సారస్వతం
మనుచరిత్ర – “పెద్దనగారి వర్ణనా వైదుష్యము”
- సత్యనారాయన పిస్క
ఆంధ్ర సాహిత్యములో రామాయణ, మహాభారత, భాగవతముల తర్వాత అత్యధిక ప్రాచుర్యమును పొందిన కావ్యము, ఆంధ్రకవితా పితామహుడుగా పేరు గడించిన అల్లసాని పెద్దనగారి అద్వితీయ ప్రబంధంమనుచరిత్రము. ఈ కావ్యము తదనంతర కాలములో వెలువడిన అనేక ప్రబంధములకు మార్గదర్శకమై, తలమానికంగా అలరారింది.
మనుచరిత్ర 6 ఆశ్వాసాల మహాప్రబంధం అయినప్పటికీ, మొదటి 3 ఆశ్వాసాలే సారస్వతాభిమానులను అమితంగా ఆకట్టుకుని, వారిని రసజగత్తులో ఓలలాడించినవని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు. పెద్దన కవీంద్రుల లేఖినిలో ప్రాణం పోసుకున్న 2 అద్భుతమైన సజీవపాత్రలు మన కనుల ముందు కదలాడుతూ, తమతో పాటు మనలను కూడా హిమాలయసానువుల్లోకి లాక్కెళతాయి. ఆ 2 పాత్రల్లో మొదటిది -ప్రవరుడు;రెండవది -వరూధిని.
ఆర్యావర్తములోని అరుణాస్పదపురము అనే గ్రామములో నివసిస్తున్న బ్రాహ్మణ యువకుడు ప్రవరుడు. నియమబద్ధంగా పరమ నైష్ఠిక జీవితాన్ని గడుపుతున్న ఒక ఆదర్శ గృహస్థు. ....
అన్నమయ్య శృంగార నీరాజనం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
వీడివో అల విజయరాఘవుడు
విజయ వీరరాఘవ స్వామిపై శృంగార కీర్తన ఆలాపిస్తున్నాడు అన్నమయ్య తాను ఒక భక్తురాలై. కడప జిల్లా వావిలపాడులో వెలసిన శ్రీరామచంద్రుణ్ణి వర్ణిస్తున్నాడు. చూడండి.
కీర్తన:
పల్లవి: వీడివో అల విజయరాఘవుడు
పోడిమి కొలువున పొదలి చెలియ || పల్లవి||
చ.1 రాముడు లోకాభిరాముడు గుణ
ధాముడసురులకు దమనుడు
తామర కన్నుల దశరధ తనయుడు
మోమున నవ్వి మొక్కవే చెలియ ||వీడివో||
చ.2 కోదండధరుడు గురుకిరీటపతి
కోదిగసురముని పూజితుడు
అదిమపురుషుడు అంబుదవర్ణుడు
నీ దెసచుపులు నించే చెలియ ||వీడివో||
చ.3 రావణాoతకుడు రాజశేఖరుడు
శ్రీవేంకటగిరి సీతాపతి
వావిలి పాటిలో వరమూర్తి తానై
వోవరి కొలువున ఉన్నాడే చెలియ ||వీడివో||
(రాగం: శుద్ధవసంతం; రేకు: 1609-5, కీర్తన; 26-52)
విశ్లేషణ:
పల్లవి: వీడివో అల విజయరాఘవుడు
పోడిమి కొలువున పొదలి చెలియ
ఓ చెలులారా! వినండి అలనాటి విజయ వీర రాఘవుడు వీడ
కరోనా కాటు
-ఆర్. శర్మ దంతుర్తి
మహా భాగవతంలో కధ ఇది. కృష్ణుడు తన మనుమడైన అనిరుద్ధుణ్ణి రక్షించడానికి శోణపురంలో ఉన్న బాణాసురుడిమీదకి దండెత్తి వెళ్తాడు. ఈ బాణాసురుడు గొప్ప శివభక్తుడు. వాడితో యుద్ధం చేస్తూ వైష్ణవ జ్వరం అనేదాన్ని కృష్ణుడు ప్రయోగిస్తాడు, ఆ బాణాసురుడు వేసిన శివజ్వరం అనే అస్త్రానికి ప్రతిగా. మొత్తానికి కధలో బాణాసురుడి ఉన్న వేయి