గ వీరుడితో ద్వంద్వ యుద్ధంలో తప్ప ఆయన చావడు. రాజసూయానికి ఎలాగా మిగతా రాజులని ధర్మజుడు జయించాలి. జరాసంధుడు బతికి ఉండగా అది అసంభవం. పాండవులలో భీముడొక్కడే జరాసంధుణ్ణి చంపగలవాడు. అలా భీముడితో జరాసంధుణ్ణి అంతం చేయించి రాజసూయం చేయించావంటే రెండు పనులూ ఒకేసారి అయిపోతాయి,” ఉద్ధవుడు చెప్పాడు. మంచి సలహా ఇచ్చిన ఉద్ధవుడి భుజం తట్టి అక్కడే వేచి చూస్తూన్న పాండవదూతతో చెప్పాడు మురారి, “నేను బయల్దేరి వస్తున్నాననీ దగ్గిరుండి రాజసూయం చేయిస్తాననీ ధర్మజుడితో చెప్పు.” రాజసూయానికి బయల్దేరే కృష్ణుడ

నిశ్శబ్ద ఘోష

కథా భారతి
-G.S.S. కళ్యాణి "ఒరేయ్ శంకరం! నాకు 'క్షేమంకరి' సంస్థలో ఉద్యోగం వచ్చిందిరా! వాళ్ళు నెలనెలా నాకు బోలెడు జీతం ఇస్తారట! నిన్ను నేనిక రాజాలా చూసుకుంటానురా! నీకు కావలసినవన్నీ కొనిపెడతా! నిన్ను బాగా చదివిస్తాను కూడా!", అంటూ తన పదేళ్ల మనవడు శంకరాన్ని ముద్దు పెట్టుకున్నాడు ధర్మయ్య. "తాతా! మరి రేపటినుండి మన పొలంలో పనులెవరు చేస్తారూ??", అమాయకంగా అడిగాడు శంకరం. "నాకు ఇప్పుడు వ్యవసాయం చేసేందుకు ఓపిక సరిపోవట్లేదురా! అందుకే వ్యవసాయం వదిలి ఉద్యోగంలో చేరిపోయాను! ఆ పొలంలో కొంత భాగంలో మనం పెద్ద ఇల్లు కట్టుకుందాం. మిగతాది నువ్వు ఆడుకునేందుకు ఉయ్యాల, జారుడుబండాలాంటి ఆటవస్తువులతో నింపేద్దాం! సరేనా?", శంకరం కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ అడిగాడు ధర్మయ్య. "ఆయ్! భలే! భలే! అప్పుడు నేను రోజంతా ఎంచక్కా ఆడుకోవచ్చు!", ఆనందంతో చప్పట్లు చరుస్తూ అన్నాడు శంకరం. "నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలిరా!", అంటూ శంకరాన్ని గట్టి

తీన్ దేవియా

కథా భారతి
-రచన: కోసూరి ఉమాభారతి జూబిలీహిల్స్ చెక్-పోస్ట్ మీదగా కారు సికింద్రాబాద్ వైపు సాగిపోతుంది. ‘తాతాచారి కాంపౌండ్’ చేరేందుకు గంటకి పైగానే పడుతుంది. వెనక్కి జారిగిల పడి కళ్ళు మూసుకున్నాను. ‘తాతాచారి కాంపౌండ్’తో నాకున్న అనుబంధం ఎక్కువే. మొట్టమొదటిసారి ఆ కాంప్లెక్స్ లో అడుగుపెట్టిన వైనం గుర్తొచ్చి నాలో ఎన్నోభావాలు మెదిలాయి. దాదాపు పాతికేళ్ళ క్రితం మాట... ‘సౌత్ సెంట్రల్ రైల్వేస్’ కి పనిచేసే నాన్నగారి బదిలీ వల్ల... అప్పట్లో మద్రాసు నుండి సికింద్రాబాద్ వచ్చాము. సికింద్రాబాద్ లోని ‘సెయింట్ ఫ్రాన్సిస్ జునియర్ కాలేజీ’లో చేరాను. ఊరు, పరిసరాలు, కాలేజీ వాతావరణం కూడా కొత్త. నాన్నగారి బదిలీల వల్ల నాకు కలిగే ఏకైక ఇబ్బంది..ఇదే. ఇలా ఊరు మారిన ప్రతీసారి ఉన్న స్నేహితులని కోల్పవడమే. ఇక కొత్త పరిచయాలకి, స్నేహాలకి సమయం పడుతుందిగా. పెద్దదూరం కాకపోవడంతో నాలుగు రోజులుగా కాలేజీకి నడిచే వెళ్ళొస్తున్నాను. ఐదో రోజ

