కథా భారతి

బ్రహ్మ తేజస్సు

కథా భారతి
-అన్నపంతుల జగన్నాధ రావు (ఇది తెలంగాణలో నవాబుల కాలంలో జరిగిన యదార్ధ సంఘటనగా జనశ్రుతిలో వుంది) ఆకలి. మూడక్షరాల మాట. మనిషిని ముప్పుతిప్పలు పెట్టే మాట. జఠరాగ్నిని తట్టుకోవడం కష్టమనిపిస్తోంది నారాయణ సోమయాజికి. అన్నం తిని మూడు రోజులైంది. మూడు రోజుల కిందట సాయంకాలం తిన్న గుప్పెడు అటుకులే ఆఖరి ఆహారం. రెండురోజుల నుండీ మంచినీళ్ళ తోనే కాలం గడుపుతున్నాడు. పొద్దున్న పంటి బిగువున సంధ్యావందనం చేశాడు. అప్పటి నుంచి నిస్త్రాణగా పడుకొనే వున్నాడు మండువాలో. లేచి మంచినీళ్ళు తాగడానికి కూడా సత్తువ లేదు. కానీ కడుపులో అగ్నిహోత్రుడు వూరుకుంటాడా? బలవంతంగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు. కాసిన్ని మంచినీళ్ళు తాగడంతో కొద్దిగా ఓపికవచ్చినట్టు అనిపించింది. “అమ్మా, గంగాభవానీ, నా ప్రాణాలు నిలబెడుతున్నావా తల్లీ” అనుకున్నాడు. ఇల్లంతా కలయ జూశాడు. లంకంత యిల్లు. ఒకప్పుడు పిల్లా పాపలతో, వచ్చేపోయే బంధువులతో కళకళలాడుతూ వుండేది. తన దగ

యత్నం

కథా భారతి
- శ్రీమతి మోచర్ల రామలక్ష్మి సద్గురువులు, సాధకులు, యోగులు, త్యాగులు, పండితులు, కవులు ఎందఱో మహానుభావులు. చతుర్వేదాల సారాన్ని ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, సుభాషితాలు, నీతి శతకాలు, సూక్తులు, చాటువులు, సామెతలతో నిబిడీకృతం చేసి మానవాళి అభ్యున్నతికి అందించారు. దేవభాష అయిన సంస్కృత భాషలోని సూక్తులను, సుభాషితాలను, నేటితరం పిల్లలతో, గౌరవనీయులయిన పెద్దలతో, హితులతో, సన్నిహితులతో ముచ్చటించు కావాలనేది నా అభిలాష. సరస్వతీదేవి కృపతో కథావాటికలో సూక్తులు, సుభాషితాలు పొందుపరిచి, చిన్న కథలుగా రూపొందించి పుస్తక పాణి పద పల్లవములకు సమర్పిస్తున్నాను. సంస్కృత అధ్యాపకులు మా గురువర్యులు శ్రీమాన్ మోహనరావుగారి పాదాలకు నమస్కరిస్తూ కథ ఆరంభిస్తున్నాను. సుందరం చక్కనివాడు. చురుకు, తెలివి కలవాడు, బాగా చదువుకుని ఉత్తమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. తను ఎంతో మేధావినని, ఉద్యోగం తనని వెదుక్కుంటూ వస్తుందని అతనిని కించిత్ గర్వం ఆ

