సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య ముగ్ధ నాయిక గురించి అన్నమయ్య చెప్పిన చక్కని కీర్తన గురించి తెలుసుకుందాం. ముగ్ధ అనగా ఉదయించుచున్న యౌవనముగలది. పండ్రెండేండ్ల వయసుగల యువతి అని నిఘంటువులు చెప్తున్నాయి. రామరాజ భూషణుడు తన కావ్యాలంకార సంగ్రహం లో ఇలా నిర్వచించాడు. కీర్తన: శా. ఆలాపంబున కుత్తరంబొసగ దాయాసంబునంగాని, తా నాలోకింపదు; పాటలాధరమరందాస్వాద సమ్మర్ధ ముం దాళంజాలదు; కౌగిలీయదు, తనూ తాపంబు చల్లాఱగా నేలజ్జావతి ; త ద్రతంబు దయితాభీష్టంబు గాకుండునే? అనగా అప్పుడే ఉదయించుచున్న యౌవనము గల స్త్రీకి బిడియము మొదలైనవి సహజంగానే ఉంటాయని చెప్పాడు. మనం భక్తి విషయానికి వస్తే... అన్నమయ్య ప్రతి పదమూ భక్తి రసస్ఫోరకమే అన్న విషయం తెలుస్తుంది. ఆది శంకరుల వారు వివేకచూడామణిలో "మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి" అంటాడు. అన్నమయ్య తను సర్వం సహార్పణ గావించి సృష్టించిన అనంత సాహిత్య నిధిని ఎన్ని వందల సంవత్సరాలైనా మన

నరసింహ సుభాషితం

సారస్వతం
- ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి శ్లోకం: यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।। యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం? । లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి? ।। సంధి విగ్రహం యస్య, న, అస్తి, స్వయం, ప్రజ్ఞా, శాస్త్రం, తస్య, కరోతి, కిం। లోచనాభ్యాం, విహీనస్య, దర్పణః, కిం, కరిష్యతి।। శబ్దార్థం యస్య = ఎవనికి, నాస్తి = లేదు, తస్య = అతనికి, కరోతి = చేస్తుంది, కిం =ఏమి, శాస్త్రం = ఏ విషయ గ్రంథమైనా, లోచనాలు = కళ్ళు, విహీనస్య = లేని వానికి, దర్పణః = అద్దం, కిం =ఏమి, కరిష్యతి =చేయగలదు Meaning One who does not have any stuff with in him or does not possess any inherent abilities and grasping of things, what a Shastra or subject can do to him? Means, subjects simply cann

అష్టకాలు – రాఘవాష్టకం

సారస్వతం
- కాకుమాని మూర్తికవి కలికిరా పూములికిరా ముద్దు చిలుకరా అలుకేలరా కులుకు గుబ్బల తళుకు చెలగే కొమ్మరా ముద్దుగుమ్మరా అళులు మ్రోయగ నంతకంతకు నలరి వెన్నెల గాయగా జలజలోచన నోర్వలేదిక జానకీపతి రాఘవా ఏర పొందును జామురా నా స్వామిరా నికు ప్రేమరా తీరు గలిగిన బొమ్మ చక్కని దివ్య కపురపు క్రోవిరా సారె సారెకు యేచ నేటికి జాణ శేఖర మానరా రార యేలుకొ బుక్కపట్ణము రామచంద్ర దయానిధి వద్దురా యెలుగొద్దురా యీ ప్రొద్దుయే సరిప్రొద్దురా బుద్ధి విను నా సద్దు లడిగెడి ముద్దుబాలకి గోలరా ఒద్దికతొ కూడుండరా యీ ప్రొద్దు నేనిక మ్రొక్కెదా సుద్దులాడక సుదతి నేలుకొ సొంపుతోడుత రాఘవా మాటిమాటికి యింతేటికి యిచ్చోటికి అలుకేంటికీ నాటినాటికి విరహమెచ్చెను నలినలోచను తేగదే పూట యొక యేడాయనే పూబోణికి అలివేణికి బోటినేచ నీబోటివారికి పొందుకాదుర రాఘవా కొమ్మరా (నిను సమ్మెరా) ముద్దుగుమ్మ అన్నియు నెరుగురా ఎమ్మెమీరగ యేచనేటీకి యింతిపూ

