తప్పనిసరి మనిషి
- తాటిపాముల మృత్యుంజయుడు
మానవజాతి దుర్భర కష్టంలో వున్నపుడు చీకటి మబ్బులనుండి వెలుగు కోణాల దిక్కు నడిపించడానికి ఒక మార్గదర్శకుడు అవసరమవుతాడు. పుట్టుకొస్తాడు కూడా. అలాంటి వారినే 'తప్పనిసరి మనిషి ' (Necessary Human Being) అంటారు. ఈ యుగంలో అలాంటి కోవకు చెంది, అన్ని దేశాల ప్రముఖులతో ప్రశంసింపబడ్డ 'తప్పనిసరి మనిషి ' మహాత్మ అని పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధి.
'సత్యశోధన, అహింస, సత్యాగ్రహం'లను త్రిశూల ఆయుధంగా మార్చుకొని భరతజాతికి రెండు శతాబ్దాలుగా పీడించిన దాస్యం నుండి విముక్తి కలిగించి మామూలు మనిషిగా జీవించిన మహనీయుడు అతడు.
మానవజాతి అభివృద్ధి చెందాలంటే గాంధీజీని, అతను చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టక పక్కకు తప్పించడం అసాధ్యం. మానవులందరు తోబుట్టువులు అని మనస్పూర్తిగా నమ్మిన మనిషి అతను.
మహాత్మ గాంధి జీవించిన శతాబ్దంలో, అతను జన్మించి, నడయాడిన గడ్డపై పుట్టిన భారతీయులందరు అదృష్టవంతులు!
'స