Month: March 2017

పద్యం – హృద్యం

శీర్షికలు
- పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: సమస్య: రామా యన బూతుమాట రమణీ వినుమా! గతమాసం ప్రశ్న: సమస్య " నీటి పైన వ్రాత నిలిచెను గద" (శ్రీ K.N.వరప్రసాదు, ఏలూరు, గారు పంపినది) ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ తామ రాకు పైన తనరి మెరయుచుండు నీటి పైన వ్రాత నిలచెను గద నేతి బీర లోన నేయెంత నిండునో నీలి మేఘ మంత నీటి బుడగ పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్ దేశ దాస్య మెల్లఁ ద

అరుదెంచింది ఉగాది

కవితా స్రవంతి
- డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం నిన్నటి దాకా నిస్సంగ యోగినిలా నిలబడిన ప్లమ్ చెట్టు ఉన్నట్టుండి తెల్లని పూవుల అంగీ తొడుక్కుంది. మోడువారిన కొమ్మల మేపుల్ మొక్క మోసులు వేసి పచ్చని ఆకుల పమిట వేసింది. పురాతన పాంధుడు అనూరుడి రథం లో అవిశ్రాంతం గా తిరుగుతూ పుడమి కాంతను చురుకు చూపులతో పలుకరిస్తున్నాడు. వెచ్చని శరీరాలను కప్పుకుని చలి కాచుకున్న జాకెట్లు కచ్చగా చూస్తున్నాయి క్లోజెట్ లో చేరి. వసంతం వస్తోందని కబురందిన రాదారి తరువులు ఒళ్ళంతా రంగులు అలదుకుని స్వాగతించడానికి సిద్ధపడ్డాయి . మారుతున్న ఋతువులే మనిషికి ప్రకృతి చెప్పే పాఠములు కదా! ఆరు రుచులను ఆస్వాదించ మంటూ ఆరుదెంచింది ఉగాది

గొలుసు కవిత – రైలు ప్రయాణం

కవితా స్రవంతి
- (మనబడి స్వచ్చంద సేవకుల బృందం - భాస్కర్ రాయవరం, మల్లిక్ దివాకర్ల, కిశోర్ నారె, శైలజ కొట్ర, సుజన పాలూరి) రైలు ప్రయాణం అంటేనే అదో వింత సరదా మనసులోన పొంగిపొరలే జ్ఞాపకాల వరద! రిజర్వేషన్ ఆఫీసులో మొదలుకదా ఆ సరదా అది ఉంటే ప్రయాణమే హాయి కదా సోదరా! సెలవంటూ సరదాగా సాగనంపు బంధువులు వెళ్ళవద్దు ఉండమంటు కన్నీళ్లతో బంధాలు ఉండలేని వెళ్ళలేని మనసు ఊగులాటలు ఇంత రైలు ప్రయాణాన అంతులేని అనుభూతులు అన్నీ మరచి చుట్టూ చూస్తే ఎన్ని తమాషాలు! కిటికీ పక్కన సీటుకోసం పిల్లల కుస్తీపట్లు, ఎంత వింత అంత స్పీడు వెనక్కెెళ్ళే చెట్లు ఊయలూపు పయనంలో ఇట్టే కునికిపాట్లు! నేల తుడుస్తూ డబ్బులు అడిగే పిల్లల జాలి చూపులు గుండెను పిండే గొంతుకతోటి కబోది పాడే గీతాలు అందరుచేరి లాగించేసే చాయ్, సమోసాలు ఎదురు సీట్లో సీతను చూసి బాబాయ్ వేసే ఈలలు అది గమనించిన వాళ్ళ నాన్న కొరకొర చూసే చూపులు! అప్పటిదాకా తెలియన

తెలుగే వెలుగు

కవితా స్రవంతి
- సింహాద్రి (జ్యోతిర్మయి) ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు! (మనబడి బంధువు వ్రాసిన అద్భుత సాహిత్య ప్రక్రియ. అక్షరమాలతో తెలుగు వెలుగును చిందే తేటగీతులు) 1.తే. గీ. అ మ్మ జోలపాటకు సమమైన తెలుగు ఆ వు పాల కమ్మదనము లమరు తెలుగు ఇ టలి భాషతో సమమని ఎనయు తెలుగు ఈ డులేని మాధుర్యపు ఇంపు తెలుగు. 2.తే. గీ. ఉ గ్గు పాలతో అబ్బెడి ఊసు‌ తెలుగు ఊ హకు తొలిపలుకు నేర్పు ఒజ్జ తెలుగు ఋ ణము దీర్పలేము జనని ఇడిన తెలుగు ఋా తొ‌ మొదలగు పదముల నిడని తెలుగు. 3.తే. గీ. ఎ న్న భాషల లోకెల్ల మిన్న తెలుగు ఏ టి గలగల వినిపించు తేట తెలుగు ఐ క మత్యాన ప్రాంతీయ ఆస్తి తెలుగు ఒ. రుల భాషకు అచ్చుల ఊత తెలుగు 4.తే.గీ. ఓ పు చుండె నిర్లక్ష్యము చూప తెలుగు ఔ ర సహనాన భూదేవి, అమ్మ తెలుగు అం త మవనీకు భవితపై ఆశ తెలుగు అః వలదు నాకనకు మన ఆత్మ తెలుగు. 5.తే. గీ. క. వన సామ్రాజ్య విభవమ్ము గన్న తెలుగు

