- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
జీవితానికి
ఆటలు, చదువూ రెండూ అవసరమే.
అమ్మ, ఆలి ఇద్దరూ అవసరమే.
వయసు,మనసు రెండూ అవసరమే.
శ్రమ, విశ్రాంతి రెండూ అవసరమే.
నవ్వు, ఏడుపు రెండూ అవసరమే
పగలు, రాత్రి రెండూ అవసరమే.
ప్రేమ,ద్వేషం రెండూ అవసరమే.
జ్ఞాపకం, మరపు రెండూ అవసరమే
భక్తి, రక్తి రెండూ అవసరమే.
సంసారం,సన్యాసం రెండూ అవసరమే.
బంధం, మోక్షం రెండూ అవసరమే.
ఆవేశం, ఆలోచన రెండూ అవసరమే
ప్రేమ, ద్వేషం రెండూ అవసరమే
ఆసక్తి, విరక్తి రెండూ అవసరమే
పరవశం, పరితాపం రెండూ అవసరమే
నమ్మకం, అనుమానం రెండూ అవసరమే
శిక్ష, రక్ష రెండూ అవసరమే
నిజం, అబద్ధం రెండూ అవసరమే
గోప్యం, బహిరంగం రెండూ అవసరమే
మౌనం, భాషణం రెండూ అవసరమే
భోజనం, ఉపవాసం రెండూ అవసరమే
కలిమి, లేమి రెండూ అవసరమే
ఊహ,అనుభవం రెండూ అవసరమే!
జననం, మరణం రెండూ అవసరమే.
****