చేతుల్లో నాలుగింటిని వదిలి మిగతావాటిని ఛేధిస్తాడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో. ఆ తర్వాత శివజ్వరం అనేది కృష్ణుడి దగ్గిరకి వచ్చి క్షమించమని అడిగితే ఆయన చెప్తాడు, “నన్ను శరణు జొచ్చావు కనక బతికిపోయావు, నన్ను తల్చుకుంటే ఎవరికీ నీ వల్ల కష్టాలు రావు,” అని. ఈ కధ, జ్వరం అనే అస్త్రాలు ఎందుకు గుర్తొచ్చాయంటే గత ఏడాది చివర్లో ప్రపంచం మీద విరుచుకుపడిన ఇటువంటి అస్త్రమే కరోనా. ఇది ఎక్కడ ఎలా మొదలైంది అనేది మాత్రం ఇంకా ఎవరికీ తెలియకుండా ఉంది. దానిక్కారణాలు అనేకం, వచ్చినది ప్రయోగశాలలోం
అన్నమయ్య శృంగార నీరాజనం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
ఈ శృంగార కీర్తనలో ఒక స్త్రీ తన ప్రియుడిని ఇంటికి రమ్మంటున్నది. నేను నీకు కొత్త కాదు, నువ్వు అరువు తెచ్చుకునే వస్తువువి కావు అని చెప్పడంలో ఆమె అతన్ని నిందించి ఉంటుంది . ప్రియుడు ఇల్లు వదిలి పోయాడు. ఆమె కోరుకునేది ఒక్కటే. ప్రియుడు తిరిగి ఇంటికి రావడం. నేను నిన్ను ఏమీ అనను అని వాగ్దానం చేస్తున్నది. ఏ అరమరికలు లేకుండా బేలగా, నేరుగా అడుగుతున్నది “ఇంటికి రావయ్యా” అని. ఆ ముచ్చటేమిటో మనమూ విందాం రండి.
కీర్తన:
పల్లవి: నే నీకు వేరు గాను నీవు నా కెరవు గావు
యే నెపమూ వేయ నీపై నింటికి రావయ్యా ॥పల్లవి॥
చ.1 చెక్కునఁ బెట్టిన చేయి సేసవెట్టే నీ మీఁ ద
ముక్కుపైఁ బెట్టిన వేలు ముందే మెచ్చెను
వక్కణ లడుగనేల వలచితి నాఁ డే నీకు
యిక్కువలు చెప్పేగాని ఇంటికి రావయ్యా ॥నే నీకు॥
చ.2 సిగ్గువడ్డ మొగమున సెలవి నవ్వులు రేఁగె
వెగ్గళించిన కన్నులే వేడుకఁ జూచె
కగ్గి నీతో నలుగను కడు ముద్దరాలను
యెగ్
అన్నమయ్య శృంగార నీరాజనం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
కీర్తన:
పల్లవి: చూడఁ బిన్నవాఁడు గాని జూటుఁదనాలు తనవి
యేడఁ జూచినాఁ దానే యేమని చెప్పుదునే ॥పల్లవి॥
చ.1. దొంగాడుఁ గృష్ణుఁడు తొయ్యలుల మొగములు
తొంగిచూచీ ముంగురులు దూలాడఁగా
ముంగిట ముద్దులువెట్టి మోవితేనె లానుకొంటా
యెంగిలిసేసి నిదె యిందరి నొక్కమాఁటె ॥చూడ॥
చ.2. వెన్నముద్దుకృష్ణుఁడు వేడుకతో జవరాండ్ల-
చన్నులంటి సారె సారె సాముసేసీని
చిన్నిచేతు లటుచాఁచి సిగ్గులురేఁచి చెనకి
సన్నలు సేసి పిలిచి సరసములాడీని ` ॥చూడ॥
చ.3. వుద్దగిరికృష్ణుఁడు వొడిపట్టి మానినుల
అద్దుకొని కాఁగిలించి ఆసలురేఁచీ
వొద్దిక శ్రీవేంకటాద్రి నొనగూడి మాచేఁతలు
సుద్దులుగాఁ జెప్పి చెప్పి సొలసి నవ్వీనే ॥చూడ॥
(రాగము: బౌళి, శృం.సం.కీర్తన; రేకు: 839-2; సం. 18-230)