మనిషినే ప్రేమిస్తాను

కవితా స్రవంతి
- శిష్ట్లా. వి.యల్.యన్.శర్మ మనిషి జీవితానికి ప్రయాణం కావాలి కాలమనే వాహనం కావాలి చైతన్యమనే స్పందన కావాలి మజిలీలలో అనుభవాలు దాచుకొనే మనస్సు కావాలి..... ఈ ప్రయాణం నీ ఒక్కడిది కాదు నీ ఒక్కడికోసం కాదు కాలవాహినిలో నీవు కలసిపోయేవరకు...... నీ తోటి జీవి కొరకు.... ప్రక్కవానితో కలిసి బంధాల్ని ఆస్వాదిస్తూ మనిషిగా చరిత్రవౌతూ... మనసు సంద్రంలో భావాల అలలతో తీరాలు చేరాలనే తపనతో బడబాగ్నులు దాచుకుంటూ తుఫానులను తట్టుకుంటూ.... మనుషుల్ని కలపాలని మనిషిగా నిలపాలని నీ ప్రయాణం మనీషిగా సాగాలని.... జీవనదులన్నీ సముద్రంలో కలిసినట్లు మనసు జీవజల ప్రవాహం కాల సముద్రంలో కలిసి మనిషిని అందించాలని...... అందుకే మనిషి ప్రయాణమంటే నాకిష్టం.....అందుకే మనిషినే ప్రేమిస్తాను మనిషినై ప్రేమిస్తాను!

అమ్మ

కవితా స్రవంతి
- తమిరిశ జానకి ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో ముత్యాలు చుట్టి వేశాను అమ్మ మెడలో ! మంచి ముత్యాలు అక్షరముత్యాలవి ఆమె నా తెలుగుతల్లి ! తొలి దైవం అమ్మ తొలి పలుకు తెలుగు పలుకు అది ఎంతో ముద్దులొలుకు ! తొలి అడుగు తడబడినా తల్లికి అది మురిపమే ! తొలి ప్రణామం అమ్మకి అది విధాయకం నాకు ! ఉన్నఊరు కన్నతల్లి మాతృభాష మరువతగని వరాలు అవి మదిని నింపు సంతసాలు !

కృష్ణ పలుకు

కవితా స్రవంతి
- కృష్ణ అక్కులు ఆ.వె||వంట చేయు వరకు మంట కావలయును ఇంటిని మసి చేయు మంట వలదు కోపమధిక మయిన కొంపలు ముంచును కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||పేసు బుక్కు లోన పెరిగిన స్నేహము వాట్స అప్పు లోన పలుకు తీరు నాటి ఉత్తరముకు దీటుగా వచ్చునె కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||నల్ల ధనము నేడు చెల్లదనుట సరి వలదు హాని బీదవాని కెపుడు కలుపు తీయు నపుడు తులసి పోరాదు కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||ముద్దు చేయ రాదు మొద్దుబారు నటుల చురుకు కలిగి పనికి ఉరుకు నటుల పెంచినపుడె బిడ్డ మంచిగ బ్రతుకును కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||కలసి బ్రతుకునపుడు కలహాములవి వచ్చు కాని అందులోనె కలదు సుఖము పెద్దలెపుడు మనకు బుద్ది భోధించరె కృష్ణ పలుకు వినగ గెలుపు ఆ.వె||పెద్ద నోట్లు రద్దు పేదవాడికి పాట్లు కొత్త నోట్ల కొరత కొంప ముంచె మోడి మాపైనేల మోపితివి బరువు కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె

