కవితా స్రవంతి

ఎవరవయా నీవెవరవయా?

కవితా స్రవంతి
-డా.బి.బాలకృష్ణ నిలకడ నేర్వని నా నడకలకు జీవితమింకా సుదూరంగానే తోస్తున్నది నరాల దారులలో ధారలుధారలుగా ప్రవహిస్తున్న చైతన్యం తన మూలాలను వెతుక్కుంటున్నది తల్లికడుపులో, చీకటిలో, చీమూనెత్తురుల అశుద్ధంలో అణువుగానో, పరమాణువుగానో ప్రవేశించి రక్తపు బంతినై, మాంసపు ముద్దనై ఎదుగుతున్నప్పుడు ఎక్కడినుండో ఓ కదలిక నా అస్తిత్వానికి ఊపిరూలుదుతుంది మూసలో దాచబడిన ఈ జీవం తరతరలా ఆలోచనలకు తెరతీస్తుంది నేను ఎవరు? నా గమ్యమేమిటి? నా అస్తిత్వమెక్కడిది?ఇప్పుడున్న స్పృహ ఏనాటిది? ఉలి, శిలను తొలిచినట్లు ఏవేవో ప్రశ్నలు నన్ను తొలుస్తూనే ఉంటాయి సంద్రంలో ఎగసిన అల విసురుగా తీరాన్ని తాకి, వెనుతిరిగినట్టు అడుగంటిన నీటిబొట్టు ఆవిరై గాలిలో కలసినట్టు ఎందుకో పుట్టి, ఎందుకో గిట్టి ఉన్నన్నినాళ్ళు ఏదేదో వెలగబెట్టి అన్నీ నావనుకొని, అన్నింటినీ వదిలేసి రిక్త హస్తాలతో ఏ శూన్యాలకో సాగే పయనంలో ఒక్కోసారి నిన్ను గుర్తు

తావేదీ?

కవితా స్రవంతి
- పారనంది శాంత కుమారి ఏడవటమే తప్ప నవ్వటం తెలియని బాల్యంలో, కామించటమే తప్ప ప్రేమించటం తెలియని యవ్వనంలో, అపార్ధాలే తప్ప అర్ధం చేసుకోవటం తెలియని అనుభవంలో, నిలదీయటమే తప్ప నివేదించటం తెలియని వ్యక్తిత్వంలో, అణచివేయతమే తప్ప ఆదరించటం తెలియని ఆవేశంలో, ద్వేషించటమే తప్ప దీవించటం తెలియని వృద్ధాప్యంలో, తీసుకోవటమే తప్ప ఇవ్వటం తెలియని జీవితంలో, శాంతికి, కాంతికి తావేదీ?

ఎవరవయా నీవెవరవయా?

కవితా స్రవంతి
-డా.బి.బాలకృష్ణ నిలకడ నేర్వని నా నడకలకు జీవితమింకా సుదూరంగానే తోస్తున్నది నరాల దారులలో ధారలుధారలుగా ప్రవహిస్తున్న చైతన్యం తన మూలాలను వెతుక్కుంటున్నది తల్లికడుపులో, చీకటిలో, చీమూనెత్తురుల అశుద్ధంలో అణువుగానో, పరమాణువుగానో ప్రవేశించి రక్తపు బంతినై, మాంసపు ముద్దనై ఎదుగుతున్నప్పుడు ఎక్కడినుండో ఓ కదలిక నా అస్తిత్వానికి ఊపిరూలుదుతుంది మూసలో దాచబడిన ఈ జీవం తరతరలా ఆలోచనలకు తెరతీస్తుంది నేను ఎవరు? నా గమ్యమేమిటి? నా అస్తిత్వమెక్కడిది?ఇప్పుడున్న స్పృహ ఏనాటిది? ఉలి, శిలను తొలిచినట్లు ఏవేవో ప్రశ్నలు నన్ను తొలుస్తూనే ఉంటాయి సంద్రంలో ఎగసిన అల విసురుగా తీరాన్ని తాకి, వెనుతిరిగినట్టు అడుగంటిన నీటిబొట్టు ఆవిరై గాలిలో కలసినట్టు ఎందుకో పుట్టి, ఎందుకో గిట్టి ఉన్నన్నినాళ్ళు ఏదేదో వెలగబెట్టి అన్నీ నావనుకొని, అన్నింటినీ వదిలేసి రిక్త హస్తాలతో ఏ శూన్యాలకో సాగే పయనంలో ఒక్కోసారి నిన్ను గుర్తు చ

తోడు-నీడ వారికి వారే!