శామీల నభోగము

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి మే నెలాఖర్న రోహిణీ కార్తి ఎండలు దంచుతుంటే, తన ఆశ్రమంలో ఏ.సి. గదిలో చుట్టూ శిష్యగణం కూర్చునుండగా మీరోజు న్యూస్ పేపర్ చదువుతున్న యోగీశ్వరుడు ఒకసారి అయిదో పేజీ తిరగేసి ఓ చిన్న న్యూస్ ఐటం చదివాక యధాలాపంగా చిరునవ్వుతో ఆ పేపర్ పక్కన పారేసి ధ్యాన ముద్ర వహించాడు. కిందన నేలమీద కూర్చున్న శిష్యులు వెంట వెంటనే తమలో తాము మాట్లాడుకోవడం ఆపి సర్దుకుని కూర్చున్నారు గురూగారితో పాటు ధ్యానానికి. కంగారుగా గురువుగారి అంతర్గత శిష్యులు ఆయన పక్కన పారేసిన పేపరూ, అవీ తీసి బయటపారేసి చుట్టూ శుభ్రం చేసారు ధ్యానం చేసుకునే గదిలో. పావుగంట మౌనంగా గడిచేక ఇంకా అందరూ ధ్యానంలో ఉండగానే గురువుగారి గంభీరమైన కంఠం వినిపించింది, “వచ్చేనెల నాలుగో తారీఖునుంచి ఆరో తారీఖులోపు మన హైద్రాబాద్, చుట్టుపక్కల ఊళ్ళలో శామీల నభోగం రాబోతోంది. అది నా అంతర్గత శిష్యులకే కాక మొత్తం అందరిమీదా విస్తరించబోతోంది. అదృష్ఠవంతులైన వాళ్ళు

కొడుకు స్థిరపడితే!

కథా భారతి
“హలో!” “హలో! నేను బ్యాంకు మేనేజర్ ను మాట్లాడుతున్నాను, సుధీర్ గారా! మాట్లాడేది?” “నమస్తే సార్! నేను సుధీర్ నే మాట్లాడుతున్నా!” “మీరోసారి బ్రాంచ్ కు రాగలరా?” “అలాగే సార్! మరో అరగంటలో వస్తాను.” ఫోన్ పెట్టేసాడు మేనేజర్. ఈ మధ్యనే బ్రాంచ్ కు కొత్త మేనేజర్ వచ్చారు. నాకు కొత్త మేనేజర్ తో పరిచయం లేదు. కానీ వారు నన్ను ఎందుకు రమ్మన్నారో అర్థం కాక ఆలోచనలో పడిపోయా. మా నాన్న గారు రంగస్వామి గారు, మా ఊరి మాజీ సర్పంచ్. రెండు సంవత్సరాల క్రిందట ప్రమాదంలో చనిపోయారు. నాకు చదువు అబ్బక పోవడంతో ఆరేళ్ళ క్రితం నాలుగు లక్షల పెట్టుబడితో ఎలక్ట్రికల్ షాప్ పెట్టించారు. దేవుడి దయవల్ల, మా నాన్నగారి ఆశీస్సుల వల్ల అంతా బాగానే నడుస్తోంది. వ్యాపారం బాగా నడవడంతో బ్యాంకు వాళ్ళు కూడా పిలచి మరీ లోను ఇచ్చారు. రీపేమెంట్ కూడా బాగానే కడుతున్నాను. కానీ ఇప్పుడు బ్యాంకు మేనేజర్ ఎందుకు పిలిచారో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.