వ్యత్యాసం

కథా భారతి
-G. శ్రీ శేష కళ్యాణి. ఇండియాలో మన తెలుగు సంప్రదాయాల మధ్య నోములూ, వ్రతాలూ, పూజలూ చేస్తూ పెరిగిన కాత్యాయనికి అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్న గిరీష్ తో వివాహం జరిగింది. పెళ్ళైన మూడోరోజు, కాత్యాయనిని తీసుకుని అమెరికాకు వచ్చాడు గిరీష్. ఇండియాలో ట్రాఫిక్-జాంలతో నిరంతరం రద్దీగా ఉండే రోడ్లను చూసిన కళ్ళతో విశాలమైన ‘ఫ్రీ-వే’ను చూసి ఆశ్చర్యపోయింది కాత్యాయని! కారు ఎక్కి కూర్చున్న కాసేపటికే ఇల్లు చేరేసరికి, "ఏంటండీ ఆ స్పీడూ?! గంటకు అరవై మైళ్ళ వేగంతో వెళ్లకపోతే కారును కాస్త మెల్లిగా నడపచ్చుగా?", గిరీష్ తో అంది కాత్యాయని. "చూడు కాత్యాయనీ! ఫ్రీ-వే పైన స్పీడ్-లిమిట్ కన్నా తక్కువగా కారు నడపటం ప్రమాదకరం! అలాచేస్తే మనల్ని పోలీసు ఆపి మనకు టికెట్ ఇచ్చే అవకాశముంది!! తెలుసా?", అన్నాడు గిరీష్. "టికెట్ అంటే?", అమాయకంగా అడిగింది కాత్యాయని. "అంటే జరిమానా విధిస్తాడన్నమాట!", చెప్పాడు గిరీష్. "ఆమ్మో! ఈ దేశంలో కా

ఊపిరి

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి ఒకనొక రాజ్యంలో ధర్మరాజనే ఆయన రాజయ్యాడు కొత్తగా. ఈయన రాజయ్యేసరికి అనేక కష్టాలలో ఉంది రాజ్యం. హత్యలూ, మరణాలూ, మానభంగాలూ జరుగుతున్నా అడ్డుకునే నాధుడు లేడు. ఎవరిష్టానుసారం వాళ్ళు పనులు చేయడం జరుగుతోంది. వ్యాపారస్తులు డబ్బులు గుంజుతున్నా రోగాలు వస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. ఇదంతా చూసి విసుగొచ్చిన ధర్మరాజు ఓ నిర్ణయానికొచ్చాడు; మంత్రులతో ఒక పాటు ఒక వారం కూలంకషంగా అంతా చర్చించాక. దేశంలో మళ్ళీ ధర్మం రావాలంటే చేతికి చేయి, కన్నుకి కన్నూ, లాభానికి లాభం, నష్టానికి నష్టం అనే సూత్రం అనుసరించి తీరవల్సిందే. దీనిప్రకారం ఎవరైనా కొంతమంది కల్సి ఒక మహిళని మానభంగం చేస్తే ఆ చేసినవాళ్లని నగరం నడిబొడ్డున అందరిముందూ మానభంగం చేసి తీరుతారు వాళ్ళకి రోగం వదిలేదాకా. అలాగే ఎవరైనా మోసం చేస్తే అదే మోసం తిరిగి చేయాలి వాళ్లకి. వైద్యులెవరైనా కావాలని చెత్త వైద్యం చేసి రోగి కన్ను పోగొడితే, వైద్యుడి కన్ను పొడ

పత్రం..పుష్పం..