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు నాన్నలేని అమ్మ ఎక్కడుంది ....ఆలోచించి చూస్తే! అమ్మలేని నాన్న ఎక్కడున్నారు....అవలోకించి చూస్తే! లేచినవెంటనే మంగళసూత్రాలను కళ్ళకద్దుకొంటూ అమ్మ, అమ్మకళ్ళను సూత్రాలనుంచే చుంబిస్తూ నాన్న, తనుకలిపిన మొదటికప్పు కాఫీని అందిస్తూఅమ్మ, బెడ్ కాఫీని చిరునవ్వుతో అందుకుంటూ నాన్న! అమ్మ స్నానంచేసి వచ్చేసరికి పువ్వులు కోసిఉంచిన నాన్న, నాన్నకోసిన పువ్వులతో పూజమొదలెడుతూ అమ్మ! అమ్మ పూజముగించుకొనివచ్చి టిఫిన్ ఇచ్చేసరికి అమ్మ వంటకు కావాల్సిన కూరగాయలు కొనితెచ్చి, సమయానికి అమ్మకు అందించే నాన్న! అమ్మ అడగకుండానే పిల్లలకు కావలసినవి కొనిపెట్టమంటూ అమ్మచేతిలో డబ్బుంచిమరీ ఆఫీసు కు వెళ్ళేనాన్న! వస్తున్నప్పుడు ఏంతేవాలంటూ ప్రేమగా మధ్యలోఒకసారి అమ్మకు ఫోన్చేసే నాన్న! పిల్లల్ని అలాతిప్పివద్దాం పదండి అంటూఅమ్మ, మారు మాట్లాడకుండా,విసుక్కోకుండా, వచ్చినవెంటనే షికారుకు తీసుకొనివెళ్

పాపం! పిల్లలు

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అభం శుభం తెలియని పిల్లలను, కేర్ టేకర్స్ కు అప్పజెప్తున్నారు. దినదినగండంగా ఆ పిల్లలు, డే కేర్ సెంటర్ లో గడుపుతున్నారు. అర్ధమే తప్ప ఆత్మీయత పట్టని మనస్తత్వంతో, చదువేతప్ప సంస్కారం మనసుతలుపు తట్టని అజ్ఞానంతో ఈ కేర్ టేకర్స్, అమాయకత్వమేతప్ప వేరేదీ తెలియనిపిల్లలను, సంపాదనకోసం తల్లితండ్రులుపడే అత్యాశకి బలవటమేతప్ప వేరేమీచేయలేని బేలలను, తమదైన అజ్ఞానంతోఆడిస్తున్నారు, లాల్యాన్ని పొందాల్సిన వారిబాల్యాన్ని తమదైన నిర్లక్ష్యంతో ఓడిస్తున్నారు. బేర్ మంటూ ఈ పసిపిల్లలు పాపం కేర్ సెంటర్ లలో గడుపుతున్నారు. తల్లితండ్రుల బుద్ధిలేనితనాన్ని ఆసరాగా చేసుకొని ఈబేబీ కేర్ సెంటర్ లను నడుపుతున్నారు. ఇది మదుపులేని వ్యాపారమని, ఇది అదుపులేని వ్యవహారమని తెలిసినా, పసిపిల్లల బాల్యం నుసిఅవుతున్నా, ఎవరూ పట్టించుకోవటం లేదు, ఈ డే కేర్ సెంటర్ల ఆట కట్టించాలనుకోవటం లేదు, ఈ పసి ప

నాన్న

కవితా స్రవంతి
- అమరవాది రాజశేఖర శర్మ కంటిరెప్పగా చేనుకు కంచె లాగ ప్రేమతో నన్ను కాపాడి పెంచెనాన్న కష్టములనెన్నొ పొందినా కలత పడక కోరు కోర్కెల నన్నిటిన్ కూర్చె నాన్న లోక రీతిని సంఘపు లోతు తెలిపి మంచి వ్యవహర్తగా నన్ను మలచె నాన్న వేలుపట్టుకు నడిపించి వెంట ద్రిప్పి మంచి చెడుల వివేకము పంచె నాన్ పండుగలు సంబరాలలో మెండు ముదము నాకు నందించి నావెంట నాడె నాన్న అలుకబూనిన ననుగని పలుకరించి కొత్త బొమ్మలు వరముగా కురిసె నాన్న నేననారోగ్యమున్ గన తాను నిద్ర భోజనము మాని దేవుళ్ళ పూజ సేయు నేను రాయు పరీక్షన నేర్పు కోరి సతతముపవాస దీక్షలన్ సలుపు నాన్న