విశ్లేషణ:
పల్లవి: చూడఁ బిన్నవాఁడు గాని జూటుఁదనాలు తనవి
యేడఁ జూచినాఁ దానే యేమని చెప్పుదునే
చూడడానికి చాలా చిన్న బాలుడిలా అమాయకంగా కనిపిస్తున్
అన్నమయ్య శృంగార నీరాజనం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో సకల జానపద మాటలు దాగి ఉంటాయి. దంపుళ్ళ పాటలు, జాజరపాటలు, ఉయ్యాల పాటలు, కూగూగు పాటలు, లాలిపాటలు, తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలూ అన్నీ ఉన్నాయి. ఆ కాలంలో చిన్నపిల్లలను గుర్రమెక్కినట్లుగా మెడలపై ఎక్కించుకుని తిరుగుతూ పాడే పాటను కూగూగు పాటలు అనే వారు. అన్నమయ్య అలా ఎవరైనా పాడేటప్పుడు గమమించి ఈ కీర్తన మనకు కమనీయంగా అందించాడు.
కీర్తన:
పల్లవి: గుఱు తెఱిఁగిన దొంగ కూగూగు వీఁడె
గుడిలోనె దాఁగేని కూగూగు ॥పల్లవి॥
చ.1. నెలఁతల దోఁచేని నీళ్లాడఁగానె
కొలని దరిని దొంగ కూగూగు
బలువైనవుట్ల పాలారగించేని
కొలఁది మీఱిన దొంగ కూగూగు ॥గుఱు॥
చ.2. చల్ల లమ్మంగ చనుకట్టు దొడికేని
గొల్లెతలను దొంగ కూగూగు
యిల్లిల్లు దప్పక యిందరి పాలిండ్లు
కొల్లలాడిన దొంగ కూగూగు ॥గుఱు॥
చ.3. తావుకొన్న దొంగఁ దగిలి పట్టుండిదె
గోవులలో దొంగ కూగూగు
శ్రీ వేంకటగిరి చెలువుండ
అన్నమయ్య శృంగార నీరాజనం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
ఈకీర్తనలో అన్నమయ్య ఒక తమాషా పద్ధతిలో అమ్మవారి సొగసులను వర్ణిస్తాడు. అమ్మా నువ్వు సహజంగానే అందగత్తెవు. నీకు ఈ కృత్రిమ మెరుగులు పూతలు ఎందుకు అంటూ ఒక చెలికత్తెగా మారి ప్రశ్నిస్తాడు. చాలా మంది భాషా పండితులు ఆయన కీర్తనల్లో ఎన్నోచోట్ల దుష్టసమాసాలు ఉన్నట్టూ, వ్యాకరణ దోషాలున్నట్లు గమనించారు. ఒక విషయం మనవి చేయాలి. అన్నమయ్య సంస్కృతాంధ్రాలని ఔపోసన పట్టిన వాడు. ఆయన భాష చేతగాక, వ్యాకరణం తెలియక అలా రాయలేదు. చంధోబద్ధమైన శతకాలనేకం రాశాడు. కీర్తనల్లో ఆయన చెప్పాలనుకున్న భావానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు అంతే! జానపదులను కూడా ఆకట్టుకోడానికి అనేక ప్రయోగాలు చేశాడు. కొన్ని కీర్తనలు పూర్తిగా పామరుల భాషలోనే ఉంటాయి. కొన్నేమో అచ్చతెలుగు పదాల్లో కనిపిస్తాయి. కొన్నేమో గ్రాంధికమైన సంస్కృతము మరియు తెలుగు భాషల్లో ఉంటాయి. మరికొన్నిట్లో అన్నిట్నీ కలిపి కలగాపులగంగా రాయడం. ఈవిధంగా అన్నమయ్య కీర్తనల్ని ఏ
అన్నమయ్య శృంగార నీరాజనం 2020
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
నెలత నిన్ను మోహించడమే నేరమైందటయ్యా! ఇదెక్కడి తంటా.. అమ్మ అలమేలు మంగమ్మను గమనించవయ్యా! అంటున్నాడు అన్నమయ్య.