ట్రాఫిక్ టికెట్

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి తీరుబడిగా వేసవి శెలవులకి ఓహైయో నుంచి న్యూయార్క్ న్యూజెర్సీ అన్నీ చూడ్డానికి బుధవారం సకుటుంబంగా బయల్దేరిన శంకర్రావుకి శనివారం వచ్చేసరికి ఒక్కసారి నీరసం ఆవహించింది, మళ్ళీ సోమవారం నుంచీ పనిలోకి వెళ్ళాలంటే. ఓ సారి తల తాకట్టు పెట్టాక ఎలాగా కుదరదు కనక శుక్రవారం రాత్రే హోటల్ ఖాళీ చేసి రాత్రి కొలంబస్ వెళ్ళిపోతే మరో రెండు రాత్రులు తీరిగ్గా పడుకుని సోమవారం పన్లోకి పోవచ్చు. ఇదీ సరిగ్గా వేసుకున్నప్లాను. అయితే క్వీన్ విక్టోరియా, యువరాజా, రాణీల వారికి తండ్రి కున్నంత కంగారు లేదు అప్పుడే ఇంటికెళ్ళిపోవడానికి. వెకేషన్ లో వాళ్ళకి కావాల్సిన ఆనందం వాళ్ళు పిండుకున్నాక కారెక్కి బజ్జుంటారు. శంకర్రావుకు డ్రైవింగ్ ఎలాగా తప్పదు. అర్ధరాత్రీ, అపరాత్రీ ఏక్సిడెంట్ లేకుండా వెళ్ళాలంటే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నిద్రపోకుండా. పోనీ తనకి నిద్ర రాకుండా కబుర్లు చెప్తారా అంటే వాళ్ళందరూ బాగా అలిసిపోయి నిద్రలో

సెకండ్ పెన్ష్జన్!

కథా భారతి
-కుంతి (కౌండిన్య తిలక్ ) సెల్ మ్రోగింది. "హలో! ఆనంద్ బిజీగా ఉన్నావా" స్టేట్ బ్యాంక్ అశోక్ నగర్ లో పనిచేస్తున్న ముకుందరావు నుండి ఫోన్. "లేదు చెప్పు" మారెడ్ పల్లి బ్రాంచ్ లో పని చేస్తున్నఆనందరావు ఫోన్ రిసీవ్ చేస్తూ అన్నాడు. "ఒక న్యూస్.మన రామానుజము సార్ కు వారము రోకుల క్రిందట పెద్ద యాక్శిడెంట్ అయిందట్. సికింద్రాబాద్ లోని ఆత్మీయ హాస్పిటల్ లో ఉన్నాడట .సాయంత్రము ఆరు గంటలకు వెళదామనుకుంటున్నాను.నీవు వస్తావా?" "అరెరె! ఎలా జరిగింది" "ఒక వికలాంగుడినిరోడ్డుదాటించబోయాడట. ఇంతలో ఒక కార్ ర్యాష్ గా వచ్చి సారును బలంగా ఢీకొట్టిందట. ఆ వికలాంగుడికి పెద్దగా దెబ్బలు తగల్లేదట.కానీపాపము సార్ కే బాగా గాయాలయ్యాయట. చాలా రక్తము పోయిందట" "తప్పకుండా వస్తాను" ,ఫోన్ పెట్టేసి,రామానుజముగారితో అతడికున్న అనుబంధము గుర్తుకు రాగా ,అతడికి వచ్చిన ఆపద తలుచుకొని మరింత బాధపడుతూ కూర్చుండిపోయాడు ఆనందరావు. శ్రీ రామానుజము స్టేట్

పాకీ వాడు

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి ఓహైయో, కేస్ వెస్టర్న్ యూనివర్సిటీ కేంపస్ నుంచి దాదాపు రాత్రి ఎనిమిదిన్నరకి చలిలో వెనక్కి నడుచుకుంటూ వచ్చి బూట్లు కూడా విప్పకుండా అపార్ట్ మెంట్ వంటింట్లోకి దూరిన మనోజ్ కి వంట వండుతోన్న అప్పారావు కనిపించేడు. “ఏంటి గురూ డిన్నర్, కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్, వంట చేయడం అయిపోయిందా?” “ఇదిగో అవుతోంది, బట్టలు మార్చుకురండి, తినేద్దాం.” చెప్పేడు అప్పారావు. అన్నం తింటూంటే కబుర్ల మధ్యలో మనోజ్ చెప్పేడు, “వచ్చే నెలలో నాకు థీసిస్ చేయాలా, లేకపోతే నాన్ థీసిస్ ఆప్షన్ చేయాలా అనేది తేల్చుకోమని చెప్పేడు ఇవాళ గురుడు.” “ఏం చేద్దామనుకుంటున్నారు?” “నాన్ థీసీస్ అయితే ఓ ఐదారుసార్లు రాసిందే రాసి దిద్దించుకోవచ్చు. తర్వాత అది ఎక్కడ పారేసినా ఎవడికీ పట్టదు. థీసిస్ అయితే దాన్ని సమర్ధించుకోవాలి, ముగ్గురు ప్రొఫెసర్లకి కాళ్ళు కడగాలి, ఆ తర్వాత ఎవడికి నచ్చకపోయినా మరోసారి దిద్దడం, మరోసారి కాళ్ళు కడగడం అ