‘దీప్తి’ వాక్యం – ఆధ్యాత్మిక కళలు

సారస్వతం
సర్వలోక శరణ్యాయ రాఘవాయ! - దీప్తి కోడూరు     తెల్లవారితే యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన రాముణ్ణి, కన్న కొడుకు మీద మమకారంతో, అసూయాపరురాలైన పినతల్లి కైక అడవులకు  పంపమని దశరథుని కోరింది.  తండ్రి మాటను అనుసరించి రాముడు భార్య, తమ్ముడితో కలిసి అడవులకు పయనమయ్యాడు. ఋష్యాశ్రమాల్లో మహర్షుల సత్సంగంలోనూ, జనపదాల్లో సామాన్యులను బాధిస్తున్న రాక్షసులను హతమారుస్తూ, ముని జీవనం సాగిస్తున్నారు వారు.  అలా ఉండగా ఒకనాడు మాయలేడి నాటకంతో మోసగించి రావణుడు సీతను అపహరించి సముద్రానికి ఆవలి వైపున ఉన్న తన లంకా  నగరానికి తీసుకుపోయాడు.  సీత లేని రాముడు శశి లేని నిశిలా కుంగిపోయాడు.  ఏమైందో, ఎక్కడ వెతకాలో తెలియక కుప్పకూలిపోయాడు రాముడు. ఎన్నో ప్రయాసలు, వెతుకులాటల తర్వాత, ఎందరో సన్నిహితుల సహాయంతో సీత జాడ తెలుసుకున్నాడు.  లంక మీదకి దండెత్తాలని నిర్ణయించుకున్నాడు.  హనుమత్సహిత సుగ్రీవ, అంగ, జాంబవం

అనుభూతి – ప్రాచీన దృక్పథం (3- భాగం)

సారస్వతం
- సునీల పావులూరు "దేహో యమన్న భవనోన్నమ యస్తుకోశ శ్చాన్నేన జీవతి వినశ్యతి తద్విహీనః, త్వక్చర్మ మాంసరుధిరాస్థి పురీషరాశి ర్నాయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధం:"5 "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్| అన్నాధ్దేవ ఖల్విమాని భూతాని జాయంతే| అన్నేన జాతాని జీవంతి| అన్నం ప్రయం త్యభిసం విశంతీతి| తద్విజ్ఝాయ|"6 ప్రతిప్రాణీ అన్నం వలన జన్మించి, అన్నంతో జీవించి, అన్నంలోనే లయిస్తోంది. ఈ అన్నమయ్య కోశాన్ని "కర్మేన్ద్రియైః పంచభిరంచితోయం ప్రాణో భవేత్ప్రాణమయస్తు కోశః, యేనాత్మవానన్న మయోన్న పూర్ణాత్ ప్రవర్తతే సౌ సకల క్రియాసు"7 "ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్| ప్రాణాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే| ప్రాణేన జాతాని జీవంతి| ప్రాణం ప్రయం త్యభిసంవిశంతీతి| తద్విజ్ఞాయ|" 8 అన్నమయకోశాన్నావరించుకొని ప్రాణమయకోశం ఉంది. ఇది స్థూల శరీరాన్ని ఆవరించుకొని ఉంది. ప్రాణమయ కోశానికి కూడా జనన మరణాదులు ఉన్నాయి. "జ్ఞానేన్దియాణి చ మన

రామాయణంలో ముఖ్య ఘట్టాలు

సారస్వతం
- డా. పద్మజా వేదాంతం శ్రీమద్రామాయణం ఆదికావ్యం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. దీనిని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించాడు. ఇది శ్రీరాముని జీవిత చరిత్ర లేదా ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇందులో ఆరు కాండలు ఉన్నాయి. (1) బాలకాండ (2) అయోధ్యకాండ (3) అరణ్యకాండ (4) కిష్కింధకాండ (5) సుందరకాండ (6) యుద్ధకాండం, (ఏడవది అయిన ఉత్తరకాండ తరువాత చేర్చబడింది.) 1) బాలకాండ- అయోధ్యానగర మహారాజు దశరధుడు. ఆయనకి ముగ్గురు భార్యలు. చాలా కాలం సంతానంన లేక, పుత్రకామేష్టి యాగం చేశాక, ఆయనకు నలుగురు పుత్రులు కలుగుతారు. కౌసల్యకి రాముడు, కౌకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. కులగురువైన వశిష్ట మహర్షి వద్ద వారు విద్యాభ్యాసం చేస్తారు. ఈ రాజకుమారుల జననం, విద్యాభ్యాసం వశిష్టమహర్షి ద్వారా జరుగుతాయి. వీరి వివాహం విశ్వామిత్ర మహర్షి ద్వారా జరుగుతుంది. విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణకై రామలక్ష్మ