కథా భారతి
-శ్రీధర్ రెడ్డిబిల్లా (శాక్రమెంటో తెలుగు అసోసియేషన్ కథల పోటీ -2021 లో బహుమతి పొందిన కథ) “యాకుందేంతు తుషార హార..” అంటూ మొదలెట్టిన సర్వస్వతీ స్తోత్రం ముగియగానే పిల్లలందరి నోటా ఒకటే కేరింత. గురుకులానికి ఈసారి సంక్రాంతి పండుగకు కూడా పదిహేను రోజులు సెలవులివ్వటంతో అందరూ ఇళ్లకు వెళ్లే రోజు అది. అందరి నాన్నలు వచ్చి తమ తమ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. నాన్న ఇంకా రావట్లేదేంది అనుకుంటూ మాటిమాటికీ గుట్ట పక్కనున్న వంక దారివైపు చూస్తున్నాడు శ్రీను. ఆరెపల్లి అడ్డరోడ్డు దగ్గర బస్సు దిగి ఎడమ వైపున్న మట్టిరోడ్డు మీద ఐదు కిలోమీటర్లు వస్తే చుట్టూ గుట్టలు, చిన్నపాటి అడవి మధ్య విశాల మైదానంతో ఉంటుందా గురుకులం. వాళ్ళ ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతుండటంతో శ్రీనును వాళ్ళ నాన్న ఆరవ తరగతిలోనే గురుకులంలో వేశాడు. ఇప్పుడు శ్రీను పదవ తరగతి. గత ఐదేళ్ల నుంచి అదే గురుకులంలోనే చదువుతు

పందిరి నీడ

కథా భారతి
- వదలి రాధాకృష్ణ ‘తాతయ్యా! మనకు గుడి ఎంత దూరం! ఈ రోజు కోటిసోమవారం కదా గుడికి వెళ్ళి దర్శనం చేసుకు వద్దామని.’ భానుమూర్తి మాట్లాడలేదు. ‘అదే తాతయ్యా! శివయ్య గుడి అయితే మరీ మంచిది.’ ‘ఇవన్నీ ఎవరు చెప్పారే నీకు. అసలు మీ ఊరిలో శివాలయం ఉన్నదా!’ ‘లేకేమి. కాకపోతే మాకు ఓ పది కిలోమీటర్లు దూరం ఉంటుంది. డాడీ ప్రతిసారీ కార్లో తీసుకెళతారు. ‘మీ డాడీకి నిన్ను కారులో గుడికి తీసుకెళ్లే అంత తీరిక ఉందా’ ‘ఉండకపోవడమేమిటి. తీసుకెళ్లకపోతే ఈ సంగీత ఊరుకుంటుందా ఏమిటి!’ అయినా ఎందుకలా అడుగుతున్నావ్. ‘లేదమ్మాయ్! ఐదు సంవత్సరాలు గడిచిపోయినా స్వంతదేశానికి వచ్చే తీరిక లేని మీ డాడీకి నిన్ను పది కిలోమీటర్లు తీసుకెళ్లే తీరిక దొరుకుతోందా అని.’ ‘దట్స్ ఐయామ్ సంగీత’ గలగలా నవ్వేసింది. భానుమూర్తి మాట్లాడలేదు. ‘సర్లే చెప్పు తాతయ్యా! ఈ కోటిసోమవారం రోజున శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి రావాలని!!’ ‘ఈ ఊరిలో శివాలయం లేదు. మన ప

ఊరేగింపు

కథా భారతి
-G.S.S. కళ్యాణి. అది సీతారామపాలెం అనే కుగ్రామం. సాయంత్రంవేళ ఇరుగు పొరుగు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎనభైయేళ్ల దేవమ్మ తమ ఇంటి అరుగుపైన కూర్చుని వారి మాటలను ఆసక్తిగా వింటోంది. "ఇది విన్నావా సుభద్రా? మన ఊరి చివర కొండపైనున్న రాములవారి గుడిలో ఈ ఏడు శ్రీ రామనవమి ఉత్సవం ఘనంగా చేస్తున్నారట! ", సుభద్రతో అంది విమల. "ఎందుకు వినలేదూ? రేపు మొదలుపెట్టి మూడు రోజులు వరుసగా ఉత్సవాలు చేస్తున్నారటగా! మూడోరోజు రాములవారిని, సీతమ్మను మన ఊళ్లోని అన్ని వీధులలో ఊరేగిస్తారుట కూడా!", అంది సుభద్ర. "అయితే సుభద్రా! మన వీధికి కూడా రాముడు వస్తాడా?", కుతూహలంగా అడిగింది దేవమ్మ. "ఓ! వస్తాడట అవ్వా! మన ఊళ్లోని అన్ని వీధులూ రాములవారిని తిప్పుతారట! ", దేవమ్మకు చెప్పింది సుభద్ర. ఆ మాట విన్న దేవమ్మ మనసు ఒక్కసారిగా ఆనందంతో పులకించిపోవడంతో ఆమె భక్తిగా రాముడిని తన మనసులో స్మరించుకుంటూ చేతులు జోడించి నమస్కరించుకుంది.