రాశి ఫలాలు

కథా భారతి
జ్యోతిష్ పండిట్, ఆస్ట్రో సిద్దాంతి, దైవఙ్ఞ చింతామణి, జంతు జీవన జిజ్ఞాసి, ప్రకృతి ప్రేమిక్, కధా రచయిత, బ్రహ్మశ్రీ డా॥ ఆర్. శర్మ దంతుర్తి,పి.హెచ్.డి (అమెరికా) (ఈ రోజుల్లో అసలు జ్యోతిషం అంటే ఏమిటో కూడా తెలియకుండా రాశి ఫలితాలు రాయవచ్చు అని గ్రహించడం కష్టం కాదు. “మేఘాలు వస్తే వర్షం వస్తుంది,” “రోహిణీ కార్తెలో ఎండబారి పడకుండా ఉంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు” లాంటి ఫలితాలు అంతర్జాలంలో, పత్రికల్లో చదివి నేను కూడా రాయగలను అని వెక్కిరించడానికి ఇది రాసాను. దీనికోసం తెలుగు రాయడం వస్తే చాలు; మిగతా ఎటువంటి పరిజ్ఞానం అవసరం లేదు. బ్రహ్మశ్రీ,, ఆస్ట్రో పండిట్, వేదాంతిక్ అనే బిరుదులు ఎన్నికావాలిస్తే అన్ని తగిలించుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనే వాటికి ఏ సంఖ్య వేసినా ఫర్వాలేదు. మీరుకూడా రాయవచ్చు; ప్రయత్నం చేయండి.) [ఈ సంపూర్ణ జీవిత ఫలితాలు రాశి దృష్ట్యా చూసి నిశితంగా గమనించి ర

నిర్ణయం

కథా భారతి
- పాలెపు బుచ్చిరాజు సాగర్ తో తన పెళ్లి ఇలా బెడిసి కొడుతుందని అనుకోలేదు జలధి. అన్నయ్య అయితే అమ్మానాన్నలని కాదని కులంగాని పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబం నుంచి వేరుపడి వేరే కాపురం పెట్టాడు. పిల్లల మీద ఎన్నో ఆశలు పెంచుకునే అందరు తలిదండ్రుల లాగే వారిద్దరూ చాలా కృంగి పోయారు. వాళ్ళని మరింత నిరాశ పరచడం ఇష్టం లేక, వాళ్ళు చూపించిన సంబంధమే చేసుకోవడానికి ఒప్పుకుంది జలధి. సాగర్ తలిదండ్రులు బాగా డబ్బున్నవాళ్ళు. అతను ఎం టెక్ . చదివి, వైజాగులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అందంగా ఆకర్షణియంగా ఉంటాడు. జలధి కూడా ఐ.టి లో డిగ్రీ చేసి, కేంపస్ ఇంటర్వ్యులో టి. సి. ఎస్. లో సెలక్టు అయింది. పెళ్ళయిన కొత్తలో మూడు నెలల పాటు రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. అత్తవారింట్లో ఆ ఆస్థి పాస్తులు, ఆడంబరాలు చూశాక, తమ తాహతుకు మించిన సంబంధమే అనిపించింది జలధికి. తలిదండ్రులకి ఒక్కడే కొడుకు అతి గారాబంగా పెరిగాడు. ఆ యింట్లో అ