నీ పద్యావళు లాలకించు చెవులున్ ని న్నాడు వాక్యంబులన్

కథా భారతి
- ఆర్. శర్మ దంతుర్తి కైలాసం లోపలకి వచ్చే నారదుణ్ణి నందీ, విఘ్నేశ్వరుడు సాదరంగా ఆహ్వానించారు. ఆది దంపతులకి నమస్కారం చేసి అడిగాడు నారదుడు, "ఈశ్వరా, పులస్త్య బ్రహ్మ కుమారుడైన వైశ్రవణుడు తెలుసు కదా? ఆయన కుమారుడైన కుబేరుడనేవాడు మీ కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. అతన్ని కరుణించేదెప్పుడో తెలుసుకుందామని ఇలా వచ్చాను." భవుడు చిరునవ్వు నవ్వేడు జగదంబ కేసి చూసి. అమ్మవారు చెప్పింది, "నారదా ఈ తపస్సు ఫలించి కుబేరుడికి కోరికలు తీరినా ఆయన అడిగినది ఎంతో కాలం నిలవదు." నారదుడు ఆశ్చర్యంగా చూసాడు అదేమిటన్నట్టు. పార్వతి వివరణ ఇస్తున్నట్టూ చెప్పింది, "నువ్వే చూద్దువు గాని కదా? కోరికలీడేరడం వల్ల సుఖం వస్తుందనేది ఎంత నిజమో." అంతకన్న చెప్పడానికేమీ లేదన్నట్టు అమ్మవారు ఆగేసరికి భవుడు సమాధిలోకి జారుకున్నాడు. జగజ్జనని కూడా కళ్ళు మూసుకోబోయేంతలో ద్వారం వరకూ వచ్చే నందీశ్వరుడితో త్రిలోకసంచారి నారదుడు “నారాయణ,

నాకు నచ్చిన కథ – ఒక్కనాటి అతిథి

కథా భారతి
కథారచన - ఆచంట శారదాదేవి శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి ఈ కథ నాకెందుకు నచ్చిందంటే శ్రీమతి ఆచంట శారదాదేవి ఆ తరం రచయిత్రులలో మంచి వాసిగల రచయిత్రి. ఆవిడ రాసిన కథ ల ఆణిముత్యాలు. భావుకతని, వర్ణనల్ని జోడించి ఎంత బాగా రాస్తారో కథలావిడ, వాటిలో కొన్ని హారమై 'ఒక్కనాటి అతిథి' కథల సంపుటి రూపంలో మెరిశాయి 1965లో సున్నితమైన మనసుని సుందరంగా లలిత లలితంగా చిత్రీకరించి కనుల ముందు నిలబెట్టిన కథ శారదగారి 'ఒక్కనాటి అతిథి' మనిషి శరీరంలో అతుకుపెట్టలేని భాగం మనసొక్కటే అని నా అభిప్రాయం ఎంత డబ్బు పోసినా కొనుక్కోలేనిది మనసు. ఆ మనసు లోతుల్లోకి తుంగిచూస్తే కథలంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే 'ఒక్కనాటి అతిథి' కథ ఎంతో ఇష్టం నాకు. ఈ కథలోని కేతకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అప్పుడే విరిసిన పువ్వల్లే అతి నాజూకుగానూ, భావనాలోకంలో విహరిస్తూనే భాధ్యత తెల్సిన భారపు రూపం గానూ కనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రతి మనిషి మనసుకీ ఈ రెం

అనగనగా ఓ కథ – ఓ మహిళా దారి ఇదిగో…

కథా భారతి
- కొడవంటి కాశీపతిరావు మేస్టారి కోపం చూడ్డానికి పౌర్ణమినాటి వెన్నెల్లా తెల్లగా చల్లగా ఉన్నా అనుభవానికి వచ్చేసరికి నట్టనడి వేసవిలో మిట్టమధ్యాహ్నపు ఎండలా తీవ్రంగా ఉంటుంది. పైగా "అమ్మాయ్ హోంవర్కు చెయ్యలేదేం? ఓ గంట సేపు ఎండలో నిలబడు... ఊఁ "అంటే ఆ ఎండే వెన్నెల్లా వుంటుంది. అదే... "హోంవర్కు చెయ్యలేదూ... ఊఁ... సరే" అని పెదాలుబిగించి రెప్పెయ్యకుండా ఓసారి చూసి తలపంకించేరంటే అది మరి భరించలేను నేను. నేనే కాదు బహుశా ఎవరూను. అంతకుముందు క్లాసులో ఇంగ్లీషు ఏమేస్టారెలా చెప్పేవారో కూడా తెలియనంత మరపుకొచ్చిందిగాని, ఈ మేస్టారు మాత్రం పాఠంలోకి తిన్నగా వెళ్ళిపోయే వారు కాదు. ఒక్కో స్ట్రక్చరూ తీసుకుని తీగమీద డ్రిల్లు చేయించినట్టు చేయించి, ఒక్కో కంటెంటు వర్డూ తీసుకుని ఒక్కో పిప్పరమెంటు బిళ్ళ నోట్లోవేసి చప్పరించినట్టు చేయించేవారు. ఆపైన ఒక్కసారో, రెండుసార్లో మరి పాఠం చదివించి అరటిపండు వలిచి చెతిలో పెట్