కీర్తన:
పల్లవి: నెలఁత మోహించినదే నేరమటయ్యా
పలువిన్నపాల కిఁకఁ బనిలేదయ్యా ॥పల్లవి॥
చ.1 చెక్కునఁ జేర్చినచేత సేమంతిరేకులు రాలె
చొక్కపు నీసతి దెస చూడవయ్యా
నిక్కి చూడ నంతలోనే నిలువునఁ గొప్పు వీడె
వెక్కసపుఁజలమేల విచ్చేయవయ్యా ॥నెలఁ॥
చ.2 ముంచిన వూర్పులవెంట ముత్యపుఁగన్నీను జారె-
నించుకంత తెమలపు యిదేమయ్యా
చంచలపునడపుల సందడించెఁ జెమటలు
అంచెల నీమనసు కాయటవయ్యా ॥నెలఁ॥
చ.3 పెట్టినపయ్యదలోన బేఁటుగందములు రాలె
చిట్టకాల కింతి నింతసేసితివయ్యా
యిట్టె శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
అట్టె మేను పచ్చి సేతురటవయ్యా ॥నెలఁ॥
(రాగం ఆహిరి; రేకు 1195-3; సం. 21-501)
విశ్లేషణ:
పల్లవి: నెలఁత మోహించినదే నేరమటయ్యా
పలువిన్నపాల కిఁకఁ బనిలేదయ్యా
అమ్మాయి నిన్ను ప్రేమించడమే నేరమైపోయ
అన్నమయ్య శృంగార నీరాజనం
టేకుమళ్ళ వెంకటప్పయ్య
అన్నమయ్య కీర్తనల్లో అనేక రసవత్తర ఘట్టాలను సృష్టించాడు. ముఖ్యంగా భాగవత సన్నివేశాలను సరస సన్నివేశాలతో సంభాషణలతో మనం ఈ రోజుల్లో అనుకునే ఒక స్కిట్ (ఒక చిన్న హాస్య సంభాషణ) లాంటిది. ఈ జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి" అనే శృంగార కీర్తనలో సంభాషణల (డైలాగుల) రూపంలో ఎంత రక్తి కట్టించాడో చూడండి. అన్నమయ్య గొల్లభామలను "గొల్లెత" అని పిలవడం పరిపాటి. అలాంటి ఒక చల్లలు (మజ్జిగ) అమ్మే ఒక గొల్లభామతో సరసాలాడుతున్నాడు బాల కృష్ణుడు. విశేషమేమిటంటే ఆ గొల్లభామ ఏం తీసిపోలేదు తనూ నాలుగాకులు ఎక్కువే చదివినట్టుంది. మీరూ విని ఆనందించండి.
కీర్తన:
పల్లవి: జాణతనా లాడేవేలే జంపుగొల్లెతా వోరి
ఆణిముత్యముల చల్లలవి నీకు గొల్లలా
చ.1 పొయవే కొసరుజల్ల బొంకుగొల్లెతా వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా
మాయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా వోరి
పోయవొ పోవొ మాచల్ల పులుసేల నీకును? || జాణతనా||
చ.2 చిలుకవే గోరం