నీకు నీవే పోటీ!
అమరనాథ్. జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257
సామాజిక వాతావరణంలో పోటీతత్వం రోజు రోజుకు పెరిగిపోతొంది. చదువుల్లో, పోటీ పరీక్షల్లో, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో, ఉద్యోగ పదోన్నతుల్లో ఈ పోటీ సర్వసాధారణంగా మారిపోయి అనేకానేక మానసిక ఉద్వేగాలకు తెరలులేపుతోంది! ఆరోగ్యకరమైన పోటీ తత్వం అవసరమైన విషయమే కానీ అనవసర పోటీతత్వంతో మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసికోవటంలోనే అసలు సమస్యలనేవి ప్రారంభం అవుతాయి. మనలో చాలామందికి వుండే అలవాటు మనల్ని ఇతరులతో పోల్చుకుని మనల్ని తక్కువ చేసుకోవటం. పరీక్షల్లో అనుకున్న రాంక్ సాధించగలనా? ఉద్యోగ ప్రయత్నంలో అనుకూల ఫలితం లభిస్తుందా? ఇలా అనేక విషయాలకి సంబంధించి మనమే కాదు మనతో పాటు అదే స్థాయిలో ఈ పోటీ పరీక్షలకి, ఉద్యోగ ఇంటర్వూస్ కు వచ్చే వారిలో కూడా ఇటువంటి ఆందోళనే ఉంటుంది. కారణం మన కంటే ఇతరులలో ఎక్కువ జ్ఞానం ఉందనో, మన కంటే ఎక్కువ చదువుందనో, మనకంటే బాగా మ