నిధి చాల సుఖమా
-ఆర్. శర్మ దంతుర్తి
ఆ రోజుకి చేయాల్సిన పనంతా అయిపోయాక తనకిచ్చిన వేరే గదిలోకి పోయి పడుకోబోయే ఇల్యాస్ ని పిలిచేడు మహమ్మద్ షా, "రేపు మనింటికి ఓ ముల్లా గారూ, ఆయన స్నేహితులూ మరో కొంతమంది చుట్టాలూ వస్తున్నారు. ఓ మేకని కొట్టి వాళ్లకి విందు చేయాలి. నువ్వు చేయగలవా?"
"సరే, రేపు సాయంత్రానికి కదా?" అదెంత పని అన్నట్టూ చెప్పేడు ఇల్యాస్.
"నీకు వయసు వల్ల కష్టం అవుతుందేమో అని అడిగాను అంతే. కష్టం అయితే వేరే వాళ్ళకి చెప్తాను ఈ పని."
"అబ్బే ఏవీ కష్టం లేదు. నేను దగ్గిరుండి చూస్తాను."
"మంచిది. మీ ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది కదా?"
"లక్షణం గా ఉంది. ఇక్కడికొచ్చి మీ ఇంట్లో పనిలో జేరాకే కదా అసలు మేమిద్దరం సంతోషంగా ఉండడం మొదలైంది."
"పోనీలే, అదే చాలు కదా ఈ వయసులో?"
మర్నాడు షా గారి ఇంట్లో విందు జరుగుతూంటే ఇల్యాస్, వాళ్ళావిడా అన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షణ. వచ్చినవాళ్లకి వడ్డన, గ్లాసుల్లో వోడ్కా అవీ సర