పిల్లలు-పెద్దలు

కవితా స్రవంతి
- పారనంది శాంత కుమారి విదేశాలకు వెళ్లిపోతూ విచిత్రంగా పిల్లలు, వారిబుద్ధి నెరగలేక విచారంతో పెద్దలు. రెక్కలొచ్చి అక్కడికి ఎగిరిపోయిన పిల్లలు, ముక్కలైన మనసుతో ఇక్కడే మిగిలిపోయిన పెద్దలు. కొత్త ఉద్యోగంలో అక్కడ పిల్లలు, కొత్త ఉద్వేగంతో ఇక్కడ పెద్దలు. అక్కడ సంపాదనకై ప్రాకులాడుతూ పిల్లలు, ఇక్కడ మనోవేదనతో మగ్గిపోతూ పెద్దలు. అక్కడ సంపాదించుకున్నడబ్బులతో పిల్లల జల్సాలు, ఇక్కడ ఆపాదించుకున్నజబ్బులతో పెద్దల నీరసాలు. ఇక్కడున్న పెద్దలదృష్టి తమపిల్లల పైనే, అక్కడున్న పిల్లలదృష్టి మాత్రం వాళ్ళపిల్లల పైనే. భార్యాపిల్లలే లోకం అక్కడ పిల్లలకి, పిల్లలు దూరమై శోకం ఇక్కడ పెద్దలకి. గంటలను కేష్ చేసుకుంటూ అక్కడ పిల్లలు, నిముషాలను లెక్కపెట్టుకుంటూ ఇక్కడ పెద్దలు. అక్కడ కాస్ట్లీ ఇల్లు కొనుక్కొని పిల్లలు, ఇక్కడ కాటికి కాళ్ళు చాచుకొని పెద్దలు. అక్కడ శాశ్వత నివాసంకై ఆ దేశం గ్రీన్ కార్డు కోసం పిల్లఎదురు

ఆత్మవిశ్వాసం!!

కవితా స్రవంతి
--ఎస్.ఎస్.వి.రమణరావు వందమందైనా అబద్ధం చెబుతుంటే ఎదిరించి ఒక్కడైనా నిజం చెబితే గుర్తించి వాడి పక్క నిలబడ గలవా నువ్వు? నలుగురు కలిసి పనిచేస్తే పొరపాట్లు జరిగే అవకాశం తక్కువని ఒక్కడే అంతపనీ చేస్తే పొరపాట్లు పెరిగే అవకాశం ఎక్కువని తెలుసుగా నీకు? నువ్వు చేసిన తప్పులు ఎదుటి వాడి తప్పుల్ని క్షమాదృష్టితో చూసేందుకు నువ్వు పొందిన ఓటమి ఎదుటివాడి ఓటమిని సానుభూతితో పరిశీలించేందుకు తోడ్పడుతున్నాయా? తప్పులు చేసినవాళ్ళు తప్పించుకు తిరుగుతున్నంతకాలం తప్పులు జరుగుతూనే ఉంటాయని శిక్షా భయం లేనిదే నేరాలు తగ్గవని వేరే చెప్పక్కర్లేదుగా? స్వార్థంకొద్దే కాక సమాజం కోసం ఎంత సహనం చూపించగలుగుతున్నావు నువ్వు? ఎంత సమయం ఎంత ధనం వెచ్చించగలుగుతున్నావు నువ్వు? సుఖాలకి లొంగిపోకుండా దుఃఖాలకి కృంగిపోకుండా వర్తమానంలో కనబడుతున్న దుర్భర గతాన్ని మార్చుతూ అందమైన భవిష్యత్ సౌధాన్ని పునాద

అమావాస్యలో పున్నమి

కవితా స్రవంతి
మొక్కపాటి పూర్ణిమ సుధ విజయవాడ - రేడియో మిర్చి రా..! కొన్ని క్షణాలని అరువు తెచ్చుకుందాం..! కాలంతో పాటు పరుగులు తీసే మన అహాన్ని, ఆత్మాభిమానం అనే ముసుగులో కప్పెట్టి, దర్పపు పూత పూసిన పొడి మాటలతో నెట్టుకొస్తున్నది చాలు సాధికారత - అస్థిత్వాల అన్వేషణలో మనల్ని మనం చంపుకున్న మాటల తూటాల్ని మూట కట్టి స్మార్ట్ ఫోన్లలో సమాధి చేద్దాం... ప్రైవసీ సెట్టింగుల్లోని ప్యాటర్న్ అన్లాక్ ని తెలుసుకోవాలనే అత్యుత్సాహాన్ని కాసేపు పక్కనెట్టి మన మనసుల్ని అన్లాక్ చేసే ప్యాటర్న్ కనుక్కునేందుకు ఒక్కసారైనా ప్రయత్నిద్దాం... నీలోని ఆక్రోశాన్ని, నాలోని ఆవేదనని వెళ్ళగక్కి, అహాల అద్దాలు భళ్ళున బద్దలయేదాకా మౌనాలనే బాణాలతో ఇద్దరి అస్థిత్వాన్ని చెరిపి, మన అనే సరికొత్త ప్రపంచంలోకి అడుగిడుదాం..! మహా అయితే, ఖర్చయ్యేది, కొన్ని కొన్నీళ్ళు..! కొన్ని క్షమాపణలు...!! అదీ మంచిదే..! ఎన్నాళ్ళయిందో ఆ కళ్ళని కడిగి... నీకోసం ఆ మాత్